Car Tips: మీ కారులో ఆ వస్తువును గమనించారా..? లాంగ్ డ్రైవ్స్‌కు చాలా అనుకూలం

ప్రస్తుత రోజుల్లో కారు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరి వస్తువుగా మారింది. గతంలో కారు కొనుగోలు చేస్తే ప్రత్యేకంగా డ్రైవర్‌ను పెట్టుకునే వారు. అయితే కారు తయారీలో పెరిగిన టెక్నాలజీ కారణంగా ప్రతి ఒక్కరూ సెల్ఫ్ డ్రైవింగ్‌ చేసేలా వివిధ కార్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది ప్రతి రోజూ కార్లను నడుపుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ కారులో ఉండే డెడ్ పెడల్ గురించి అందరికీ తెలియదు.

Car Tips: మీ కారులో ఆ వస్తువును గమనించారా..? లాంగ్ డ్రైవ్స్‌కు చాలా అనుకూలం
Dead Pedal
Follow us
Srinu

|

Updated on: Oct 06, 2024 | 7:15 PM

ప్రస్తుత రోజుల్లో కారు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరి వస్తువుగా మారింది. గతంలో కారు కొనుగోలు చేస్తే ప్రత్యేకంగా డ్రైవర్‌ను పెట్టుకునే వారు. అయితే కారు తయారీలో పెరిగిన టెక్నాలజీ కారణంగా ప్రతి ఒక్కరూ సెల్ఫ్ డ్రైవింగ్‌ చేసేలా వివిధ కార్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది ప్రతి రోజూ కార్లను నడుపుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ కారులో ఉండే డెడ్ పెడల్ గురించి అందరికీ తెలియదు. మీరు కారు లోపలికి అడుగు పెట్టినప్పుడు మీకు యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ వంటి పెడల్స్ కనిపిస్తాయి. అయితే కొన్ని కార్లలో డెడ్ పెడల్ అని పిలిచే మరో పెడల్‌ కూడా ఉంటుంది. దీనిని చాలా మంది ఫుట్రెస్ట్ అని కూడా పిలుస్తారు. ఈ పెడల్ సాధారణంగా ఎడమ వైపున, క్లచ్ పెడల్ పక్కన ఉంటుంది. డెడ్ పెడల్‌కు సంబంధించిన వినియోగాన్ని తెలుసుకోవడం, దానిని సరిగ్గా ఉపయోగించడం డ్రైవర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో డెడ్ పెడల్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

మీరు హైవే పై ఎక్కువ దూరం డ్రైవింగ్ చేస్తుంటే అంతగా ట్రాఫిక్ లేని సమయంలో  ఎడమ కాలుకు కాస్త విశ్రాంతి కల్పించేందుకు ఈ డెడ్ పెడల్‌ను రూపొందించారు. నిత్యం కాలు క్లచ్ పెడల్‌పైనే ఉండి, క్లచ్ ప్లేట్ హాని కలిగించే అవకాశం ఉన్నందున ఇది సమస్యాత్మకంగా ఉంటుంది. డెడ్ పెడల్ ఈ పరిస్థితిలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇది ఎడమ పాదం ఎలాంటి పెడల్లను నొక్కకుండా సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకోవడానికి స్థలాన్ని అందిస్తుంది. మీ కారులో డెడ్ పెడల్ ఉండటం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు భద్రతను పెంచుతుంది. ఇది ప్రమాదాలను తగ్గించడంతో పాటు మలుపుల ద్వారా కార్లను నిర్వహించేటప్పుడు డ్రైవర్‌కు మెరుగైన నియంత్రణను  అందిస్తుంది. 

ఈ డెడ్ పెడల్ మరింత రిలాక్స్ డ్రైవింగ్ అనుభవాన్ని ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా దూర ప్రయాణాల్లో డెడ్ పెడల్ లేకపోతే డ్రైవర్లు ఎక్కువగా తమ పాదాలను క్లచ్ పెడల్‌పై ఉంచడం లేదా అలా వేలాడదీయడం వల్ల డ్రైవర్ త్వరగా అలసిపోతాడు. డెడ్ పెడల్‌నుఉపయోగించడం ద్వారా డ్రైవర్లు మెరుగైన డ్రైవింగ్‌ను నిర్వహించే అవకాశం ఉంది. డెడ్ పెడల్ వినియోగచడంతో కాళ్లు, పాదాలపై ఒత్తిడిని తగ్గుతుంది. ఇది సౌకర్యాన్ని పెంచడమే కాకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు దృష్టి, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. డెడ్ పెడల్ కారు రూపకల్పనతో డ్రైవర్లకు వారి ఎడమ పాదం కోసం సౌకర్యవంతమైన విశ్రాంతి స్థలాన్ని అందిస్తుంది. ఇది భద్రతను ప్రోత్సహించడంతో అలసటను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మొత్తం డ్రైవింగ్ సౌకర్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది, ముఖ్యంగా లాంగ్ డ్రైవింగ్ చేసే వారికి ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది డ్రైవర్లు ఈ ఫీచర్ వాడే ముందుక వారికి కొంత కొత్తగా ఉంటుంది. క్రమేపి వారికి అలవాటు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..