AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple Diwali Sale: దసరా అవ్వకుండానే దీపావళి సేల్ ప్రకటించిన యాపిల్.. అన్ని ఉత్పత్తులపై ఆకర్షణీయ తగ్గింపులు

అమెజాన్  గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగింపు దశకు చేరుకోవడంతో భారతదేశంలో పండుగ విక్రయాలు జోరందుకున్నాయి . ఇప్పుడు యాపిల్ ఇండియా వెబ్‌సైట్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ప్రత్యేక సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా దసరా హడావుడి పూర్తి అవ్వకుండానే దీపావళి సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో యాపిల్ అన్ని ఉత్పత్తులపై నమ్మలేని తగ్గింపులను ప్రకటించింది.

Apple Diwali Sale: దసరా అవ్వకుండానే దీపావళి సేల్ ప్రకటించిన యాపిల్.. అన్ని ఉత్పత్తులపై ఆకర్షణీయ తగ్గింపులు
Apple Festive Sale
Nikhil
|

Updated on: Oct 06, 2024 | 7:30 PM

Share

అమెజాన్  గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగింపు దశకు చేరుకోవడంతో భారతదేశంలో పండుగ విక్రయాలు జోరందుకున్నాయి . ఇప్పుడు యాపిల్ ఇండియా వెబ్‌సైట్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ప్రత్యేక సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా దసరా హడావుడి పూర్తి అవ్వకుండానే దీపావళి సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో యాపిల్ అన్ని ఉత్పత్తులపై నమ్మలేని తగ్గింపులను ప్రకటించింది. ముంబైలోని యాపిల్ బీకేసీ, న్యూఢిల్లీలోని యాపిల్ సాకెట్‌లో అందుబాటులో ఉన్న ఈ సేల్‌లో కస్టమర్‌ల కోసం డిస్కౌంట్‌లతో పలు ఉత్పత్తులను కూడా ఉచితంగా అందిస్తుంది. అయితే ఈ దీపావళి సేల్‌ను పరిమిత-కాల ఆఫర్ కింద ప్రకటించారు.  ఐఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ పండుగ సీజన్‌లో అత్యధికంగా అమ్ముడవుతోంది, అయితే ఆపిల్ కూడా ఆకర్షణీయమైన ఆఫర్‌ను కలిగి ఉంది. ఐఫోన్ 15ని కొనుగోలు చేసే కస్టమర్‌లు బీట్స్ సోలో బడ్స్ ఫెస్టివ్ ఎడిషన్‌ను ఉచితంగా అందుకోవచ్చని ప్రకటించింది. ఇలాంటి ఎన్నో ఆఫర్లు ఈ సేల్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో యాపిల్ కంపెనీ ఇచ్చే తాజా ఆఫర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

అలాగే ఐ ఫోన్ 16 సిరీస్ లాంచ్ అయిన తర్వాత ఐఫోన్ 15 ధర రూ.10,000 తగ్గింది, 128జీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ.69,900. అలాగే ఈ ఫోన్ కొనుగోలుపై నో-కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంటుంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐతో సహా ఎంచుకున్న బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై నో కాస్ట్ ఈఎంఐ అందుబాటలో ఉంటుంది. అలాగే మ్యాక్ బుక్ ఎయిర్ ఎం3 కొనుగోలుపై రూ.10,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. యాపిల్ కంపెనీలోని ఉత్పత్తులతో పాటు స్టాండర్డ్ వెర్షన్‌లతో సహా అన్ని ఐఫోన్ 16 సిరీస్ మోడల్‌లపై రూ. 5,000 తగ్గింపు అందిస్తున్నారు. అలాగే ఐ ఫోన్ ఎస్ఈపై రూ.2,000, ఐఫఓన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌పై రూ.3,000 తగ్గింపు పొందవచ్చు .

అలాగే ఐప్యాడ్ కొనుగోలుదారులు కూడా ప్రత్యేక తగ్గింపులన అందిస్తున్నారు. ఐ ప్యాడ్ ప్రో 11, ఐప్యాడ్ ప్రో 13లపై రూ.6,000 తగ్గింపు,ఐప్యాడ్ ఎయిర్ 11, ఐప్యాడ్ ఎయిర్ 13పై రూ.4,000 తగ్గింపును అందిస్తున్నారు. అలాగే  ప్రామాణిక ఐప్యాడ్‌పై రూ.2,500 తగ్గింపు, ఐప్యాడ్ మినీ పై రూ.3,000 తగ్గింపు అందిస్తున్నారు. అలాగే యాపిల్ వాచ్‌లపై కూడా ప్రత్యేక తగ్గింపునలు అందిస్తున్నారు. యాపిల్ వాచ్ అల్ట్రా 2పై రూ.6,000 తగ్గింపు, యాపిల్ వాచ్ సిరీస్ 10పై రూ.4,000 తగ్గింపు, యాపిల్ వాచ్ ఎస్ఈ1పై రూ.2,000 తగ్గింపు అందుబాటులో ఉంది. యాపిల్ ఎయిర్ పాడ్స్‌పై తక్షణ తగ్గింపులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ పాడ్స్ ప్రోపై రూ.2,000 తగ్గింపు, ఎయిర్ పాడ్స్ 4పై రూ.1,500 తగ్గింపుతో పాటు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో యాపిల్ ఎయిర్ పాడ్స్‌పై రూ.1,500 తగ్గింపు, ఎయిర్ పాడ్స్ మ్యాక్స్ రూ.4,000 తగ్గింపు అందుబాటులో ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..