FD Interest Rates: ఎఫ్‌డీ ఖాతాదారులు అలెర్ట్.. ఆ బ్యాంకుల్లో ఎఫ్‌డీల వడ్డీ రేట్లు తగ్గింపు..?

భారతదేశంలో చాలా ఏళ్లుగా పెట్టుబడికి నమ్మకమైన సాధనంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లను ప్రజలు ఆదరిస్తున్నారు. అయితే ఈ ఎఫ్‌డీ రేట్లపై  నిర్ణయం తీసుకోవడానికి ఆర్‌బీఐ ఎంపీసీ వచ్చే వారం సమావేశం కానుంది. అయితే డిసెంబర్ 2024 నుండి రేట్లను తగ్గించడం ప్రారంభించాలని భావిస్తున్నందున ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు కూడా తదుపరి నుంచి హేతుబద్ధీకరించే అవకాశం ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంకులకు సంబంధించిన ఎఫ్‌డీ  వడ్డీ రేట్లు ప్రస్తుతం కంటే డిసెంబర్ నుంచి తగ్గించే అవకాశం ఉంది.

FD Interest Rates: ఎఫ్‌డీ ఖాతాదారులు అలెర్ట్.. ఆ బ్యాంకుల్లో ఎఫ్‌డీల వడ్డీ రేట్లు తగ్గింపు..?
Follow us
Srinu

|

Updated on: Oct 06, 2024 | 7:45 PM

భారతదేశంలో చాలా ఏళ్లుగా పెట్టుబడికి నమ్మకమైన సాధనంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లను ప్రజలు ఆదరిస్తున్నారు. అయితే ఈ ఎఫ్‌డీ రేట్లపై  నిర్ణయం తీసుకోవడానికి ఆర్‌బీఐ ఎంపీసీ వచ్చే వారం సమావేశం కానుంది. అయితే డిసెంబర్ 2024 నుండి రేట్లను తగ్గించడం ప్రారంభించాలని భావిస్తున్నందున ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు కూడా తదుపరి నుంచి హేతుబద్ధీకరించే అవకాశం ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంకులకు సంబంధించిన ఎఫ్‌డీ  వడ్డీ రేట్లు ప్రస్తుతం కంటే డిసెంబర్ నుంచి తగ్గించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్లు సరాసరిన 7.9 శాతం వడ్డీని అందిస్తున్నాయి. అలాగే ప్రస్తుతం ద్రవ్యోల్బణం 4 శాతంగా ఉంది. పదవీకాలాన్ని బట్టి రూ. 3 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.9 శాతం వరకు ఎఫ్‌డీ రేట్లను అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ 7.8 శాతం వరకు ఇస్తుండగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 7.50 శాతం వరకు ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూడు బ్యాంకుల్లో ప్రస్తుతం వడ్డీరేట్లు ఎలా ఉన్నాయో? ఓ సారి తెలుసుకుదాం.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీ రేట్లు

  • 7 రోజుల నుండి 29 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
  • 30 రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
  • 46 రోజుల నుంచి ఆరు నెలల వరకు సాధారణ ప్రజలకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం 
  • 6 నెలల 1 రోజు నుంచి 9 నెలల కంటే తక్కువ సాధారణ ప్రజలకు – 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
  • 9 నెలల 1 రోజు నుండి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 6.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం
  • 1 సంవత్సరం నుండి 15 నెలల కంటే తక్కువ వరకు సాధారణ ప్రజలకు – 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.10 శాతం
  • 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ వరకు సాధారణ ప్రజలకు – 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
  • 18 నెలల నుంచి 21 నెలల కంటే తక్కువ వరకు సాధారణ ప్రజలకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు, 7.75 శాతం
  • 21 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
  • 4 సంవత్సరాల 7 నెలల నుండి 55 నెలల వరకు సాధారణ ప్రజలకు – 7.40 శాతం; సీనియర్ సిటిజన్లకు 7.90 శాతం

ఎస్‌బీఐ వడ్డీ రేట్లు

  • 7 రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
  • 46 రోజుల నుంచి 179 రోజులు వరకు సాధారణ ప్రజలకు – 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.00 శాతం
  • 180 రోజుల నుంచి 210 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం
  • 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ సాధారణ ప్రజలకు – 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.00 శాతం
  • 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ వరకు సాధారణ ప్రజలకు – 6.80 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.30 శాతం
  • 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ వరకు సాధారణ ప్రజలకు 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం
  • 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కంటే తక్కువ వరకు సాధారణ ప్రజలకు – 6.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.25 శాతం
  • 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు – 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం.

ఐసీఐసీఐ బ్యాంకు వడ్డీ రేట్లు

  • 7 రోజుల నుంచి 29 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
  • 30 రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
  • 46 రోజుల నుంచి 60 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 4.25 శాతం, సీనియర్ సిటిజన్లకు – 4.75 శాతం
  • 61 రోజుల నుంచి 90 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
  • 91 రోజుల నుండి 184 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 4.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 5.25 శాతం 
  • 185 రోజుల నుండి 270 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
  • 271 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ వరకు సాధారణ ప్రజలకు – 6.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం
  • 1 సంవత్సరం నుండి 15 నెలల కంటే తక్కువ వరకు సాధారణ ప్రజలకు – 6.70 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.20 శాతం
  • 15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ వరకు సాధారణ ప్రజలకు  7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.80 శాతం
  • 18 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు – 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.75 శాతం
  • 2 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం

అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?
పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?
3 చారిత్రక ప్యాలెస్‌ల్లో సింధు వివాహ వేడుకలు.. ఎక్కడెక్కడో తెలుసా
3 చారిత్రక ప్యాలెస్‌ల్లో సింధు వివాహ వేడుకలు.. ఎక్కడెక్కడో తెలుసా
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో