AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Diseases: పొదుపులను హరించేస్తున్న గుండె జబ్బులు.. నిపుణులు చెప్పేది తెలిస్తే షాక్..!

గుండె జబ్బులు ఇటీవల కాలంలో అత్యంత ముఖ్యమైన ఆరోగ్య సవాళ్లలో ఒకటిగా మారాయి. ముఖ్యంగా గుండె జబ్బులకు చికిత్స చేయించుకుంటుంటే జీవితాంతం పొదుపు చేసుకున్న సొమ్ము హరించుకుపోతుంది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్ ప్రకారం భారతదేశంలో 100,000 జనాభాకు 272 మందికి గుండె జబ్బులు వస్తున్నాయి.

Heart Diseases: పొదుపులను హరించేస్తున్న గుండె జబ్బులు.. నిపుణులు చెప్పేది తెలిస్తే షాక్..!
Heart Diseases
Nikhil
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 07, 2024 | 6:33 AM

Share

గుండె జబ్బులు ఇటీవల కాలంలో అత్యంత ముఖ్యమైన ఆరోగ్య సవాళ్లలో ఒకటిగా మారాయి. ముఖ్యంగా గుండె జబ్బులకు చికిత్స చేయించుకుంటుంటే జీవితాంతం పొదుపు చేసుకున్న సొమ్ము హరించుకుపోతుంది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్ ప్రకారం భారతదేశంలో 100,000 జనాభాకు 272 మందికి గుండె జబ్బులు వస్తున్నాయి. అయితే ప్రపంచ జనాభాను పరిగణలోకి తీసుకుంటే 1,00,000 జనాభాకు 235 కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే గుండె జబ్బు వచ్చాక డబ్బులు వేస్ట్ చేసుకోవడం కాకుండా ముందు నుంచి ప్రణాళికతో వ్యవహరిస్తే గుండె జబ్బులు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి చర్యలు తీసుకుంటే ఆర్థికంగా కూడా నిశ్చింతగా ఉండవచ్చని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గుండె జబ్బుల విషయంలో నిపుణులు తేల్చి చెప్పే విషయాల గురించి తెలుసుకుందాం. 

గుండె జబ్బుల విషయంలో చురుకైన చర్యలు తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా మీ ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నేటి ప్రపంచంలో నివారణ అనేది ఇకపై వైద్య వ్యూహం మాత్రమే కాదు ఇది వ్యక్తిగత మరియు ఆర్థిక స్వేచ్ఛకు అవసరమైన పెట్టుబడిగా ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో గుండె జబ్బులు ఉన్న చాలా మంది వ్యక్తులు తమను తాము పని చేయలేకపోతున్నారు. తద్వారా ఆదాయంతో పాటు ఉత్పాదకత తగ్గుతుంది. ఈ అంతరాయం వారి ప్రధాన సంపాదనను దెబ్బతీస్తుంది. ఇది స్వల్పకాలిక ఆర్థిక స్థిరత్వం, దీర్ఘకాలిక పదవీ విరమణ ప్రణాళిక రెండింటినీ ప్రభావితం చేస్తుంది. గుండె జబ్బుల సంరక్షణ డిమాండ్లు ఆర్థిక ఒత్తిడిని పెంచుతాయి. కుటుంబ సభ్యులు పనికి సెలవు తీసుకున్నా లేదా వృత్తిపరమైన సహాయాన్ని తీసుకున్నా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి.

రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు గుండె జబ్బులను నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటిగా ఉంటుంది. రొటీన్ స్క్రీనింగ్‌ల వల్ల సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. ఇలా చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన చికిత్స చేయించుకోవచ్చు. ప్రారంభ రోగనిర్ధారణ మీ ఆరోగ్యం, మీ ఆర్థిక రెండింటినీ సంరక్షిస్తాయి. గుండె జబ్బుల నివారణలో వైద్య పరీక్షలతో పాటు జీవనశైలి సర్దుబాటు కీలకం. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఒత్తిడి నిర్వహణ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాట్లు మెరుగైన శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మెరుగైన మానసిక స్పష్టతను అందిస్తాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..