HDFC Credit Card: హెచ్‌డీ‌ఎఫ్‌సీ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ కొత్త రూల్స్ తెలుసుకోకపోతే నష్టపోతారు..

ప్రముఖ ప్రైవేటు బ్యాంకు అయిన హెచ్‪‌డీఎఫ్సీ బ్యాంక్ తన క్రెడిట్ కార్డులపై అందించే రివార్డు స్కీమ్ ను అప్ డేట్ చేసింది. కొన్ని కొత్త నిబంధనలను బ్యాంకు తీసుకొచ్చింది. ఈ సవరించిన నియమాలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. 2024, అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఇవి అలమవుతున్నాయి. ఈ కొత్త అప్‌డేట్‌కు సంబంధించిన వివరాలను బ్యాంకు కస్టమర్లకు ఈ-మెయిల్ పంపింది.

HDFC Credit Card: హెచ్‌డీ‌ఎఫ్‌సీ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ కొత్త రూల్స్ తెలుసుకోకపోతే నష్టపోతారు..
Hdfc
Follow us
Madhu

|

Updated on: Oct 06, 2024 | 5:57 PM

ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం గణనీయంగా పెరిగింది. వాటి వల్ల ఆర్థిక వెసులుబాటు కలుగుతుండటం, ఆఫర్లు, క్యాష్ బ్యాక్స్, రివార్డులు వస్తుండటంతో పాటు ఆర్థిక సంస్థలు సులువుగా మంజూరు చేస్తుండటంతో అందరూ వీటిని కలిగి ఉంటున్నారు. ఒక్కో కార్డు ఒక్కో రకమైన ప్రయోజనాలను అందిస్తాయి. వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నప్పుడే కార్డు వల్ల అధికప్రయోజనం చేకూరుతుంది. ఈ క్రమంలో ప్రముఖ ప్రైవేటు బ్యాంకు అయిన హెచ్‪‌డీఎఫ్సీ బ్యాంక్ తన క్రెడిట్ కార్డులపై అందించే రివార్డు స్కీమ్ ను అప్ డేట్ చేసింది. కొన్ని కొత్త నిబంధనలను బ్యాంకు తీసుకొచ్చింది. ఈ సవరించిన నియమాలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. 2024, అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఇవి అలమవుతున్నాయి. ఈ కొత్త అప్‌డేట్‌కు సంబంధించి, ప్రభావితమైన క్లయింట్‌లకు కూడా బ్యాంక్ ఈ-మెయిల్ పంపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

హెచ్‌డీ‌ఎఫ్‌సీ క్రెడిట్ కార్డు రివార్డు నిబంధనలు..

హెచ్‌డీ‌ఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా స్మార్ట్ బై ప్లాట్‌ఫారమ్‌లో ఆపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే రివార్డు పాయింట్లు వస్తాయి. అయితే ఇకపై ఆ రీడీమ్ చేయగల రివార్డ్ పాయింట్‌ల మొత్తాన్ని క్యాలెండర్ త్రైమాసికంలో ఒక ఉత్పత్తికి వచ్చిన రివార్డు పాయింట్లను మాత్రమే రీడీమ్ చేసుకునే వీలుంటుంది. అలాగే స్మార్ట్ బై పోర్టల్లో ప్రతి క్యాలెండర్ త్రైమాసికంలో తనిష్క్ గిఫ్ట్ కార్డ్‌ల కోసం రీడీమ్ చేయగల రివార్డ్ పాయింట్‌ల మొత్తాన్ని 50,000కి పరిమితం చేసింది. అయితే ఈ మార్పులు ఇన్ఫినియా మెటల్ కార్డ్‌లు మాత్రమే వర్తిస్తాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ‘హెచ్‌డీ‌ఎఫ్‌సీ బ్యాంక్ స్మార్ట్ బై పోర్టల్‌లో యాపిల్ ఉత్పత్తుల కోసం రివార్డ్ పాయింట్‌ల రిడెంప్షన్ క్యాలెండర్ త్రైమాసికంలో ఒక ఉత్పత్తికి పరిమితం అవుతుంది. ఇది అక్టోబర్ 1, 2024 నుంచి అమలులోకి వస్తుంది. త్రైమాసికం అంటే ఏప్రిల్ నుంచి జూన్, జూలై నుంచి సెప్టెంబర్, అక్టోబర్ నుంచి డిసెంబర్, జనవరి నుంచి మార్చి వరకు. అంటే మీరు ఎన్ని యాపిల్ ఉత్పత్తులు కొన్నా నాలుగు ఉత్పత్తులకు సంబంధించిన రివార్డు పాయింట్లు మాత్రమే మీరు వినియోగించుకోగలుగుతారు. అదే విధంగా హెచ్‌డీ‌ఎఫ్‌సీ బ్యాంక్ స్మార్ట్ బై ప్లాట్‌ఫారమ్‌లో తనిష్క్ వోచర్‌ల కోసం రిడీమ్ చేయగల గరిష్ట రివార్డ్ పాయింట్‌ల సంఖ్య ప్రతి క్యాలెండర్ త్రైమాసికంలో 50,000 అవుతుంది.’

  • యుటిలిటీ లావాదేవీల నుంచి వచ్చే రివార్డ్‌లపై ప్రతి క్యాలెండర్ నెలలో 2000 రివార్డ్ పాయింట్‌ల పరిమితి ఉంటుంది.
  • టెలికాం, కేబుల్ బిల్లుల లావాదేవీల నుంచి వచ్చే రివార్డ్‌లపై క్యాలెండర్ నెలకు 2000 రివార్డ్ పాయింట్‌ల పరిమితి ఉంటుంది.
  • ఉత్పత్తి ఫీచర్ ప్రకారం క్యాపింగ్ కొన్ని క్రెడిట్ కార్డ్‌లకు ఇప్పటికీ అమలులో ఉంటుంది. భారత్, మిలీనియా, బెస్ట్ ప్రైస్ సేవ్ స్మార్ట్, పేటీఎం, పేటీఎం బిజినెస్ వ్యాపారం, యూపీఐ, బిజ్ యూపీఐ, స్విగ్గీ, బిజ్ ఫస్ట్ వంటి క్రెడిట్ కార్డులకు అమలులో ఉంటుంది.
  • క్రెడ్, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా విద్య కోసం చేసిన చెల్లింపులకు రివార్డ్ పాయింట్‌లు రావు. కళాశాల లేదా పాఠశాల పీఓఎస్ సిస్టమ్‌లు లేదా వెబ్‌సైట్‌ల ద్వారా నేరుగా విద్యకు సంబంధించిన చెల్లింపుల కోసం రివార్డ్ పాయింట్‌లు అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..