AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM-Kisan: రైతులకు బంపర్ న్యూస్.. బ్యాంకు ఖాతాల్లో రూ.2000 నగదు జమ.. ఇలా ఈజీగా చెక్ చేసుకోండి..

రైతులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నగదును శనివారం రైతుల ఖాతాల్లో జమచేసింది.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-కిసాన్) పథకం 18వ విడతను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం విడుదల చేశారు.

PM-Kisan: రైతులకు బంపర్ న్యూస్.. బ్యాంకు ఖాతాల్లో రూ.2000 నగదు జమ.. ఇలా ఈజీగా చెక్ చేసుకోండి..
Shaik Madar Saheb
|

Updated on: Oct 05, 2024 | 6:45 PM

Share

రైతులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నగదును శనివారం రైతుల ఖాతాల్లో జమచేసింది.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-కిసాన్) పథకం 18వ విడతను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం విడుదల చేశారు. దీని ద్వారా 2.5 కోట్ల మంది రైతుల ఖాతాలకు రూ.2000 చొప్పున నగదు జమ అయింది. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ పీఎం కిసాన్ నగదును విడుదల చేశారు. కాగా..ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడత కోసం కేంద్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది. కొన్ని కారణాల వల్ల మీ ఖాతాలో డబ్బు రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మీ ఇంటికి సమీపంలోని ఏదైనా ATMని సందర్శించడం ద్వారా మినీ స్టేట్‌మెంట్‌ను తనిఖీ చేయవచ్చు. దీంతోపాటు.. అనివార్య కారణాల వల్ల నగదు రాకపోతే.. మీ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు 0120-6025109, 011-24300606 హెల్ప్‌లైన్ నంబర్‌లకు కాల్ చేయవచ్చు.

నగదు జమ.. లబ్ధిదారుల స్థితిని తెలుసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్‌ను pmkisan.gov.in ను సందర్శించండి..

వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్ ) పథకాన్ని ప్రారంభించింది.. ఏడాదికి రూ. 6,000 చొప్పున రైతులకు అందిస్తోంది. ఈ ఆరు వేల మొత్తాన్ని మూడు వాయిదాలలో రూ.2,000 చొప్పున జమ చేస్తోంది. PM-KISAN పథకం కింద, అర్హులైన రైతులు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పన నగదును పొందుతారు.. నిధి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ అవుతుంది. అయితే.. ఈ నగదు ను స్వీకరించడానికి రైతులు తమ ఇ-కెవైసిని పూర్తి చేయాలి. బయోమెట్రిక్ ఆధారిత eKYC కోసం సమీప CSC కేంద్రాలను సంప్రదించవచ్చు.

PM-కిసాన్ లబ్ధిదారుల జాబితాలో పేరును తనిఖీ చేయాలంటే.. ఇలా చేయండి..

PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ www.pmkisan.gov.in ని సందర్శించండి.

‘బెనిఫిషియరీ లిస్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

డ్రాప్-డౌన్ నుంచి ఎంపిక చేయబడిన రాష్ట్రం.. జిల్లా, ఉప-జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలను ఎంచుకోండి

దశ 4: ‘గెట్ రిపోర్ట్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

దీని తరువాత, లబ్ధిదారుల జాబితా ప్రదర్శించబడుతుంది.

ఒకవేళ మీకు సమాచారం కావాలనుకుంటే.. హెల్ప్‌లైన్ నంబర్‌ 155261, 011-2430060 లకు కాల్ చేయవచ్చు

లబ్ధిదారుని స్థితిని ఎలా తనిఖీ చేయాలి?

1) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి — pmkisan.gov.in

2) ఇప్పుడు, పేజీకి కుడి వైపున ఉన్న ‘నో యువర్ స్టేటస్’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి

3) మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చా కోడ్‌ను పూరించండి- ‘డేటా పొందండి’ ఎంపికను ఎంచుకోండి

4) లబ్ధిదారుడి స్థితి ఏంటో కనిపిస్తుంది..

మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. వ్యవసాయం, పశుపోషణకు సంబంధించిన అనేక కార్యక్రమాలను ప్రారంభించారు. దీంతోపాటు పలు పథకాలను ప్రారంభించడంతోపాటు.. శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నవరాత్రి పండుగ సందర్భంగా 18వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేసే అవకాశం తనకు లభించిందన్నారు. మహారాష్ట్రలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఇక్కడి రైతులకు రెట్టింపు ప్రయోజనాలను కల్పిస్తోందని తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..