AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bike Offers: ఆ సూపర్ బైక్స్‌పై తగ్గింపుల జాతర.. రూ.15 వేల నుంచి రూ.22 వేల వరకు తగ్గింపు

భారతదేశంలో ఇటీవల కాలంలో ప్రీమియం మోటార్‌సైకిళ్ల అమ్మకాలు తారాస్థాయికు చేరాయి. ముఖ్యంగా యువత ఈ బైక్స్ వాడకాన్ని ఇష్టపడుతున్నారు. అయితే ప్రస్తుతం భారతదేశంలో పండుగల సీజన్ నేపథ్యంలో ప్రముఖ బైక్స్ తయారీ కంపెనీలన్నీ సూపర్ బైక్స్ కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ ద్వారా కూడా బైక్స్ బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చారు.

Bike Offers: ఆ సూపర్ బైక్స్‌పై తగ్గింపుల జాతర.. రూ.15 వేల నుంచి రూ.22 వేల వరకు తగ్గింపు
Bike Riding
Nikhil
|

Updated on: Oct 05, 2024 | 7:30 PM

Share

భారతదేశంలో ఇటీవల కాలంలో ప్రీమియం మోటార్‌సైకిళ్ల అమ్మకాలు తారాస్థాయికు చేరాయి. ముఖ్యంగా యువత ఈ బైక్స్ వాడకాన్ని ఇష్టపడుతున్నారు. అయితే ప్రస్తుతం భారతదేశంలో పండుగల సీజన్ నేపథ్యంలో ప్రముఖ బైక్స్ తయారీ కంపెనీలన్నీ సూపర్ బైక్స్ కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ ద్వారా కూడా బైక్స్ బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్‌లో చాలా కంపెనీలు తమ బైక్స్‌పై తగ్గింపులన ప్రకటించాయి. అలాగే ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కూడా అవే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సూపర్ బైక్స్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

టీవీఎస్ రోనిన్ 

టీవీఎస్ రోనిన్ బైక్ ప్రస్తుతం రూ. 1.35 లక్షలతో ప్రారంభమవుతుంది. ఈ మోటార్ సైకిల్ ధర రూ.15,000 తగ్గింది. బేస్-స్పెక్ ఎస్ఎస్ వేరియంట్‌పై మాత్రమే డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. రోనిన్‌లో మొత్తం నాలుగు వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎస్ఎస్, డీఎస్, టీడీ, టీడీ స్పెషల్ వేరియంట్స్ కొనుగోలు అందుబాటులో ఉంది. రోనిన్ 225.9 సీసీ ఎయిర్/ఆయిల్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో 7,750 ఆర్‌పీఎం వద్ద 20.4 హెచ్‌పీ, 3,750 ఆర్‌పీఎం వద్ద 19.93 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది. 

కవాసకీ బైక్స్

కవాసకి నింజా 300, నింజా 500, నింజా 650పై రూ. 25,000 వరకు తగ్గింపులను ప్రకటించింది. నింజా 300, నింజా 500 రూ. 10,000 వోచర్‌లతో వస్తాయి. అయితే నింజా 650 మరింత గణనీయమైన రూ. 25,000 వోచర్‌ను అందిస్తోంది. వీటిని యాక్సెసరీలు, రైడింగ్ గేర్ కొనుగోలు కోసం ఉపయోగించవచ్చు లేదా మోటార్‌సైకిల్ ఆన్-రోడ్ ధర నుంచి మినహాయించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

బజాజ్ డిస్కౌంట్లు

బజాజ్ డొమినార్ శ్రేణిపై తగ్గింపులను అందిస్తోంది. డొమినార్ 400 ధర ఇప్పుడు రూ. 1.79 లక్షలు (రూ. 23,500 తగ్గింపు) మరియు డొమినార్ 250 ధర రూ. 1.70 లక్షలు (రూ. 16,000 తగ్గింపు). పల్సర్ శ్రేణి రూ. 17,500 వరకు తగ్గింపుతో అందిస్తుంది. 

జావా అండ్ యెజ్డీ

జావా అండ్ యెజ్డీ మోటార్‌సైకిళ్లు ఇప్పుడు రూ. 22,500 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్స్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేస్తే అదనపు బ్యాంక్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. బేస్ డిస్కౌంట్ రూ.12,500గా ఉంది. ప్రాంతాలను బట్టి కూడా ఆఫర్‌లు మారవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి రూ. 8,500 అదనపు తగ్గింపులను పొందవచ్చు. అయితే డెబిట్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా మీకు రూ. 750 తగ్గింపు లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి రూ. 10,000 పొందవచ్చు. బ్రాండ్ డౌన్ పేమెంట్ రూ. 2,999 మరియు 5.99 శాతంవడ్డీ రేటుతో సులభమైన ఫైనాన్స్ పథకాలను కూడా అందిస్తోంది. ఈఎంఐ లక్షకు రూ. 1,888 నుంచి ప్రారంభమవుతుంది. యెజ్డీ రోడ్‌స్టర్‌లో, రూ. 16,000 విలువైన ఉపకరణాలతో కూడిన ‘ట్రైల్ ప్యాక్’ను కూడా ఉచితంగా ఇస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..