Volkswagen Virtus GT: మరో రెండు కార్లను లాంచ్ చేసిన వోక్స్‌వ్యాగన్.. ఫీచర్ల తెలిస్తే మతిపోతుందంతే..!

భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలకు సొంత కారు అంటే ఓ ఎమోషన్. కుటుంబం మొత్తం కారులో బయటకు వెళ్లాలనే కోరిక అందరికీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీలన్నీ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్లను రిలీజ్ చేస్తున్నాయి. వోక్స్‌వ్యాగన్ ఇండియా భారతదేశంలో విర్టస్ జీటీ లైన్, విర్టస్ జీటీ ప్లస్‌లను లాంచ్ చేసింది. ఈ రెండు కార్లు రూ.14.07 లక్షలు, రూ.17.84 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి. విర్టస్, టైగూన్ లైనప్‌లకు హైలైన్ ప్లస్ వేరియంట్‌ను, టైగన్ జీటీ లైన్ కోసం మెరుగైన ఫీచర్ ప్యాకేజీని కూడా పరిచయం చేసింది.

Volkswagen Virtus GT: మరో రెండు కార్లను లాంచ్ చేసిన వోక్స్‌వ్యాగన్.. ఫీచర్ల తెలిస్తే మతిపోతుందంతే..!
Volkswagen
Follow us

|

Updated on: Oct 05, 2024 | 7:45 PM

భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలకు సొంత కారు అంటే ఓ ఎమోషన్. కుటుంబం మొత్తం కారులో బయటకు వెళ్లాలనే కోరిక అందరికీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీలన్నీ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్లను రిలీజ్ చేస్తున్నాయి. వోక్స్‌వ్యాగన్ ఇండియా భారతదేశంలో విర్టస్ జీటీ లైన్, విర్టస్ జీటీ ప్లస్‌లను లాంచ్ చేసింది. ఈ రెండు కార్లు రూ.14.07 లక్షలు, రూ.17.84 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి. విర్టస్, టైగూన్ లైనప్‌లకు హైలైన్ ప్లస్ వేరియంట్‌ను, టైగన్ జీటీ లైన్ కోసం మెరుగైన ఫీచర్ ప్యాకేజీని కూడా పరిచయం చేసింది. ముఖ్యంగా విర్టస్ లైన్, విర్టస్ జీటీ ప్లస్ ఎక్స్‌టీరియర్‌తో పాటు ఇంటీరియర్‌లో అనేక అప్‌డేట్స్‌తో వస్తున్నాయి. ఈ కార్లల్లో స్మోక్డ్ హెర్ల్యాంప్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ కారు పైకప్పు కార్బన్ స్టీల్ గ్రే కలర్‌లో ఆకట్టుకుంటుంది. ఈ కారు గ్రిల్‌పై ఉన్న జీటీ బ్యాడ్జ్, బ్రేక్ కాలిపర్లు ఇప్పుడు జీటీ ప్లస్ వేరియంట్‌లో ఎరుపు రంగులో ఉన్నాయి. డార్క్ క్రోమ్లో డోర్ హ్యాండిల్స్ పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో విర్టస్ రిలీజ్ చేసిన నయా కార్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఇంటీరియర్ రెడ్ స్టిచింగ్‌తో బ్లాక్ లెథెరెట్ అప్టోలరీతో వచ్చే ఈ కారు గ్లోస్ బ్లాక్ ఫుల్ ఫుల్‌ఫిల్‌డ్ డాష్ బోర్డ్, అల్యూమినియం పెడల్స్, బ్లాక్ హెడ్లైనర్, ఫ్రంట్ హెడెస్ట్ పై జీటీ బ్యాడ్జింగ్‌తో వస్తున్నాయి. రెడ్ స్టిచింగ్, బ్లాక్-అవుట్ గ్రాబ్ హ్యాండిల్స్, రూఫ్ ల్యాంప్ హౌసింగ్, సన్ వైజర్లతో కూడిన స్పోర్ట్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. వోక్స్ వ్యాగన్ విర్టస్ జీటీ ప్లస్ స్పోర్ట్స్ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. అయితే విర్టస్ జీటీ లైన్ 1.0-లీటర్ టీఎస్ఐ ఇంజిన్‌తో వస్తుంది. ఈ రెండు ఇంజిన్లు ప్రామాణికంగా 6 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్‌తో వస్తుంది. ఈ కారు రెండు ఇంజిన్లతో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కూడా అందుబాటులో ఉంది. 1.0 టీఎస్ఐ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో వస్తుంది. అయితే మరో కారు 1.5 లీటర్ ఇవో 7-స్పీడ్ డీఎస్‌జీ యూనిట్‌తో వస్తుంది. వోక్స్ వ్యాగన్ వర్టస్, టైగన్ జీటీ లైన్, జీటీ ప్లస్ ట్రిమ్ స్థాయిని పరిచయం చేయడంతో పాటు, వోక్స్ వ్యాగన్ హైలైన్ ప్లస్ ట్రిమ్ స్థాయిని విర్టస్, టైగన్ లైనప్‌నకు జోడించింది. కొత్త హైలైన్ ప్లస్ వేరియంట్ టైగన్, వర్టస్ రెండింటికీ 1.0 ఎల్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ కారు ధరలు రూ.14.26 లక్షలు, రూ.13.87 లక్షలుగా ఉంది. 

టైగన్, వర్టస్‌కు సంబంధించిన హైలైన్ ప్లస్ వేరియంట్లు 20.32 సెంటిమీటర్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వీఎం, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, ఎలక్ట్రిక్ సన్రూఫ్, ఆటో హెడ్లైట్లు, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆటో కమింగ్/లీవ్ హెూమ్ లైట్లతో వస్తాయి.  వోక్స్ వ్యాగన్ టైగన్ జీటీ లైన్ 20.32 సెం.మీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్రూఫ్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, అల్యూమినియం పెడల్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం వంటి మెరుగైన ఫీచర్లతో వస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..