AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MEIL Solar Plant: మేఘా ప్రస్థానంలో ఇదో మైలు రాయి.. అధునాతన పవర్ ఫ్లాంట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

మహారాష్ట్రలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మేఘా ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ ఫ్లాంట్ అందుబాటులోకి వచ్చింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

MEIL Solar Plant: మేఘా ప్రస్థానంలో ఇదో మైలు రాయి.. అధునాతన పవర్ ఫ్లాంట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
Pm Modi Dedicated Megha Solar Power Plant
Balaraju Goud
|

Updated on: Oct 05, 2024 | 5:06 PM

Share

మహారాష్ట్రలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మేఘా ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ ఫ్లాంట్ అందుబాటులోకి వచ్చింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) ఆధ్వర్యంలో 404 సోలార్ విద్యుత్ ప్లాంట్ల ద్వారా 1880 మెగావాట్ల విద్యుత్‌‌ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ విద్యుత్ మహారాష్ట్రలోని తొమ్మిది జిల్లాలోని అన్నదాతలకు ప్రయోజనకరంగా మారనుంది.

ఈ విద్యుత్‌ను రైతులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం వినియోగించుకోనున్నారు. ఈ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అధునాతన మోనోపార్క్ 550 డబ్ల్యూపీ సోలార్ ప్యానెల్స్‌ను ఎంఈఐఎల్ వినియోగించింది. అదేవిధంగా వీటి పని తీరును పర్యవేక్షించేందుకు తొలిసారిగా రిమోట్ మానిటరింగ్ సిస్టం (ఆర్ఎంఎస్)ను ప్రవేశపెట్టారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో ముందుండే ఎంఈఐఎల్ ఈ సోలార్ ప్లాంట్ల లో 275 కిలో వాట్ ఇన్వెర్టర్లు, సూర్యుడి నుంచి అధిక వేడిని సంగ్రహించేలా స్వింగ్ మోటార్లు ఈ ప్లాంట్ లలో వినియోగిస్తోంది.

రైతుల ప్రయాజనార్ధం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్ (పీఎంకుసుమ్) పథకం కింద ఈ సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఎంఈఐఎల్ ఏర్పాటు చేస్తోంది. రైతులకు నిరంతరాయంగా విద్యుత్ ను సరఫరా చేసేందుకు మహారాష్ట్రలోని శంభాజీనగర్, కొల్హాపూర్, సతారా, అకోలా, బుల్దనా, వాషిమ్, జాల్నా, జల్‌గావ్, నాందేడ్ ల్లాల్లో ఏర్పాటు చేసే 404 సౌర విద్యుత్ ప్లాంట్ల ద్వారా 1880 మెగా వాట్ల విద్యుత్ ను ఎంఈఐఎల్ ఉత్పత్తి చేస్తుంది. వీటిలో దొండల్గావ్ , భామని బి కె , హరోలి, జలాలాబాద్, పాల్షి బికె ప్లాంట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ సోలార్ విద్యుత్ ప్లాంట్లను రాష్ట్ర, జాతీయ సౌర ఇంధన సమాచార కేంద్రాలతో అనుసంధానించి నిత్యం పర్యవేక్షిస్తారు.

మహారాష్ట్రలోని తొమ్మిది జిల్లాలో ఎం ఈ ఐ ఎల్ ఏర్పాటు చేసే 404 సౌర విద్యుత్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ రైతులకు పగటిపూట నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా అవుతుంది. అన్నదాతలకు విద్యుత్, డీజిల్ బిల్లుల ఖర్చు తగ్గుతుంది. సాధారణంగా వ్యవసాయ విద్యుత్ రాత్రిపూట సరఫరా చేస్తుంటారు. దీనివల్ల వారు పాము కాటు , కరెంటు షాక్ వంటి ప్రమాదాలకు లోను కావటంతో పాటు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. సౌర విద్యుత్ ఉత్పాదన వల్ల రైతులు ఈ సమస్యలను అధిగమించి అధిక ఫలసాయాన్ని పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. రైతులు వినియోగించుకోగా మిగిలిన విద్యుత్ను విక్రయించే అవకాశం ఏర్పడుతుంది.

మహారాష్ట్రలో సౌర ఇంధన ప్లాంట్ల ఏర్పాటు సుస్థిర ఇంధన ఉత్పత్తి, రైతాంగం జీవితాల్లో వెలుగులు నింపటంలో ఒక మైలు రాయి అని ఎంఈఐఎల్ పునరుత్పాదన ఇంధన విభాగం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎం.శ్రీధర్ అన్నారు. దేశ సౌర ఇంధన రంగాన్ని బలోపేతం చేయటంలో మేఘా ఇంజనీరింగ్ సంస్థ భాగస్వామి అయినందుకు గర్వంగా ఉందన్నారు. వ్యవసాయరంగానికి మద్దతు ఇవ్వటంతో పాటు రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తమ కృషి కొనసాగుతుందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..