Hyundai Car Offers: హ్యూందాయ్ పండుగ ఆఫర్లు షురూ.. నమ్మలేని తగ్గింపులు మీ సొంతం

భారతదేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన హ్యుందాయ్ మోటార్ అక్టోబర్‌లో ఎంపిక చేసిన మోడళ్లపై పండుగ సీజన్ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ పండుగ సీజన్‌లో కార్ల అమ్మకాల పెంపే లక్ష్యంగా నమ్మలేని ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ అయిన హ్యూందాయ్ నాలుగు మోడళ్లపై ధర తగ్గింపులను అందిస్తోంది.

Hyundai Car Offers: హ్యూందాయ్ పండుగ ఆఫర్లు షురూ.. నమ్మలేని తగ్గింపులు మీ సొంతం
Hyundai Car Offers
Follow us
Srinu

|

Updated on: Oct 05, 2024 | 8:00 PM

భారతదేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన హ్యుందాయ్ మోటార్ అక్టోబర్‌లో ఎంపిక చేసిన మోడళ్లపై పండుగ సీజన్ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ పండుగ సీజన్‌లో కార్ల అమ్మకాల పెంపే లక్ష్యంగా నమ్మలేని ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ అయిన హ్యూందాయ్ నాలుగు మోడళ్లపై ధర తగ్గింపులను అందిస్తోంది. ఆ ఆఫర్లల్లో ప్రజాదరణ పొందిన రెండు ప్రసిద్ధ ఎస్‌యూవీలు ఉన్నాయి. ఇవి ఈ నెలాఖరు వరకు తగ్గింపు ధరలతో లభిస్తాయి. ఈ ప్రమోషన్ నుంచి ప్రయోజనం పొందుతున్న వాహనాల్లో ఎక్స్‌టర్, వెన్యూ ఎస్‌యూవీలు, అలాగే ఐ20, గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్‌బ్యాక్‌లు ఉన్నాయి. అదనంగా హ్యుందాయ్ తన సీఎన్‌జీతో నడిచే అనేక కార్లకు ఆఫర్‌ను విస్తరిస్తోంది. ఈ హ్యూందాయ్ పండుగ ఆఫర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

కస్టమర్‌లు అక్టోబర్‌లో నిర్దిష్ట మోడల్‌లు, వేరియంట్‌లపై ఏకంగా రూ.80,000 వరకు ఆదా చేసుకోవచ్చని హ్యూందాయ్ ప్రతినిధులు చెబుతున్నారు. వెన్యూ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కారుపై రూ.80,629 పొదుపుతో అందుబాటులో ఉంటుంది. ఈ కారుపై హ్యుందాయ్ పండుగ ఆఫర్‌లో భాగంగా రూ.6,000 తగ్గింపు ధరతో పాటు రూ.21,628 విలువైన అనుబంధ ప్యాకేజీని కూడా అందిస్తోంది .హ్యూందాయ్ కంపెనీలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీల్లో ఒకటైన ఎక్స్‌టర్ రూ.42,972 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది . ఎక్స్‌టర్ ఎస్‌యూవీ కారుపై రూ.17,971 విలువైన అనుబంధ ప్యాకేజీని కేవలం రూ.5,000 కి కొనుగోలు చేయవచ్చు . ఈ తగ్గింపులు ఎక్స్‌టర్‌కు సంబంధించిన సీఎన్‌జీ వేరియంట్‌కు కూడా విస్తరించవచ్చు. 

హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారుపై రూ.58,000 వరకు పొదుపు చేయవచ్చు .ఐ 20 కారును స్టాండర్డ్, ఎన్ లైన్ వేరియంట్‌లలో వస్తుంది. ఈ కారుపై రూ.55,000 వరకు ప్రయోజనాలను అందిస్తుంది . హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా దాని అల్కాజార్ ఎస్‌యూవీ రిఫ్రెష్ వెర్షన్‌ను ఇటీవల విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.14.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. అప్‌డేటేడ్ అల్కాజర్ కారులో సరికొత్త గ్రిల్, కొత్త హెచ్-ఆకారపు ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, పెద్ద స్కిడ్ ప్లేట్లు, క్వాడ్ బీమ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, 18 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..