Asus ZenBook S16: ల్యాప్‌టాప్ చార్జింగ్ సమస్యకు టాటా.. బెస్ట్ ఫీచర్లతో ఆసస్ జెన్ బుక్ ఎస్ 16 లాంచ్
ఆధునిక కాలంలో ల్యాప్ టాప్ ల వినియోగం విపరీతంగా పెరిగింది. గతంలో సాఫ్ట్ వేర్ రంగంలో ఉండేవారే వీటిని ఎక్కువగా వినియోగించేవారు. పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో ప్రతి ఉద్యోగంలో ఇవి తప్పనిసరి అయ్యాయి. అలాగే వ్యాపారులు, విద్యార్థులు కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా వివిధ కంపెనీల ల్యాప్ టాప్ లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే మెరుగైన సామర్థ్యం, కొత్త ఫీచర్లతో కావాలంటే కొంచె ధర ఎక్కువ పెట్టాలి. అలాంటి వాటిలో అసస్ జెన్ బుక్ ఎస్ 16 ల్యాప్ టాప్ ముందు వరుసలో ఉంటుంది. దీని ధర, ప్రత్యేకతలను తెలుసుకుందాం.
ఆసస్ జెన్ బుక్ ఎస్ 16 ల్యాప్ టాప్ లో ఏఎండీ రైజెన్ ఏఐ ప్రాసెసర్ ఏర్పాటు చేశారు. డిజైన్ పరంగా ఇంతకు ముందు వచ్చిన జెన్ బుక్ ఎస్ 14 మాదిరిగానే కనిపిస్తుంది. 3కే ఓఎల్ఈడీ డిస్ ప్లే, అల్ట్రా ప్రొఫైల్, శక్తివంతమైన చిప్ సెట్ తో పనితీరు చాలా మెరుగ్గా ఉంటుంది. అల్యూమినియం, సిరామిక్ మిశ్రమంతో ల్యాప్ టాప్ పైభాగం అందంగా, మన్నికంగా ఉంటుంది. దీని బరువు కేవలం 1.50 కిలోలు కావడంతో ఎక్కడికైనా చాాలా సులభంగా తీసుకెళ్లవచ్చు. ల్యాప్ టాప్ లోని కీ బోర్డు, కీలను చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు. దీనిలోని మౌస్ ప్యాడ్ ను గతంలో కంటే దాదాపు 40 శాతం పెద్దదిగా రూపొందించారు. 3కే ఓఎల్ఈడీ డిస్ ప్లేతో విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే ఆడియో సిస్టమ్ నుంచి శ్రావ్యమైన ధ్వని వెలువడుతుంది. సినిమాలు చూసినప్పుడు, పాటలు విన్నప్పుడు మంచి అనుభూతిని కలిగిస్తుంది.
ల్యాప్ టాప్ లోని టచ్ ఇంటర్ ఫేస్ మెరుగైన పనితీరును అందిస్తుంది. వెబ్ బ్రౌజింగ్, ఫైల్ మేనేజ్ మెంట్, వివిధ ప్రాజెక్టు పనులను సౌకర్యవంతంగా చేసుకునే వీలుంటుంది. దీనిలోని 3500 సీఎస్సీ – మెషీన్డ్ కూలింగ్ వెంట్ లతో కూడిన గ్రిల్ డిజైన్ కారణంగా పరికరం వేడెక్కే అవకాశం ఉండదు. దీనిలోని ప్రాసెసర్ సాధారణ వాటితో పోల్చితే మూడు రెట్లు అధిక సామర్థ్యంతో పనిచేస్తుంది. జెన్ బుక్ ఎస్ 16 ల్యాప్ టాప్ లో 78 డబ్ల్యూహెచ్ ఆర్ బ్యాటరీ ఏర్పాటు చేస్తారు. ఇది దాదాపు ఒక్క రోజు వరకూ చార్జింగ్ వస్తుంది. ఈ బ్యాటరీని వందశాతం చార్జింగ్ చేస్తే ఆరు గంటలకు పైగా ఉపయోగించుకోవచ్చు. మీ ఆఫీసు పనులతో పాటు సంగీతం వినడం, యూట్యూబ్ చూడడం, ఎక్స్ లో పోస్టులను పరిశీలించడం.. ఇలా అనేక విధాలుగా వాడుకోవచ్చు.
మెరుగైన పనితీరు, స్లైలిష్ లుక్, అధిక బ్యాటరీ సామర్థ్యం కలిగిన ల్యాప్ టాప్ కోసం ఎదురు చూసే వారికి అసస్ జెన్ బుక్ ఎస్ 16 ల్యాప్ టాప్ చక్కగా సరిపోతుంది. తక్కువ బరువు కారణంగా ప్రయాణంలో తీసుకువెళ్లడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ల్యాప్ టాప్ రూ.1,49,900కి మార్కెట్ లో అందుబాటులో ఉంది. యాపిల్ కు చెందిన ఎం3 మ్యాక్ బుక్ ఎయిర్ కు ఈ ల్యాప్ టాప్ గట్టి పోటీ ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ కిక్ చేయండి..