PAN 2.0: పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
భారతదేశంలో బ్యాంకింగ్ అవసరాలకు ఆధార్‌తో పాటు పాన్ కార్డు తప్పనిసరైంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే ఈ పాన్ కార్డు కేవలం పన్ను చెల్లింపులకే కాకుండా లావాదేవీలను ట్రాక్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే మారుతున్న టెక్నాలజీ నేపథ్యంలో మెరుగైన సేవలను అందించేందుకు పాన్ 2.0 ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.
ఆదాయపు పన్ను శాఖ ప్రారంభించిన ప్రాజెక్ట్ అయిన పాన్ 2.0 పరిచయంతో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఇటీవల పాన్ సిస్టమ్‌లో పెద్ద మార్పును ఆమోదించింది. పాన్, మరియు పన్ను మినహాయింపు ఖాతా (టీఏఎన్) జారీ, నిర్వహణ ప్రక్రియను ఆధునీకరించడంతో పాటు క్రమబద్ధీకరించడం పాన్ 2.0 ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలో ప్రస్తుత పాన్ కార్డులు పని చేస్తాయో? లేదో? అనే అనుమానం సామాన్య ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే పాన్ ఉన్న ఖాతాదారులు అప్‌డేట్‌లు లేదా కరెక్షన్లు చేయాల్సి వస్తే తప్ప కొత్త పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్ానరు. మీరు మీ వివరాలను అప్‌డేట్ చేయాలని నిర్ణయించుకుంటే తప్ప మీ ప్రస్తుత పాన్ కార్డ్ కొత్త పాన్ 2.0 సిస్టమ్‌లో చెల్లుబాటు అవుతుందని వివరిస్తున్నారు.
పాన్ 2.0ను పాన్ సేవల సామర్థ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఆదాయపు పన్ను శాఖ రూపొందించింది. ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా పన్ను చెల్లింపుదారుల నమోదు ప్రక్రియను ఆధునీకరించడం, ఆన్‌లైన్ సేవలను మెరుగుపరచడం, మెరుగైన ధ్రువీకరణ కోసం పాన్‌ను ఆధార్ డేటాతో అనుసంధానించడంపై దృష్టి పెడుతుంది. పాన్ కేటాయింపు, అప్‌డేట్‌లు, దిద్దుబాట్లకు సంబంధించిన వివిధ ప్రక్రియలను క్రమబద్ధీకరించడంతో వినియోగదారులతో పాటు సంస్థలు కూడా తమ పాన్ సమాచారాన్ని నిర్వహించడాన్ని సులభతరం చేస్తుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ ద్వారా పన్ను మినహాయింపు ఖాతా సంఖ్యల సేవలను ఆధునికీకరిస్తారు.
పాన్ 2.0 అంటే చాలా మంది అవసరం లేకపోయినా పాన్ కార్డు అప్ డేట్ చేస్తున్నారని, ఇలా చేయాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అలాగే పాన్ 2.0 కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని చెబుతున్నారు మీరు మీ సమాచారాన్ని అప్‌డేట్ చేయాల్సి వస్తే తప్ప మీరు ఇప్పటికే ఉన్న మీ పాన్ కార్డ్‌ని భర్తీ చేయవలసిన అవసరం లేదు. కొత్త పాన్ 2.0 సిస్టమ్‌లో ప్రస్తుత పాన్ కార్డ్ చెల్లుబాటు అవుతుంది. పాన్ 2.0లో డైనమిక్ క్యూఆర్ కోడ్ కొత్త ఫీచర్ కాదు. ఈ విధానం 2017-18లో ప్రవేశపెట్టారు. అయితే పాన్ 2.0 సిస్టమ్ కింద పాన్ డేటాబేస్ నుంచి రియల్ టైమ్ అప్‌డేటెడ్ డేటాను అందించడానికి క్యూఆర్ కోడ్ మెరుగుపరుస్తుంది. మీ ప్రస్తుత పాన్ కార్డ్‌లో క్యూఆర్ కోడ్ లేకపోతే మీరు ఈ ఫీచర్‌తో కూడిన కొత్త కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డైనమిక్ క్యూఆర్ కోడ్‌తో ఈ అప్‌డేటెడ్ పాన్ కార్డ్ సురక్షితమైన, కచ్చితమైన డేటాను అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ కిక్ చేయండి..