AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digital Arrest: డిజిటల్‌ అరెస్ట్‌ అంటే ఏంటో తెలుసా? మీకు ఇలాంటి కాల్స్‌ వస్తే జాగ్రత్త!

'హలో! నేను సీబీఐ అధికారిని.. మీకు ఓ పార్శిల్‌ వచ్చింది.. అందులో నిషేధిత వస్తువులు ఉన్నాయి.. మీపై కేసు నమోదు చేస్తున్నాం.. మీరు కేసు నుంచి బయటపడాలంటే కొంత డబ్బును చెల్లించాల్సి ఉంటుంది.. అంటూ ఇలాంటి కాల్స్‌ వస్తే తస్మాత్‌ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది స్కామ్ కావచ్చు...

Digital Arrest: డిజిటల్‌ అరెస్ట్‌ అంటే ఏంటో తెలుసా? మీకు ఇలాంటి కాల్స్‌ వస్తే జాగ్రత్త!
Subhash Goud
|

Updated on: Oct 06, 2024 | 7:47 AM

Share

‘హలో! నేను సీబీఐ అధికారిని.. మీకు ఓ పార్శిల్‌ వచ్చింది.. అందులో నిషేధిత వస్తువులు ఉన్నాయి.. మీపై కేసు నమోదు చేస్తున్నాం.. మీరు కేసు నుంచి బయట పడాలంటే కొంత డబ్బును చెల్లించాల్సి ఉంటుంది’.. అంటూ ఇలాంటి కాల్స్‌ వస్తే తస్మాత్‌ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది స్కామ్ కావచ్చు. తాజాగా ఆగ్రాలో అసిస్టెంట్ టీచర్ మల్తీ వర్మను కూడా ఇలాంటి కాల్‌ ఇబ్బందుల్లో నెట్టేసింది. ఈ మోసాన్ని ‘డిజిటల్ అరెస్ట్’ అంటారు. ఈ రోజుల్లో డిజిటల్ ప్రపంచంలో కొత్త కొత్త మోసాలు జరుగుతున్నాయి.

డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి?

ఇవి కూడా చదవండి

డిజిటల్ అరెస్ట్‌లో సైబర్ నేరస్థులు మిమ్మల్ని CBI లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ సంస్థ అధికారులుగా నటిస్తూ కాల్ చేస్తారు. మీరు కొన్ని చట్టపరమైన ఇబ్బందుల్లో ఉన్నారని, మిమ్మల్ని అరెస్టు చేయవచ్చని వారు భయపెడతారు. ఇది ఒక రకమైన సైబర్ మోసం. దీనిలో సైబర్ నేరగాళ్లు ప్రజలను బెదిరించి వారి నుండి డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నిస్తారు. మీ పేరు మీద ఒక పార్శిల్ వచ్చిందని, అందులో నిషేధిత వస్తువులు ఉన్నాయని కూడా చెబుతుంటారు. అంతేకాదు కొంత మొత్తాన్ని ఇవ్వాలని, లేకుంటే మీపై కేసు నమోదు చేస్తామని భయపెడుతుంటారు. ఇలాంటి కాల్స్‌ వచ్చినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండటం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Post Ofiice: పోస్టాఫీసు ద్వారా అద్భుతమైన బిజినెస్‌.. నెలకు రూ.80 వేల ఆదాయం

అప్రమత్తమైన ప్రభుత్వం:

ఇలాంటి మోసాలు తరుచుగా జరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇలాంటి కాల్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది భారత ప్రభుత్వ సైబర్ క్రైమ్ విభాగం నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. ఇలాంటి కాల్స్‌ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరింది.

ఇలాంటి కాల్స్‌ వస్తే ఇలా చేయండి:

మీకు అలాంటి కాల్ వస్తే, వెంటనే దాన్ని డిస్‌కనెక్ట్ చేయండి. కాల్‌లో మీ బ్యాంక్ ఖాతా సమాచారాన్ని లేదా ఏదైనా సున్నితమైన సమాచారాన్ని షేర్ చేయవద్దు. మీ కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడు ఏదైనా కేసులో పట్టుబడ్డారని సైబర్ నేరస్థుడు ఫోన్‌లో చెబితే , ముందుగా మీ కుటుంబ సభ్యుడు, స్నేహితుడితో మాట్లాడి పరిస్థితి గురించి సమాచారాన్ని పొందండి.

మీకు సైబర్ మోసం జరిగినట్లు అనిపిస్తే, లేదా ఇలాంటివి జరగబోతుంటే, పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయండి. మీరు సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కూడా కాల్ చేయవచ్చు. ఇది కాకుండా, మీరు సైబర్ క్రైమ్ పోర్టల్‌లో కూడా ఆన్‌లైన్ ఫిర్యాదును ఫైల్ చేయవచ్చు .

ఇది కూడా చదవండి: Gold Price Today: బంగారం ధరలకు బ్రేకులు.. స్థిరంగా కొనసాగుతున్న ధరలు.. తులం ఎంతంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి