- Telugu News Photo Gallery Technology photos Know why Airplane tyre doesnot burst despite heavy speed and weight of plane
Airplane Tires: విమానం టైర్లు బరువు, వేగాన్ని ఎలా తట్టుకుంటాయి? వీటిని ఎలా తయారు చేస్తారు?
ఒక విమానం ఆకాశం నుంచి రన్‌వేపై ల్యాండ్ అవుతున్నప్పుడు దాని టైర్లు కీలక పాత్ర పోషిస్తాయి. విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై ఎంత ఒత్తిడి ఏర్పడినా తట్టుకునే సామర్థ్యం టైర్లకు ఉంటుంది. రన్‌వేపై ఎంత ఒత్తడి ఏర్పడినా టైర్లు పేలకుండా ఉండే ప్రత్యేకత ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?..
Updated on: Oct 06, 2024 | 8:48 AM

ఒక విమానం ఆకాశం నుంచి రన్‌వేపై ల్యాండ్ అవుతున్నప్పుడు దాని టైర్లు కీలక పాత్ర పోషిస్తాయి. విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై ఎంత ఒత్తిడి ఏర్పడినా తట్టుకునే సామర్థ్యం టైర్లకు ఉంటుంది. రన్‌వేపై ఎంత ఒత్తడి ఏర్పడినా టైర్లు పేలకుండా ఉండే ప్రత్యేకత ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

విమాన టైర్లు వేల పౌండ్ల బరువు, అధిక వేగాన్ని తట్టుకునేలా ఉంటాయి. ఇది ప్రత్యేకంగా తయారు చేయడమే దీనికి కారణం. ఈ టైర్ల తయారీలో ప్రత్యేక మెటీరియల్‌ను వాడుతారు. ఈ టైర్లు నైట్రోజన్ వాయువుతో నిండి ఉంటాయి. ఇవి విమానం ల్యాండింగ్ సమయంలో ఎంతటి ఒత్తిడినైనా తట్టుకోగలవు.

ఈ టైర్లు సింథటిక్ రబ్బరు సమ్మేళనాలతో తయారు చేస్తారు. అలాగే ఇవి అల్యూమినియం స్టీల్, నైలాన్‌తో కలిపి ఉంటాయి. దీని కారణంగా ఇది టైర్లు బలోపేతంగా ఉంటాయి. ఎంత ఒత్తిడి ఏర్పడినా కూడా అవి పగిలిపోకుండా ఉంటాయి.

విమానం టైర్లు ట్రక్ టైర్ల కంటే రెండింతలు. కార్ టైర్ల కంటే ఆరు రెట్లు ఎక్కువ. విమానం తయారు చేసేటప్పుడు దాని సైజు, బరువు తదితర వివరాలను పరిగణలోకి టైర్లను తయారు చేస్తారు.

టైర్లు నైట్రోజన్ వాయువు అని పిలిచే ఒక ప్రత్యేక రకం గాలితో నిండి ఉంటుంది. విమానం టైర్లు నైట్రోజన్‌తో నిండి ఉండటం కారణంగా ఎంతటి ఒత్తిడినైనా తట్టుకునే శక్తి ఉంటుంది. ఇది ఒక జడ వాయువు. అందుకే ఇది అధిక ఉష్ణోగ్రత, పీడన మార్పులకు తక్కువగా ప్రభావితమవుతుంది. అలాగే టైర్లను తయారు చేసేటప్పుడు 38 టన్నుల వరకు బరువుతో పరీక్షిస్తారు.




