LIC Policy: రూ.45 ఇన్వెస్ట్‌మెంట్‌లో చేతికి రూ.25 లక్షలు.. ఎల్‌ఐసీలో అద్భుతమైన పాలసీ!
దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పొదుపు పథకాలు భద్రత, రాబడి రెండింటి పరంగా బాగా ప్రాచుర్యం పొందాయి. ఎల్‌ఐసీ అన్ని వయసుల వారికి అందుబాటులో ఉన్న ప్లాన్‌లను కలిగి ఉంది. దీనిలో మీరు చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా భారీ ఫండ్‌ను కూడబెట్టుకోవచ్చు...
దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పొదుపు పథకాలు భద్రత, రాబడి రెండింటి పరంగా బాగా ప్రాచుర్యం పొందాయి. ఎల్‌ఐసీ అన్ని వయసుల వారికి అందుబాటులో ఉన్న ప్లాన్‌లను కలిగి ఉంది. దీనిలో మీరు చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా భారీ ఫండ్‌ను కూడబెట్టుకోవచ్చు. అటువంటి పథకం ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ. దీనిలో మీరు రోజుకు కేవలం రూ. 45 ఆదా చేయడం ద్వారా రూ. 25 లక్షలు పొందవచ్చు. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
మీరు తక్కువ ప్రీమియంతో మీ కోసం పెద్ద ఫండ్‌ను సేకరించాలనుకుంటే, జీవన్ ఆనంద్ పాలసీని ఎంచుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇది టర్మ్ ప్లాన్ లాంటిదే. మీ పాలసీ అమల్లో ఉన్నంత కాలం మీరు ప్రీమియం చెల్లించవచ్చు. ఎల్‌ఐసీఈ పథకంలో కనీసం రూ. 1 లక్ష హామీ ఇస్తారు. గరిష్ట పరిమితి ఏదీ నిర్ణయించలేదు.
ఇది కూడా చదవండి: Ayushman Bharat: ఇక గూగుల్‌లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్.. కొత్త అప్‌డేట్
రూ. 45 డిపాజిట్ చేయడం ద్వారా రూ. 25 లక్షలు ఎలా సంపాదించాలి?
ఎల్‌ఐసి జీవన్ ఆనంద్ పాలసీలో మీరు ప్రతి నెలా దాదాపు రూ. 1358 డిపాజిట్ చేయవచ్చు. అలాగే రూ. 25 లక్షల ఫండ్‌ను డిపాజిట్ చేయవచ్చు. మీరు ప్రతిరోజూ రూ.45 ఆదా చేయాలి. మీరు ఈ పొదుపులను దీర్ఘకాలికంగా చేయవలసి ఉంటుంది. ఈ పాలసీ కింద మీరు రోజూ రూ. 45 ఆదా చేసి, 35 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే, ఈ పథకం మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత, మీకు రూ. 25 లక్షల మొత్తం లభిస్తుంది. మీరు వార్షిక ప్రాతిపదికన ఆదా చేసిన మొత్తాన్ని పరిశీలిస్తే, అది దాదాపు రూ.16,300 అవుతుంది.
డబుల్ బోనస్ కంటే ఎక్కువ ప్రయోజనం:
మీరు ఎల్‌ఐసి జీవన్ ఆనంద్‌లో 35 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం రూ. 16,300 పెట్టుబడి పెడితే, మొత్తం డిపాజిట్ మొత్తం రూ. 5,70,500 అవుతుంది. ఇప్పుడు పాలసీ టర్మ్ ప్రకారం.. ప్రాథమిక హామీ మొత్తం రూ.5 లక్షలు అవుతుంది. మెచ్యూరిటీ వ్యవధి తర్వాత మీకు రూ. 8.60 లక్షల రివిజనరీ బోనస్, రూ. 11.50 లక్షల చివరి బోనస్ లభిస్తుంది. ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో బోనస్ రెండుసార్లు ఇస్తారు. అయితే దీనికి మీ పాలసీ తప్పనిసరిగా 15 సంవత్సరాలు ఉండాలి.
పాలసీ బెనిఫిట్స్..
- మెచ్యూరిటీ బెనిఫిట్: పాలసీ టర్మ్ ముగిసే సమయానికి పాలసీదారుడు జీవించి ఉంటే మెచ్యూరిటీ బెనిఫిట్‌తో పాటు ప్రీమియం మొత్తం లభిస్తుంది.
- డెత్ బెనిఫిట్: పాలసీదారుడు ఏదైనా కారణంగా మరణించినట్లయితే అతనిపై ఆధారపడిన కుటుంబానికి అంటే నామినీకి డెత్ బెనిఫిట్స్ లభిస్తాయి.
- ఫ్రాఫిట్‌లో షేరు: ఈ పాలసీ మీరు తీసుకున్నట్లయితే మీకు ఎల్ఐసీకి వచ్చే లాభాల్లో వాటా కూడా లభిస్తుంది.
- పన్ను మినహాయింపు: ఈ ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. పన్ను ఆదా చేసుకునేందుకు ఇది మంచి అవకాశం.
ఇది కూడా చదవండి: Gold Price Today: బంగారం ధరలకు బ్రేకులు.. స్థిరంగా కొనసాగుతున్న ధరలు.. తులం ఎంతంటే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి