Ayushman Bharat: ఇక గూగుల్‌లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్.. కొత్త అప్‌డేట్‌

దేశంలోని ప్రజలకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీని అందించడానికి ఆయుష్మాన్ భారత్ యోజన అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ స్కీమ్‌కి సంబంధించి పెద్ద అప్‌డేట్ వచ్చింది. ఈ స్కీమ్‌ను పొందుతున్నప్పుడు ప్రజలు ఎటువంటి సమస్యను ఎదుర్కోకుండా, వారి పని సులభం అయ్యేలా కేంద్రం చర్యలు చేపడుతోంది..

Ayushman Bharat: ఇక గూగుల్‌లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్స్.. కొత్త అప్‌డేట్‌
Follow us
Subhash Goud

|

Updated on: Oct 06, 2024 | 9:23 AM

దేశంలోని ప్రజలకు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీని అందించడానికి ఆయుష్మాన్ భారత్ యోజన అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ స్కీమ్‌కి సంబంధించి పెద్ద అప్‌డేట్ వచ్చింది. ఈ స్కీమ్‌ను పొందుతున్నప్పుడు ప్రజలు ఎటువంటి సమస్యను ఎదుర్కోకుండా, వారి పని సులభం అయ్యేలా కేంద్రం చర్యలు చేపడుతోంది. ఇప్పుడు గూగుల్‌ సహకారంతో ఒక వ్యవస్థను సిద్ధం చేస్తోంది. దీని వలన ప్రజలు గూగుల్‌లోనే ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్‌ను పొందవచ్చు జన్‌ ఆరోగ్య యోజన (Jan Arogya Yojana (AB PM – JAY) ప్రయోజనాలను పొందేందుకు ప్రజల ఆరోగ్య కార్డులు పొందవచ్చు. త్వరలో ఈ హెల్త్ కార్డ్‌లు Google Walletలో అందుబాటులోకి రానున్నాయి. ఇది సామాన్యులకు అనేక ప్రయోజనాలను అందిస్తోంది.

ఇది కూడా చదవండి: Post Ofiice: పోస్టాఫీసు ద్వారా అద్భుతమైన బిజినెస్‌.. నెలకు రూ.80 వేల ఆదాయం

హెల్త్ కార్డ్ 2025 నుండి గూగుల్‌ వాలెట్‌లో

ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ (ABHA ID) 2025 నుండి గూగుల్‌ వాలెట్‌లో అందుబాటులో ఉంటుందని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. ఆయుష్మాన్ భారత్ పథకం ప్రయోజనాలను ప్రజలకు డిజిటల్‌గా అందించేందుకు రూపొందించిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM)లో ఇది ఒక భాగం. ఈ మిషన్‌ను పర్యవేక్షిస్తున్న నేషనల్ హెల్త్ అథారిటీ గూగుల్‌తో జతకట్టింది. దీని కారణంగా ఈ పథకానికి సంబంధించిన హెల్త్ కార్డ్‌లు గూగుల్‌ వాలెట్‌లో డిజిటల్ ఫార్మాట్‌లో మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటాయి. దీంతో పథకం ప్రయోజనం ప్రజలకు త్వరగా చేరేందుకు దోహదపడుతుంది. గూగుల్‌ వాలెట్‌లో అందుబాటులో ఉన్న ABHA ID కార్డ్‌తో ప్రజలు ల్యాబ్ పరీక్ష నివేదికలు, మందుల స్లిప్‌ల వంటి వారి వైద్య రికార్డులను దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కేంద్రాలలో చూపించవచ్చని తెలిపింది.

ఇది కూడా చదవండి: Gold Price Today: బంగారం ధరలకు బ్రేకులు.. స్థిరంగా కొనసాగుతున్న ధరలు.. తులం ఎంతంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి