AP Rains: బాబోయ్ అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
ఆంధ్రాకు ఇంకా వర్షాలు వీడలేదు. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి. కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తాజా వెదర్ రిపోర్ట్ ఇలా ఉంది.
నిన్నటి నైరుతి & ఆనుకుని ఉన్న పశ్చిమ బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనం ఈ రోజు బలహీనపడినది. ఆయితే దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు విస్తరించి ఉంది. దీని ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉండనున్నాయి.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- —————————————-
ఈరోజు:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు.. గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
రేపు:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఎల్లుండి:- వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:- ——————————
ఈరోజు:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు.. గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
రేపు, ఎల్లుండి:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమ:- ————–
ఈరోజు:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
రేపు, ఎల్లుండి:- తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీలో చెక్ చేస్తూ.. ఓ బెర్త్ కింద కనిపించింది చూడగా
డిసెంబర్ 27, శుక్రవారం : ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్,అన్నమయ్య , చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ~ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) December 26, 2024
HyderabadRains
Fresh rains from Yadadri – Bhongir, Jangaon, Rangareddy, Nalgonda moving in. Expect quick spells of showers next 1-2hrs starting with East HYD 🌧️
— Telangana Weatherman (@balaji25_t) December 26, 2024
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..