Retail Sales: రిటైల్ అమ్మకాల జోరు..దేశ ఆర్ధిక వ్యవస్థలో మెరుగుదల.. సేల్స్ ఎంత పెరిగాయంటే..

దేశ ఆర్థిక వ్యవస్థ నిరంతర మెరుగుదల సంకేతాలను చూపుతోంది. అక్టోబర్ నెలలో రిటైల్ అమ్మకాలు 34 శాతం పెరిగాయి. ఈ సమాచారం రిటైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (RAI) అందించింది.

Retail Sales: రిటైల్ అమ్మకాల జోరు..దేశ ఆర్ధిక వ్యవస్థలో మెరుగుదల.. సేల్స్ ఎంత పెరిగాయంటే..
Retail Sales
Follow us

|

Updated on: Nov 13, 2021 | 8:34 AM

Retail Sales: దేశ ఆర్థిక వ్యవస్థ నిరంతర మెరుగుదల సంకేతాలను చూపుతోంది. అక్టోబర్ నెలలో రిటైల్ అమ్మకాలు 34 శాతం పెరిగాయి. ఈ సమాచారం రిటైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (RAI) అందించింది. ఆర్ఏఐ(RAI) సమాచారం ప్రకారం, అక్టోబర్ 2019తో పోల్చినట్లయితే, ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో కేవలం 14 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. అయితే గతేడాదితో పోలిస్తే ఇది 34 శాతం పెరిగింది. అక్టోబరు నెల అంటే పండుగల సీజన్‌. అటువంటి పరిస్థితిలో, అక్టోబర్, నవంబర్ డేటా ఉంటే రిటైల్ అమ్మకాల వాస్తవ స్థితి గురించి తెలుసుకోవడం ముఖ్యం. అందువల్ల మార్కెట్..డిమాండ్ సరైన అంచనా నవంబర్ డేటా తర్వాత మాత్రమే చేయగలుగుతారు. అయితే ఇప్పటి వరకు నవంబర్ రిటైల్ అమ్మకాలకు సంబంధించి వచ్చిన సూచీలన్నీ సానుకూల సంకేతాలనే ఇస్తున్నాయి.

పశ్చిమ భారతదేశంలో అమ్మకాలలో అతిపెద్ద పెరుగుదల

భారతదేశంలోని వివిధ ప్రాంతాల గురించి చెప్పాలంటే, పశ్చిమ భారతదేశంలో రిటైల్ విక్రయాలలో 23 శాతం వృద్ధి నమోదైంది. ఇది మునుపటి కరోనా స్థాయితో పోలిస్తే. ఆ తర్వాత తూర్పు భారతదేశంలో 13 శాతం, ఉత్తర, దక్షిణ భారతంలో వృద్ధి రేటు 10-10 శాతంగా ఉంది.

ఆభరణాల విభాగంలో అత్యధికం..

విక్రయాల్లో ఆభరణాల విభాగంలో అత్యధిక వృద్ధి నమోదైంది. ఈ విభాగంలో 24 శాతం వృద్ధి నమోదైంది. దీనికి పండుగ సీజన్ కూడా కారణం కావచ్చని అంచనా వేస్తున్నారు. అపెరల్ సెగ్మెంట్ 6 శాతం జంప్ నమోదు చేసింది. కిరాణా, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు వరుసగా 31 శాతం మరియు 29 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

ఐఐపీ 3.1 శాతం ఎగసింది

సెప్టెంబర్ నెలలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 3.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ సమాచారాన్ని ఎన్ఎస్ఓ(NSO) షేర్ చేసింది. సెప్టెంబర్ 2020లో, IIP 1 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గురించి చూస్తే, ఏప్రిల్..సెప్టెంబర్ మధ్య, పారిశ్రామిక ఉత్పత్తి సూచిక మొదటి అర్ధ భాగంలో 23.5 శాతంగా ఉంది. ఇది 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో మైనస్ 20.8 శాతంగా ఉంది.

ఇవి కూడా చదవండి: Zika Virus: పెరుగుతున్న జికా వైరస్ వ్యాప్తి.. గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే..

Health with Ghee: మన ఆరోగ్యానికి ఏ నెయ్యి మంచిది? పసుపు నెయ్యి.. తెల్లని నెయ్యి మధ్య తేడాలేంటి?

CBSE Exams: సీబీఎస్‌ఈ..ఐసీఎస్ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలి..సుప్రీంకోర్టులో పిటిషన్‌!

Latest Articles