Indian Railways: రైల్వే ప్రయాణీకులకు పెను ఊరట.. కీలక నిర్ణయాలు తీసుకున్న భారతీయ రైల్వే
Indian Railways: రైల్వే ప్రయాణీకులకు పెను ఊరట కలిగిస్తూ.. భారతీయ రైల్వే(Indian Railways) సంచలన నిర్ణయాలు తీసుకుంది. కోవిడ్ పాండమిక్ తర్వాత ఇప్పటి వరకు
Railway News: రైల్వే ప్రయాణీకులకు పెను ఊరట కలిగిస్తూ.. భారతీయ రైల్వే(Indian Railways) సంచలన నిర్ణయాలు తీసుకుంది. కోవిడ్ పాండమిక్ తర్వాత ఇప్పటి వరకు మెయిల్స్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను ‘ప్రత్యేక రైళ్ల’ ట్యాగ్‌తో నడుపుతున్న భారతీయ రైల్వే.. ఇక నుంచి వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై కరోనాకు మునుపటిలా పాత రైలు నంబర్, పాత ఛార్జీలతో మాత్రమే రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. రైల్వేల ప్రకారం, ఇప్పటి వరకు ప్రత్యేక రైళ్లకు కేటాయించిన నంబర్ ‘0’ కూడా తొలగించినున్నట్లు పేర్కొంది. అంటే అన్ని రైళ్లు ప్రీకోవిడ్‌కు ముందు ఎలాంటి నంబర్లతో తిరిగాయో.. ఇప్పుడు కూడా అలానే పాత నంబర్లతో నడవనున్నాయి. అలాగే కోవిడ్‌కు ముందు ఉన్న రైల్వే ఛార్జీలే వర్తించనున్నట్లు తెలిపింది. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ‘ప్రత్యేక’ ట్యాగ్‌ను తొలగించి నడపనున్నట్లు పేర్కొంది. అలాగే మహమ్మారి కంటే ముందు ఉన్న ఛార్జీలనే అమలులోకి రానున్నట్లు రైల్వే శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక ట్యాగ్‌ను తొలగించడం ద్వారా అర్హులైన ప్రయాణీకులకు తగిన రాయితీలు లభించనున్నాయి.
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతోంది. ఇవి సుదూర రైళ్లతో ప్రారంభించినా.. తక్కువ దూరం ప్రయాణించే వారికి కూడా ఎక్కువ ఛార్జీలు వసూళ్లు చేయడంతో వీటిల్లో ప్రయాణించేందుకు ప్రజలు అంతగా ఆసక్తి చూపించలేదు. రైల్వే బోర్డు, శుక్రవారం జోనల్ రైల్వేలకు రాసిన లేఖలో, రైళ్లు ప్రస్తుతం వాటి రెగ్యులర్ నంబర్‌లతో నడపాలని, కోవిడ్‌కు ముందు ఉన్న రేట్లే అమలు చేయాలని పేర్కొంది.
ప్రత్యేక కేటగిరీ రైళ్లలో సాధారణం కంటే 30 శాతం ఎక్కువ.. ప్రత్యేక కేటగిరీ రైళ్ల ఛార్జీలు సాధారణ రైళ్ల కంటే 30 శాతం ఎక్కువగా ఉండేవి. కోవిడ్ ప్రోటోకాల్‌లో రైల్వే ప్రత్యేక కేటగిరీలలో రైళ్లను నడపడం ప్రారంభించింది. రైళ్లలో రద్దీని అదుపులో ఉంచడమే దీని ఉద్దేశంగా పేర్కొంది. ప్రస్తుతం రైల్వేకు చెందిన మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 95 శాతం తిరిగి ట్రాక్‌లోకి వచ్చాయి. అయితే వీటిలో 25 శాతం రైళ్లు ఇప్పటికీ ప్రత్యేక కేటగిరీలో నడుస్తున్నాయి. ఈ రైళ్లలో 30 శాతం ఎక్కువ ఛార్జీలు వసూళ్లు చేస్తున్నారు.
ఇది కాకుండా, ప్యాసింజర్ రైళ్లలో 70 శాతం రైళ్లకు మెయిల్ ఎక్స్‌ప్రెస్ హోదా కూడా ఇచ్చారు. దీని కారణంగా ప్రయాణీకులు వాటికి కూడా ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది. కోవిడ్‌కు ముందు, రైల్వేలో సుమారు 1700 మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడిచేవి. వీటిలో చాలా రైళ్లు పునఃప్రారంభమయ్యాయి. అదే సమయంలో, కోవిడ్‌కు ముందు సుమారు 3500 ప్యాసింజర్ రైళ్లు నడిచేవి. అయితే వీటిలో ప్రస్తుతం 1000 మాత్రమే నడుస్తున్నాయి. కాగా ప్రతి జోన్‌లోని అన్ని సబర్బన్ రైళ్లను కూడా ప్రారంభించారు.
Also Read: Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధరలు.. మళ్లీ భారీగా పెరిగిన సిల్వర్ రేట్లు..
Gold Price Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్.. పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. మళ్లీ ఎంత పెరిగిందంటే?