Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధరలు.. మళ్లీ భారీగా పెరిగిన సిల్వర్ రేట్లు..

Latest Silver Price: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. పసిడి, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరి కొన్నిసార్లు

Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధరలు.. మళ్లీ భారీగా పెరిగిన సిల్వర్ రేట్లు..
Silver Price Today
Follow us

|

Updated on: Nov 13, 2021 | 6:42 AM

Latest Silver Price: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటుచేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. పసిడి, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరి కొన్నిసార్లు పెరుగుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంటారు. ఇటీవల తగ్గుతూ వచ్చిన ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. శనివారం కూడా వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో కిలో వెండి ధర రూ.67,100 లుగా ఉంది. కిలో వెండిపై రూ.600 మేర పెరిగింది. అయితే.. ఉత్తరాది ప్రాంతాల కంటే.. దక్షిణాది ప్రాంతాల్లోనే వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం..

ప్రధాన నగరాల్లో వెండి ధరలు.. * దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెండి ధర కిలో రూ.67,100 వద్ద కొనసాగుతోంది. * దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,100 లుగా ఉంది. * తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ.71,400 లుగా ఉంది. * బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ.67,100 గా కొనసాగుతోంది. * కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.67,100 లుగా ఉంది. * కేరళలో కిలో వెండి ధర రూ.71,400 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో.. * హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,400 లుగా కొనసాగుతోంది. * విజయవాడలో వెండి ధర రూ.71,400 వద్ద కొనసాగుతోంది. * విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ.71,400 లుగా ఉంది.

కాగా.. ఈ ధరలు శనివారం ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. ప్రతిరోజూ ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

Gold Price Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. మళ్లీ ఎంత పెరిగిందంటే?

Maoist Leader: మావోలకు షాక్.. తలపై కోటి రివార్డ్ ఉన్న మావోయిస్టు అగ్రనేత భార్యతో సహా అరెస్ట్..