Jio 5G: జియో కస్టమర్లకు దసరా కానుక.. నేటి నుంచి ఆ నగరాల్లో 5జీ బీటా సేవలు
ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, వారణాసి నగరాల్లోని జియో వినియోగదారులు ఇవాళ్టి నుంచి 5జీ సేవలను యాక్సెస్ చేయనుంది రిలయన్స్ జియో సంస్థ . జియో ప్రతి ఒక్క వినియోగదారుడికి ఈ 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5జీ సేవలు అందుబాటులోకి రానే వచ్చాయి. అయితే, తొలిసారిగా దసరా పండుగను పురస్కరించుకొని దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో 5జీ సేవలు ప్రయోగాత్మకంగా అందించేందుకు రిలయన్స్ జియో సిద్ధమైంది. ఈ 5జీ సేవలను కూడా లిమిటెడ్ యూజర్లకు మాత్రమే అందిస్తుండటం విశేషం. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, వారణాసి నగరాల్లోని జియో వినియోగదారులు ఇవాళ్టి నుంచి 5జీ సేవలను యాక్సెస్ చేయనుంది రిలయన్స్ జియో సంస్థ . జియో ప్రతి ఒక్క వినియోగదారుడికి ఈ 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి..ఎంపిక చేసిన వినియోగదారులకు ‘జియో వెల్‌కం ఆఫర్’ అంటూ ఇన్విటేషన్ పంపించారు. ఈ 5జీ సేవల బీటా పరీక్ష మాత్రమే కానీ వాణిజ్య ప్రయోగం కాదు. అందుకని రాండమ్‌గా ఎంపికైన వినియోగదారులకు మాత్రమే 5జీ సేవలు అందుతాయి. ర్యాండ్‌మ్‌గా ఎంపికైన వినియోగదారులు ప్రస్తుతం వాడుతున్న హ్యాండ్‌సెట్, సిమ్‌ను మార్చాల్సిన అవసరం లేదని సంస్థ తెలిపింది.
కాగా ప్రయోగాత్మకంగా అందిస్తున్న తొలి దశలో 1 జీబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ 5 జీ డాటాను కస్టమర్లు పొందుతారని రిలయన్స్ జియో తెలిపింది.. ఈ నెల1న దేశవ్యాప్తంగా తొలి దశలో 13 నగరాల్లో 5G సేవలను ఆవిష్కరించారు ప్రధాని మోదీ. దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ముకేశ్ అంబానీ, కుమారమంగళం బిర్లా, సునీల్ భారతి మిట్టల్ సమక్షంలో ప్రధాని మోదీ ఇండియాలో 5G సేవలు ప్రారంభించారు.ప్రతిష్ఠాత్మక ఇండియా మొబైల్ కాంగ్రెస్ వేదికగా 5G సేవలను ప్రారంభించడం దేశవ్యాప్తంగా టెలికాం సాంకేతిక రంగంలో వినూత్న ఒరవడికి ప్రాణం పోసింది.
అదనపు ధరలేవి లేకుండానే
కాగా ఈసేవలతో వినియోగదారులు గరిష్టంగా 1 Gbps+ వేగంతో అపరిమిత 5G డేటాను పొందుతారని వెల్లడించారు. ఇతర నగరాల కోసం బీటా ట్రయల్ సేవ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. జియో ట్రూ 5జీ సేవలు నాలుగు నగరాల్లో వెల్‌కమ్ ఆఫర్‌ను ప్రకటించింది. 5జీ టెక్నాలజీలో ఇంటర్నెట్ వేగంగా ఎక్కువగా ఉంటుందని, ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.కాగా, తమ వినియోగదారులు 5జీ సేవల విలువను గుర్తించే వరకు ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోదని జియో తేల్చి చెబుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి