Reliance Jio: 1.6 కోట్ల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది.. జియోకు షాకిచ్చిన వినియోగదారులు!
Reliance Jio: రిలయన్స్ జియోకు వినియోగదారులు షాకిస్తున్నారు. నెలనెల సబ్‌స్క్రైబర్ల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. కారణం రీఛార్జ్ ధరల పెంపు. ఒక్క జియోనే కాకుండా ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలకు కూడా ఇదే పరిస్థితి ఉంది. నెలనెలా వినియోగదారుల సంఖ్య తగ్గిపోతోంది. జియోకు గత నాలుగు నెలల్లో భారీగా తగ్గిపోతున్నారు..
దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య నాలుగు నెలల్లో 1.65 కోట్లు తగ్గింది. అక్టోబర్‌లో రిలయన్స్ జియో మొబైల్ సబ్‌స్క్రైబర్లు 37.6 లక్షలు తగ్గిపోయారు. అదే సమయంలో మొబైల్ సబ్‌స్క్రైబర్‌లు సెప్టెంబర్ 2024లో 79 లక్షలు, ఆగస్టు 2024లో 40 లక్షలు, జూలై 2024లో 7.58 లక్షలకు పైగా కోల్పోయింది జియో. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) డేటా ప్రకారం, భారతదేశంలోని రెండవ అతిపెద్ద టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ సెప్టెంబర్‌లో 14.3 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయిన తర్వాత, అక్టోబర్‌లో దాదాపు 24 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్‌లు చేర్చుకుంది.
ఇది కూడా చదవండి: Isha Ambanis: అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
ఎయిర్‌టెల్ ఆగస్టు 2024లో 24 లక్షల మందిని, జూలై 2024లో 16 లక్షల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. అక్టోబర్‌లో వొడాఫోన్ ఐడియా 19 లక్షల మంది మొబైల్ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోగా, సెప్టెంబర్‌లో 15.5 లక్షలు కోల్పోయింది. అక్టోబర్ గణాంకాల ప్రకారం, రిలయన్స్ జియోకు 47.48 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉండగా, భారతీ ఎయిర్‌టెల్‌కు 28.7 కోట్లు, వొడాఫోన్ ఐడియాకు 12.5 కోట్లు, బిఎస్‌ఎన్‌ఎల్‌కు 3.6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
టారిఫ్ పెంపు కారణంగా కస్టమర్ల సంఖ్య తగ్గుముఖం:
ఇటీవల ప్రైవేట్ టెలికాం కంపెనీలు టారీఫ్‌లను పెంచిన తర్వాత సబ్‌స్క్రైబర్లు తగ్గుముఖం పట్టారు. ప్రైవేట్ టెలికాం కంపెనీల వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు వెళ్లారు.
దూసుకుపోతున్న బీఎస్‌ఎల్
ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL చందాదారుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. గత నాలుగు నెలల్లో 68 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను చేర్చుకుంది. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలను పెంచితే బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం ఎలాంటి ధరలను పెంచలేదు. దీంతో చాలా మంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్టు పెట్టుకుంటున్నారు.
మొత్తం మార్కెట్ షేర్‌లో రిలయన్స్ జియో అగ్రస్థానం:
మొత్తం మార్కెట్ వాటాలో రిలయన్స్ జియో 39.99 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, 33.50 శాతంతో భారతీ ఎయిర్‌టెల్ 18.30 శాతం, BSNL 8.05 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి.
ఇది కూడా చదవండి: WhatsApp: జనవరి 1 నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్ బంద్..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి