JIO: జియో యానివర్సరీ ఆఫర్‌.. 5 రోజుల పాటే అవకాశం, బెనిఫిట్స్‌ సూపర్‌

జియో యానివర్సరీ ఆఫర్‌లో భాగంగా రూ. 899, రూ. 999, రూ. 3599 ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. అయితే ఈ ఆఫర్‌ కేవలం సెప్టెంబర్‌ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రీఛార్జ్‌ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్లాన్స్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే.. రూ.175 విలువైన 10 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ 10 జీబీ డేటా ప్యాక్ లభిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీ ఈ ఆఫర్‌లో..

JIO: జియో యానివర్సరీ ఆఫర్‌.. 5 రోజుల పాటే అవకాశం, బెనిఫిట్స్‌ సూపర్‌
Recharge Plan
Follow us

|

Updated on: Sep 05, 2024 | 2:38 PM

టెలకం రంగంలో జియో హవా కొనసాగుతోంది. యూజర్లను ఆకట్టుకునే దిశగా కొంగొత్త ఆఫర్లతో ముందుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జియో 8వ వార్సికోత్సవాన్ని పురస్కరించుకొని యూజర్లకు గుడ్ న్యూస్‌ చెప్పింది. జియో యానివర్సరీ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తోంది. మొత్తం 3 కొత్త రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఏంటా ప్లాన్స్.? వాటితో లభించే బెనిఫిట్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

జియో యానివర్సరీ ఆఫర్‌లో భాగంగా రూ. 899, రూ. 999, రూ. 3599 ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. అయితే ఈ ఆఫర్‌ కేవలం సెప్టెంబర్‌ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రీఛార్జ్‌ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్లాన్స్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే.. రూ.175 విలువైన 10 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ 10 జీబీ డేటా ప్యాక్ లభిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీ ఈ ఆఫర్‌లో అందించారు. అలాగే జొమాటో కస్టమర్లకు 3 నెలల గోల్డ్ సబ్స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది.

Jio

ఇంతే కాకుండా.. ఏజియో నుండి రూ .2999 కంటే ఎక్కువ కొనుగోళ్లపై వినియోగదారులకు రూ .500 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక రూ,899 ప్లాన్ 90 రోజులు, రూ.999 ప్లాన్ 98 రోజులు కాగా.. రూ.3599 ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. వీటితో పాటు ఈ ప్లాన్స్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే.. అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు, ప్రతిరోజూ ఉచితంగా 100 ఎస్‌ఎంఎస్లు రోజుకు 2 జీబీ డేటా, 20 జీబీ అదనపు డేటాను పొందొచ్చు. అన్‌లిమిటెడ్‌ 5జీ డేటా సైతం పొందొచ్చు. అలాగే అదనంగా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ యాక్సెస్‌ను ఉచితంగా పొందొచ్చు. ఇదిలా ఉంటే జియోకు ప్రస్తుతం 49 కోట్లకుపైగా సబ్‌స్క్రైబర్లు ఉండం విశేషం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..