AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki: మారుతీ సుజుకీపై ఎర్ర సముద్రం ఎఫెక్ట్‌.. మళ్లీ భారీగా ధరలు పెరిగే అవకాశం

ఎర్ర సముద్రం ప్రాంతంలో సంక్షోభం కారణంగా మారుతి సుజుకీ అనేక ఇతర తయారీ కంపెనీల మాదిరిగానే కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. వాణిజ్య నౌకల పై తీవ్రవాదుల దాడుల కారణంగా ఎర్ర సముద్రం ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటం వల్ల కంపెనీలు ఆలస్యమైన డెలివరీలతో పాటు అధిక ఖర్చులను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా నౌకల్లోని సరుకులను తిరిగి మార్చాల్సి వస్తుంది. ఈ సంక్షోభం కారణంగా ప్రభావితమైన కంపెనీలలో మారుతి సుజుకీ ఒకటి కావడం వల్ల లాజిస్టికల్ సవాళ్లను ఎదుర్కొంటోంది.

Maruti Suzuki: మారుతీ సుజుకీపై ఎర్ర సముద్రం ఎఫెక్ట్‌.. మళ్లీ భారీగా ధరలు పెరిగే అవకాశం
Maruti Suzuki
Nikhil
|

Updated on: Feb 03, 2024 | 7:00 AM

Share

భారతదేశంలో మారుతీ సుజుకీ కార్లంటే ఇష్టపడని వారు ఉండరు. తక్కువ ధరలోనే అత్యాధునిక ఫీచర్లు అందించే ఈ కార్లను ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఎర్ర సముద్రం ప్రాంతంలో సంక్షోభం కారణంగా మారుతి సుజుకీ అనేక ఇతర తయారీ కంపెనీల మాదిరిగానే కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. వాణిజ్య నౌకల పై తీవ్రవాదుల దాడుల కారణంగా ఎర్ర సముద్రం ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటం వల్ల కంపెనీలు ఆలస్యమైన డెలివరీలతో పాటు అధిక ఖర్చులను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా నౌకల్లోని సరుకులను తిరిగి మార్చాల్సి వస్తుంది. ఈ సంక్షోభం కారణంగా ప్రభావితమైన కంపెనీలలో మారుతి సుజుకీ ఒకటి కావడం వల్ల లాజిస్టికల్ సవాళ్లను ఎదుర్కొంటోంది. దీంతో రాబోయే నెలల్లో మారుతీ సుజుకీ తన ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచే అవకాశం ఉందని మారుతీ ఇన్వెస్టర్ రిలేషన్స్ చీఫ్ రాహుల్ భారతి పేర్కొన్నారు. ముఖ్యంగా మారుతీ సుజుకి ఉత్పత్తిలో ఖర్చు పెరుగుదలను అంచనా వేస్తోందని, ఇది ఆటోమేకర్ ప్యాసింజర్ వాహనాల ధరలలో కూడా ప్రతిబింబించవచ్చని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ కార్ల ధరలపై పెంపునకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఎర్ర సముద్రంలోని సంక్షోభం కారణంగా మారుతీ సుజుకీ ధరలు ఏ స్థాయిలో పెరుగుతాయో? అని ఇంకా పేర్కొనప్పటికీ ధరల పెంపు మాత్రం కచ్చితంగా ఉండనుంది. అయితే ధరల పెంపు గణనీయంగా ఉండదని మాత్రం మారుతీ సుజుకీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా సంక్షోభం అధిక వెయిటింగ్ పీరియడ్‌కు దారితీయవచ్చు. మారుతీ సుజుకి గత నెల చివరిలో ధరల పెంపును ప్రకటించింది, ఇది జనవరి 2024 నుండి దాని మొత్తం ప్యాసింజర్ వాహన శ్రేణికి వర్తిస్తుంది. పెరుగుతున్న ముడిసరుకు ఖర్చులు, ద్రవ్యోల్బణం కారణంగా అధిక ఉత్పత్తి ఖర్చులు ధరల పెంపుదలకు కారణమని కార్ల తయారీ సంస్థ పేర్కొంది. మారుతీ సుజుకి మాత్రమే కాకుండా టాటా మోటార్స్, మహీంద్రా, హెూండాతో సహా అనేక ఇతర కార్ల తయారీ సంస్థలు తమ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.

మారుతీ సుజుకి భారతదేశంలో అత్యంత విలువైన కార్ల తయారీ సంస్థ అనే బిరుదును టాటా మోటార్స్ చేతిలో కోల్పోయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసిక లాభం 33 శాతం పెరిగింది. ఈ బ్రాండ్‌కు సంబంధించిన మొత్తం దేశీయ ప్రయాణికుల వాహనాల అమ్మకాల్లో ఎస్‌యూవీలు, ఎంపీవీలతో సహా ప్రెసియర్ మరియు మార్జిన్-బూస్టింగ్ యుటిలిటీ వాహనాల సహకారం గత ఆర్థిక సంవత్సరం సంబంధిత త్రైమాసికంలో నమోదైన 24 శాతం నుంచి గత త్రైమాసికంలో దాదాపు 39 శాతానికి పెరిగింది. అదే సమయంలో ఆల్టో, ఇగ్నిస్తో సహా చిన్న కార్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..