Gold Price Today: మరోసారి షాకిచ్చిన బంగారం.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today: ప్రపంచ వ్యాప్తంగా పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. పండుగలు, వివాహాది శుభకార్యాలు, పలు ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, అంతర్జాతీయ పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ధరలు తగ్గితే.. మరి కొన్నిసార్లు పెరుగుతుంటాయి.

Gold Price Today: మరోసారి షాకిచ్చిన బంగారం.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Price Today
Follow us
Venkata Chari

|

Updated on: Feb 03, 2024 | 7:09 AM

Gold and Silver Latest Prices: ప్రపంచ వ్యాప్తంగా పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. పండుగలు, వివాహాది శుభకార్యాలు, పలు ప్రత్యేక సందర్భాల్లో బంగారం, వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, అంతర్జాతీయ పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ధరలు తగ్గితే.. మరి కొన్నిసార్లు పెరుగుతుంటాయి. తాజాగా ఫిబ్రవరి 3న శనివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.15లు పెరిగి రూ.5,830ల వద్ద ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.16లు పెరిగి రూ.6,360ల వద్ద కొనసాగుతోంది.

ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150లు పెరిగి, రూ.58,300లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.160లు పెరిగి రూ.63,600ల వద్ద కొనసాగుతోంది. అలాగే, 18 క్యారెట్ల గోల్డ్‌ గ్రాముకు రూ.13లు పెరిగి రూ.4,770 వద్ద ఉండగా.. 10 గ్రాములు ధర రూ. 120లు పెరిగి రూ.47,700లుగా నిలిచింది.

నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా..

18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700

22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.58,300

24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.63,600

విజయవాడలో బంగారం ధరలు ఇలా..

18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700

22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.58,300

24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.63,600

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,450లు ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.63,750 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,300లు ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,600లు, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.58,900లు, 24 క్యారెట్ల ధర రూ.64,250లు ఉంది. అలాగే, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,300లు ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,600లు ఉంది. కోల్‌కతా, ముంబై, కేరళ, పూణెలలో కూడా ఇవే ధరలు ఉన్నాయి.

ఇక వెండి ధరల విషయాని కొస్తే.. వెండి కిలో రూ. 200ల మేర పెరిగి.. రూ.76,500లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.78,000లు, విశాఖపట్నంలో రూ.78,000లు, చెన్నైలో రూ.78,000ల వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో రూ.73,500, ముంబైలో76,500లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..