Business Idea: వచ్చే సమ్మర్‌ని సరిగ్గా వాడుకుంటే.. భారీగా సంపాదించొచ్చు..
వచ్చేది వేసవి కాలం. మరో నెల రోజుల్లో ఎండ కాలం ప్రారంభం కానుంది. ఈసారి ఎండలు దంచికొట్టనున్నయాని ఇప్పటికే వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ సీజన్‌ను సరిగ్గా క్యాష్ చేసుకోవాలే కానీ మంచి లాభాలు ఆర్జించవచ్చు. సమ్మర్‌లో బెస్ట్ బిజినెస్‌లో ఐస్‌క్రీమ్ పార్లర్ ఒకటి...
వ్యాపారం అనగానే చాలా మంది సంకోచించేది లాభాలు వస్తాయో లేదో అని. కానీ సరైన ప్రణాళిక, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యాపారం చేస్తే నష్టాలు అనే మాటే ఉండదు. మరీ ముఖ్యంగా సీజనల్ వ్యాపారాలు ప్రారంభిస్తే నష్టాలు తక్కువగా ఉంటాయి. అలాంటి ఓ సీజనల్ వ్యాపారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వచ్చేది వేసవి కాలం. మరో నెల రోజుల్లో ఎండ కాలం ప్రారంభం కానుంది. ఈసారి ఎండలు దంచికొట్టనున్నయాని ఇప్పటికే వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ సీజన్‌ను సరిగ్గా క్యాష్ చేసుకోవాలే కానీ మంచి లాభాలు ఆర్జించవచ్చు. సమ్మర్‌లో బెస్ట్ బిజినెస్‌లో ఐస్‌క్రీమ్ పార్లర్ ఒకటి. సమ్మర్‌లో ఐస్‌క్రీమ్ పార్లర్ వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టాలు తక్కువగా ఉంటాయి. ఇంతకీ ఐస్‌క్రీమ్ పార్లర్‌ను ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది.? లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐస్‌క్రీమ్ పార్లర్లను ఆయా సంస్థలకు చెందిన ఫ్రాంచైజీలను తీసుకోవచ్చు. ఉదాహరణకు అమూల్, జర్సీ వంటి ఫ్రాంచైజ్‌లను తీసుకోవచ్చు. వీటితో పాటు పాల ఫ్రాంచైజీలను కూడా పొందొచ్చు. ఇందుకోసం ఆయా సంస్థలు నిర్ధేశించిన ధరను చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సంస్థలు ఫ్రాంచైజీల్లో భాగంగానే ఫ్రిడ్జిలు సైతం అందిస్తాయి. అలాకాకుండా మీరు సొంతంగా కూడా ఐస్‌క్రీమ్ పార్లర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.
ఇందులో అన్ని రకాల బ్రాండ్స్‌కు చెందిన ఐస్‌క్రీమ్‌లను అమ్ముకోవచ్చు. ఇక ఐస్‌క్రీమ్ పార్లర్‌ను ఏర్పాటు చేయడానికి 300-400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఒక గది కావాల్సి ఉంటుంది. కనీసం 5 నుంచి 10 మంది కూర్చునేలా గది ఉండాలి. ఐస్‌క్రీమ్ పార్లర్ వ్యాపారం ప్రారంభించాలంటే.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక లాభాల విషయానికొస్తే ఐస్‌క్రీమ్ పార్లర్ ద్వారా తక్కువలో తక్కువ నెలకు రూ. 30 వేల వరకు ఆదాయం పొందొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..