Budget 2024: గ్రామీణ ప్రాంతాలపై కేంద్రం ఫోకస్.. గృహ నిర్మాణదారులకు బడ్జెట్‌లో కీలక నిర్ణయం
కోట్లాది ఇళ్ల నిర్మాణం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు బాగా బలం చేకూరుతుంది. అందుకే కేంద్రం.. చాలా ఆలోచనతో ఈ ప్రకటన చేసింది. పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం వల్ల పల్లెల వైపు ప్రజలను ఆకర్షించవచ్చు. వలస పోయినవారిని వెనక్కు రప్పించడానికి, ఆ ప్రాంతాల్లో వారికి చేతి నిండా పని ఉండేట్లు చేయడానికి ఇది ఉపకరిస్తుంది. ఒక్క దెబ్బకు ఎకానమీకి బూస్ట్ ఇవ్వడంతో పాటు..
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రానున్న ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల కొత్త ఇళ్లు నిర్మిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ చెప్పారు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, సిమెంట్, స్టీల్ తో పాటు మరింతగా నిర్మాణ సామగ్రికి డిమాండ్‌ను పెంచుతుంది. దీనివల్ల ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుంది. అంటే ఆ మేరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. అంటే ఈ కోట్లాది ఇళ్ల నిర్మాణం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు బాగా బలం చేకూరుతుంది. అందుకే కేంద్రం.. చాలా ఆలోచనతో ఈ ప్రకటన చేసింది.
పైగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం వల్ల పల్లెల వైపు ప్రజలను ఆకర్షించవచ్చు. వలస పోయినవారిని వెనక్కు రప్పించడానికి, ఆ ప్రాంతాల్లో వారికి చేతి నిండా పని ఉండేట్లు చేయడానికి ఇది ఉపకరిస్తుంది. ఒక్క దెబ్బకు ఎకానమీకి బూస్ట్ ఇవ్వడంతో పాటు సొంతింటి కలను సాకారం చేయవచ్చు. అదే సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచవచ్చు. ఇదంతా ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికి దోహదపడుతుంది. మరిన్ని పూర్తి వివరాలు కావాలంటే ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.