Budget 2024: నిర్మలమ్మ కీలక ప్రకటన.. గర్భాశయ క్యాన్సర్‌ను నిరోధించేందుకు వ్యాక్సిన్
దేశంలో మరిన్ని వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రణాళికను కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. దేశంలో మరిన్ని మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి బాలికలకు టీకాలు వేయడాన్ని ప్రోత్సాహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం,
దేశంలోని ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ (HPV )ని చేర్చాలనే ఉద్దేశాన్ని ప్రభుత్వం ప్రకటించడంతో గర్భాశయ క్యాన్సర్‌ను నిరోధించే టీకాలు చౌకగా మారే అవకాశం ఉంది. క్యాన్సర్ వ్యాక్సినేషన్, కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించడం, ఆశా, అంగన్‌వాడీ వర్కర్లకు ఆయుష్మాన్ భారత్ కవర్‌ను విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు టీకాలు వేయడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం, ఈ వ్యాక్సిన్ ప్రైవేట్ ఆసుపత్రులలో మాత్రమే అందుబాటులో ఉంది. ఒక్కో మోతాదుకు రూ.4,000 వరకు ఖర్చవుతుంది.
దేశంలో మరిన్ని వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రణాళికను కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. దేశంలో మరిన్ని మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి బాలికలకు టీకాలు వేయడాన్ని ప్రోత్సాహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ క్యాన్సర్‌పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మాతా శిశు సంరక్షణ కోసం వివిధ పథకాలను అమలు చేయడంలో సినర్జీ కోసం ఒక సమగ్ర కార్యక్రమం కిందకు తీసుకురానున్నట్లు ఆమె తెలిపారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. మెరుగైన పోషకాహార పంపిణీ, బాల్య సంరక్షణ, అభివృద్ధి కోసం వేగవంతం చేస్తామని ఆమె చెప్పారు.
ఇదిలా ఉండగా, తాజాగా గర్భశయ క్యాన్సర్ కారణంగా బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే (32) కన్నుమూశారు. నిన్న మొన్నటి వరకు యాక్టివ్ గా ఉన్న పూనమ్ ఇప్పుడు సడన్ గా చనిపోవడం ఏంటా అని అంతా షాక్ కు గురవుతున్నారు. పూనమ్‌ను గర్భాశయ క్యాన్సర్‌తో మరణించారని సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి