PM Svanidhi Yojana: ప్రధానమంత్రి స్వనిధి యోజన పథకం.. వారందరికీ ఎటువంటి హామీ లేకుండా రుణాలు!

PM స్వానిధి యోజన కోసం ఏదైనా ప్రభుత్వ బ్యాంకు నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం, మీకు పథకం ఫారమ్ ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు అవసరమైన పత్రాలను ఇవ్వాలి. ఆధార్ కార్డ్, ఖాతా నంబర్ వివరాలు, ఇతర సమాచారాన్ని అందించిన తర్వాత మీకు రుణం మంజూరు చేయడం జరుగుతుంది.

PM Svanidhi Yojana: ప్రధానమంత్రి స్వనిధి యోజన పథకం.. వారందరికీ ఎటువంటి హామీ లేకుండా రుణాలు!
Pm Svanidhi Yojana
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 02, 2024 | 4:57 PM

సామాన్య ప్రజల కోసం, ముఖ్యంగా పేద వర్గాలకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది. దీని ద్వారా వారి అన్ని అవసరాలకు ఆర్థిక సహాయం అందించడం జరగుతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఇటువంటి అనేక పథకాలను ప్రస్తావించారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఎంత మందికి సహాయం చేసిందో చెప్పారు. ఈ సందర్భంగా, వీధి వ్యాపారులకు సహాయం అందించే ప్రధానమంత్రి స్వానిధి పథకం గురించి కూడా వివరించారు. లక్షలాది మంది వీధి వ్యాపారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా అనేక మంది పథకం కింద ప్రయోజనాలు పొందారు.

ప్రధాన మంత్రి స్వానిధి యోజన అంటే ఏమిటి?

ప్రధానమంత్రి స్వానిధి యోజనను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించింది దీని లక్ష్యం రోడ్ల పక్కన, వీధుల వెంబడి తమ దుకాణాలను ఏర్పాటు చేసుకునే వారికి సహాయం అందించడం ఇది ముఖ్య ఉద్దేశ్యం. వీధి వ్యాపారులకు ప్రధానమంత్రి స్వానిధి యోజన కింద రూ.50 వేల వరకు రుణాలు అందజేస్తారు. ఈ రుణం కోసం ఎలాంటి గ్యారంటీ అడగరు. అంటే వీధి వ్యాపారులు ఏమీ తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ పథకం కింద మూడు దశల్లో రుణం ఇవ్వడం జరుగుతుంది. మొదటి దశలో రూ.10,000 ఇస్తారు. దీన్ని 12 నెలల్లో తిరిగి చెల్లించాలి. మీరు ఈ రుణాన్ని తిరిగి చెల్లిస్తే, మీకు రెట్టింపు రుణం అంటే రూ. 20 వేలు మంజూరు చేస్తారు. దీని తర్వాత మూడోసారి రూ.50 వేల వరకు రుణం తీసుకోవచ్చు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

PM స్వానిధి యోజన కోసం ఏదైనా ప్రభుత్వ బ్యాంకు నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం, మీకు పథకం ఫారమ్ ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు అవసరమైన పత్రాలను ఇవ్వాలి. ఆధార్ కార్డ్, ఖాతా నంబర్ వివరాలు, ఇతర సమాచారాన్ని అందించిన తర్వాత మీకు రుణం మంజూరు చేయడం జరుగుతుంది. మీరు ఏ వ్యాపారం కోసం రుణం తీసుకుంటున్నారో స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రధానమంత్రి స్వానిధి పథకాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పటివరకు 78 లక్షల మంది వీధి వ్యాపారులకు ఈ పథకం కింద రుణాలు ఇచ్చామని చెప్పారు. దాదాపు రెండు లక్షల ముప్పై వేల మంది విక్రేతలు ఈ రుణాన్ని మూడోసారి తీసుకున్నారని ఆమె వెల్లడించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…