Flipkart: ఇలా ఆర్డర్ చేస్తే.. అలా వచ్చేస్తుంది.. నిమిషాల్లోనే ఫ్లిప్‌కార్ట్ డెలివరీ..
ఇక్కడ ఒక కండీషన్ ఉంది. అదే రోజు డెలివరీ ఫీచర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకునే వినియోగదారులు తమ ఆర్డర్‌ను మధ్యాహ్నం 1 గంటలోపు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే ఆ వస్తువులు అర్ధరాత్రి 12 గంటలలోపు వారి చిరునామాకు డెలివరీ అవుతాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఆర్డర్ చేసిన వినియోగదారులు మరుసటి రోజు తమ ఆర్డర్‌లు డెలివరీ పొందే అవకాశం ఉంది.
ఆన్ లైన్ మార్కెట్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఇటీవల కాలంలో అందరూ వీటిపైనే ఆధారపడుతున్నారు. ఎందుకంటే అధిక ఆఫర్లు ఉండటంతో అందరూ వీటి వైపు చూస్తున్నారు. ఈ విభాగంలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లీడర్లుగా నిలుస్తున్నాయి. ఈ రెండు ప్లాట్ ఫారంలు పోటాపోటీగా ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఈ క్రమంలో ఫ్లిప్ కార్ట్ ఓ కొత్త డెలివరీ ఫీచర్ ను తీసుకొస్తోంది. అదేంటంటే బుక్ చేసిన రోజే డెలివరీ. రానున్న రోజుల్లో ఇది అందుబాటులోకి రానుంది. అయితే దీనిని తొలి దశలో దేశంలోని 20 నగరాల్లో ప్రారంభించనుంది. వస్తువు బుక్ చేసిన రోజే డెలివరీని అందించనుంది. ఆ తర్వాత కొన్ని నెలల కాలంలో అన్ని నగరాలకు సేవలను విస్తరించాలని యోచిస్తోంది. ఇది ఎప్పుడు ప్రారంభమవుతుందనే తేదీపై క్లారిటీ లేదు. అన్నీ కుదిరితే ఈ ఫిబ్రవరిలోనే దీనిని అమలు చేసే అవకాశం ఉంది.
ఈ నగరాల్లో మొదటిగా..
ఈ-కామర్స్ దిగ్గజం అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, కోయంబత్తూర్, చెన్నై, ఢిల్లీ, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కోల్‌కతా, లక్నో, లూథియానా, ముంబై, నాగ్‌పూర్, పూణే, పాట్నా, రాయ్‌పూర్, సిలిగురి, విజయవాడ వంటి 20 భారతీయ నగరాలు వస్తువు బుక్ చేసిన అదే రోజు డెలివరీని పొందుతాయి. .
ఈ వస్తువులు మాత్రమే డెలివరీ..
అదే రోజు డెలివరీ కోసం అందుబాటులో ఉన్న కేటగిరీలలో మొబైల్‌లు, ఫ్యాషన్, అందం, జీవనశైలి, పుస్తకాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి.
కండిషన్స్ అప్లై..
అయితే ఇక్కడ ఒక కండీషన్ ఉంది. అదే రోజు డెలివరీ ఫీచర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకునే వినియోగదారులు తమ ఆర్డర్‌ను మధ్యాహ్నం 1 గంటలోపు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే ఆ వస్తువులు అర్ధరాత్రి 12 గంటలలోపు వారి చిరునామాకు డెలివరీ అవుతాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఆర్డర్ చేసిన వినియోగదారులు మరుసటి రోజు తమ ఆర్డర్‌లు డెలివరీ పొందే అవకాశం ఉంది.
ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ బద్రీ కొత్త అదే రోజు డెలివరీ ఫీచర్ గురించి మాట్లాడుతూ తాము తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్ తో దేశవ్యాప్తంగా మిలియన్ల మంది కస్టమర్‌లు లక్షలాది ఉత్పత్తులను ఆర్డర్ చేసిన రోజే డెలివరీ పొందుతారన్నారు. కేవలం మెట్రో నగరాలకే కాకుండా మెట్రోయేతర నగరాలకు చెందిన కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేయడానికి ఇష్టపడతారని భావించి, తాము 20 నగరాలకు అదే రోజు డెలివరీని అందించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే నెలల్లో ఇతర నగరాల్లో, మరిన్ని వస్తువులను తీసుకొస్తామని వివరించారు.
ఆసక్తికరంగా, దేశంలోని ఫ్లిప్‌కార్ట్ కు ప్రధాన పోటీదారు అమెజాన్ కూడా ఈ తరహా ఫీచర్ ను ఇప్పటికే అమలు చేస్తోంది. ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్న వారికి అదే-రోజు, ఒక-రోజు, రెండు-రోజుల డెలివరీ ఆప్షన్లను అందిస్తోంది. అలాగే నాన్-ప్రైమ్ యూజర్లకు ఎక్స్‌ప్రెస్ డెలివరీ కోసం రూ. 175 వరకు చార్జ్ చేస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..