Realme X7 Pro 5G Launched: రియల్‌మీ నుంచి 5జీ స్మార్ట్‌ ఫోన్లు విడుదల.. అద్భుతమైన ఫీచర్లు..!

Realme X7 Pro 5G Launched: ప్రస్తుతం మొబైల్‌ ఫోన్‌లు అధికంగా వాడుతున్న నేపథ్యంలో మార్కెట్లోకి కొత్త కొత్త మోడల్‌లలో ఫోన్‌లు విడుదలవుతున్నాయి. మొబైల్‌ ఫోన్‌..

Realme X7 Pro 5G Launched: రియల్‌మీ నుంచి 5జీ స్మార్ట్‌ ఫోన్లు విడుదల.. అద్భుతమైన ఫీచర్లు..!
Follow us

|

Updated on: Feb 04, 2021 | 8:00 PM

Realme X7 Pro 5G Launched: ప్రస్తుతం మొబైల్‌ ఫోన్‌లు అధికంగా వాడుతున్న నేపథ్యంలో మార్కెట్లోకి కొత్త కొత్త మోడల్‌లలో ఫోన్‌లు విడుదలవుతున్నాయి. మొబైల్‌ ఫోన్‌ లేనిదే రోజు గడవని పరిస్థితిలా మారిపోయింది ప్రస్తుతం రోజుల్లో. దీంతో ఆయా మొబైల్‌ కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లతో మొబైల్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.

ఈ సంవత్సరంలో ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌ మీx7 సిరీస్‌లో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. రియల్‌ మీ ఎక్స్‌ 7ప్రో, రియల్‌మీ ఎక్స్‌ 7 స్మార్ట్‌ ఫక్షన్‌లను భారత్‌లో లాంచ్‌ చేసింది. యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా వీటిని ఆవిష్కరించింది. ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ వెబ్‌ సైట్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

ఎక్స్‌ 7 5జీ సిరీస్‌ ఫోన్లలో సెల్ఫీ కెమెరా పంచ్‌ హూల్‌ డిస్‌ప్లే డిజైన్‌తో అందుబాటులో వస్తున్నాయి. భారత్‌లో రియల్‌మీ 5జీ మిడ్‌ రేంజ్‌ ఫోన్ల ప్రారంభ ధర రూ.19,999 నుంచి ప్రారంభం అవుతుంది. రియల్‌ మీ ఎక్స్‌ 7ప్రో ప్రారంభం ధర రూ.29,999గా నిర్ణయించారు.

రియల్‌మీ X7 5G స్పెసిఫికేషన్లు:

ఓఎస్‌ – ఆండ్రాయిడ్‌ 10 డిస్‌ప్లే – 6.40 అంగుళాలు ప్రాసెసర్‌ – మీడియాటెక్‌ డైమెన్సిటీ 800 యూ కెమెరా ఫ్రంట్‌ – 16 మెగా పిక్సెల్‌ రియల్‌ కెమెరా – 64+8+2 మెగా పిక్సెల్‌ ర్యామ్‌ – 6జీబీ స్టోరేజీ – 128 జీబీ బ్యాటరీ – 4310 ఎంఏహెచ్‌