ఇందిరాగాంధీ హయాంలో ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేస్తే.. ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేటీకరణ

ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా మోదీ సర్కార్‌ అడుగులు వేస్తోంది. ప్రపంచ స్థాయి బ్యాంకుల ఏర్పాటు లక్ష్యంతో ఇప్పటికే బ్యాంకుల విలీనాలకు తెరతీసిన కేంద్రం..

ఇందిరాగాంధీ హయాంలో ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేస్తే.. ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేటీకరణ
Follow us
Subhash Goud

|

Updated on: Feb 04, 2021 | 7:36 PM

ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా మోదీ సర్కార్‌ అడుగులు వేస్తోంది. ప్రపంచ స్థాయి బ్యాంకుల ఏర్పాటు లక్ష్యంతో ఇప్పటికే బ్యాంకుల విలీనాలకు తెరతీసిన కేంద్రం.. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరణలో భాగంగా ప్రైవేటీకరణకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ)లను ప్రైవేటీకరించవచ్చని సమాచారం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 2021-22గానూ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ఓ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో వాటాలను విక్రయించనున్నామని చెప్పారు. ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వ ఆటాల అమ్మకం ప్రక్రియ కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం పూర్తవుతుందన్నారు. అయితే ప్రైవేటీకరణకు రానున్న ఆ రెండు బ్యాంకుల పేర్లను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించకపోయినా.. అవి పీఎన్‌బీ, బీవోబీలేనన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

అయితే బడ్జెట్‌ ప్రకటన తర్వాత చీఫ్‌ ఎకనామిక్‌, అడ్వైజర్‌ కెవి సుబ్రమణ్యం ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని స్వాగతించారు. ఇది ప్రారంభం మాత్రమే అని, రాబోయే రోజుల్లో దేశంలో కేవలం నాలుగు నుంచి తక్కువ ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే ఉంటాయని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. భవిష్యత్తులో బ్యాకింగ్‌ వూహాత్మక రంగంలో చేరనుందని, దేశంలో కేవలం నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే ఉంటాయని అన్నారు. ప్రస్తుతం దేశంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులున్నాయని, రెండు బ్యాంకులు ప్రైవేటీకరణ ప్రకటించడం జరిగిందన్నారు. ప్రస్తుతం పది బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకులున్నాయన్నారు. ఇక గత చరిత్రను పరిశీలిస్తే.. 1969 జూలై 19 దేశంలో అప్పటి ఆర్థిక మంత్రి ఇందిరాగాంధీ 14 పెద్ద ప్రైవేట్‌ బ్యాంకులను జాతీయ చేశారు.

2017 నాటికి 27 ప్రభుత్వ బ్యాంకులున్నాయి

నరేంద్రమోదీ 2014లో తొలిసారిగా దేశ ప్రధానిగా నియమితులయ్యారు. ఇప్పుడు రెండో సారిగా ప్రధానిగా కొనసాగుతున్న తరుణంలో బ్యాంకులను ప్రైవేటీకరించే దిశగా ముందుకు కదులుతున్నారు. 2017లో దేశంలో మొత్తం 27ప ప్రభుత్వ రంగ బ్యాంకులున్నాయి. 2017లో తొలిసారిగా ఐదు అసోసియేట్‌ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనం అయ్యాయి. ఇవే కాకుండా విజయ బ్యాంకు, దేనా బ్యాంక్‌లను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనం చేశారు. ఈ నిర్ణయం 2017లో మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అప్పుడు 10 బ్యాంకుల విలీనాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీని కింద ఆరు బ్యాంకుల ఉనికిని నాలుగు బ్యాంకులు విలీనం చేశారు. ఆ తర్వాత 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశంలో ఉన్నాయి. గత ఏడాది ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో విలీనం అయ్యాయి. సిండికేట్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌లో విలీనం అయింది. అలాగే అలహాబాద్‌ బ్యాంక్‌ను ఇండియా బ్యాంక్‌లో విలీనం చేశారు. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రా బ్యాంక్‌ కార్పొరేషన్‌ బ్యాంకులో విలీనం అయ్యాయి.

జాతీయం వల్ల ప్రయోజనం ఏమిటీ..?

1969కి ముందు, దేశం పేద దేశంగా ఉండేది. ప్రైవేటు బ్యాంకులు కార్పొరేట్లకు రుణాలు ఇస్తాయని ఫిర్యాదులు వచ్చాయి. కానీ అవి వ్యవసాయానికి రుణాలు అందించవు. అలాగే బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక ప్రకారం.. 1951 వరకు బ్యాంకింగ్‌ రుణాలలో వ్యవసాయం వాటా కేవలం 2 శాతం మాత్రమే. ఇది 1967 వరకు ఉంది. అదే సమయంలో కార్పొరేట్‌ రుణాల వాటా 34 శాతం నుంచి 64.4 శాతానికి పెరిగింది. అటువంటి పరిస్థితుల్లో జాతీయం చేయాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు వ్యవసాయానికి రుణాలు పెరిగాయి. అయితే ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరణ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య 4కు పరిస్థితులు ఎలా ఉంటాయనేదానిపై చర్చ కొనసాగుతోంది.

Also Read: Old Vehicle: మీ వద్ద పాత కారు కానీ, పాత బైక్‌ కానీ ఉందా..? తుక్కు విధానం అమల్లోకి వస్తే మీ జేబుకు చిల్లే..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!