AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: బ్యాంక్ అకౌంట్‌ను ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కు మార్చుకోవచ్చు… ఆర్బీఐ కొత్త రూల్స్

సిమ్ నెంబర్ తరహాలోనే మీరు మీ బ్యాంక్ అకౌంట్‌ను ఒక బ్యాంక్ నుంచి మరోక బ్యాంక్‌కు మార్చుకోవచ్చు. బ్యాంకుల మధ్య స్విచ్చింగ్ ఆప్షన్ తెచ్చేందుకు ఆర్బీఐ కసరత్తు చేస్తోంది. భవిష్యత్తులో దీనిని మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వ్యవస్థపై ఆర్బీఐ పనిచేస్తోంది.

RBI: బ్యాంక్ అకౌంట్‌ను ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కు మార్చుకోవచ్చు... ఆర్బీఐ కొత్త రూల్స్
Bank Accounts
Venkatrao Lella
|

Updated on: Mar 30, 2026 | 10:00 PM

Share

బ్యాంకుల కస్టమర్లకు ఉపయోపగడేలా ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ సేవలను సులభతరం చేయడంలో భాగంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంకుకు మారడాన్ని సులభతరం చేయనుంది. ఒక బ్యాంక్ అకౌంట్‌కు శాలరీ, ఈఎంఐలు, బీమా చెల్లింపులు లింక్ అయిన తర్వాత మరో బ్యాంక్‌కు మారడం కష్టమవుతుంది. దీంతో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ పేమెంట్స్ స్విచింగ్ స్వీస్ అనే కొత్త ఫ్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది. ఇది ఒక సెంట్రలైజ్డ్ కేంద్రంగా పనిచేస్తుంది. వినియోగదారులు తమ చెల్లింపులను ఒకేచోట చేసుకోవడానికి, నిర్వహించుకోవడానికి, బ్యాంకుల మధ్య సులువుగా మార్చుకోవడాకికి వీలు కల్పిస్తుంది.

బ్యాంక్ అకౌంట్‌ను వేరే బ్యాంక్‌కు..

మీరు మీ బ్యాంక్ అకౌంట్‌ను వేరే బ్యాంక్‌కు మార్చుకోవచ్చు. అంటే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ సేమ్ ఉంటుంది. బ్యాంక్ మాత్రమే మారుతుంది. మీరు మీ బ్యాంక్ అకౌంట్‌ను ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కు మార్చుకోవచ్చన్నమాట. మీ ఫోన్ నెంబర్‌ను ఒక నెట్ వర్క్ నుంచి మరో నెట్ వర్క్‌కు పోర్టబుల్ పెట్టుకున్నట్లుగానే.. మీ బ్యాంక్ అకౌంట్‌ను ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. కస్టమర్ల ఆర్దిక లావాదేవీలకు అంతరాయం కలగకుండా సులభతరంగా సేవలు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది.

విదేశీ చెల్లింపుల్లో వేగం

రిజర్వ్ బ్యాంక్ పేమెంట్స్ విజన్ 2028 అనే కొత్త రోడ్ మ్యాప్‌ను విడుదల చేసింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ నగదు బదిలీలను కూడా లక్ష్యంగా పెట్టుకుంది. విదేశీ చెల్లింపుల్లో నియంత్రణ, సాంకేతిక అడ్డంకులను తొలగించేందుకు ప్రస్తుత వ్యవస్థను ఆర్బీఐ సమీక్షిస్తోంది. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా చెల్లింపు వ్యవస్థను తీర్చిదిద్దనుంది. వ్యాపారులు, ఎన్నారైలకు ఉపయోగపడేలా విదేశీ లావాదేవీల్లో పారదర్శకత తీసుకురావడం, జాప్యాన్ని తగ్గించడం లాంటివి చేయనుంది.

Follow Us