Rajanikanth: థింక్ డిఫరెంట్ అంటున్న రజనీకాంత్
జైలర్ విజయంతో రజనీకాంత్ కెరీర్‌లో కొత్త జోష్ వచ్చింది. అయితే ఈ విజయం తలైవాపై బాధ్యతను మరింత పెంచింది. అందుకే ఆయన కథలు, లుక్స్ ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. జైలర్ 2 కోసం భారీ సన్నాహాలు జరుగుతుండగా, సిబి చక్రవర్తి దర్శకత్వంలో రాబోయే సినిమాకు ఏకంగా 83 రకాల లుక్స్ డిజైన్ చేయించడం రజనీకాంత్ అంకితభావాన్ని చాటుతోంది. అభిమానుల అంచనాలకు మించి ఉండేలా ప్రతి అడుగు వేస్తున్నారు.
సక్సెస్ ఇచ్చే జోష్ తో కెరీర్ కంటిన్యూ అవుతుందని అందరూ అనుకుంటారు. కానీ అంతకు మించిన బాధ్యతను తెచ్చిపెడుతుంది సక్సెస్. ఆ బాధ్యతతో ప్రతి విషయాన్ని ఒకటికి పది సార్లు చెక్ చేసుకోవాలనే సెన్స్ క్రియేట్ అవుతుంది. దాంతో ప్రతి విషయంలోనూ ఆచీతూచీ అడుగులు పడటం ఖాయం. ఇప్పుడు రజనీకాంత్ సినిమాల విషయంలో కెప్టెన్లు ఈ విషయాన్నే ఫాలో అవుతున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు కెరీర్ మీద స్పెషల్ గా కాన్‌సెన్‌ట్రేట్ చేస్తున్నారు. ఎలాంటి సినిమాలు చేయాలి? ఎలాంటి కథలు సెలక్ట్ చేసుకోవాలి? లుక్ విషయంలో ఏ తరహా జాగ్రత్తలు తీసుకోవాలి… అనే విషయాల మీద ఎక్కువగా ఎక్సర్‌సైజ్ చేస్తున్నారు. జైలర్‌తో తలైవర్ కెరీర్‌లో మాంఛి ఊపు వచ్చింది. ఆయన ఏజ్‌కి తగ్గ రోల్ రాసి మెప్పించేశారు కెప్టెన్. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ జరుగుతోంది. ఫస్ట్ పార్టును మించిన క్రేజ్‌తో సెకండ్ పార్టును సిద్ధం చేస్తున్నారు. ప్యాన్ ఇండియా రేంజ్‌లో పలువురు ప్రముఖులు ఇందులో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నారు. జైలర్2 ప్రీ రిలీజ్ బిజినెస్, ఓపెనింగ్స్, కలెక్షన్స్.. అన్నీ మరో రేంజ్‌లో ఉండటం ఖాయమనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది మేకర్స్ లో. ఈ కాన్ఫిడెన్స్ చూసి నెక్స్ట్ సూపర్‌స్టార్‌తో సినిమాలు చేసే కెప్టెన్లలో అలర్ట్ నెస్ పెరుగుతోంది. తలైవర్ ఫ్యాన్స్ అంతకు మించి కోరుకుంటారనే ఆలోచన వాళ్లను నిలవనివ్వడం లేదు. ‘డాన్’ ఫేమ్ సిబి చక్రవర్తి దర్శకత్వంలో త్వరలోనే రజినీకాంత్ ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు సిబి చక్రవర్తి ఇందులో రజనీకాంత్ మేకోవర్ కోసం చాలా కష్టపడుతున్నారు. ఏకంగా 83 రకాల లుక్స్‌ను డిజైన్ చేయించడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వీటిలో అత్యుత్తమమైన మూడు లుక్స్‌ను ఫైనల్ చేసి రజనీకి ప్రజెంట్ చేయగా.. అందులో ఒక దానిని తలైవా ఖరారు చేయాల్సి ఉంది. దీన్ని బట్టి తలైవర్ కెరీర్ మీద ఎంత ఫోకస్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చంటోంది కోలీవుడ్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి
తండ్రికి ప్రేమగా మిల్క్ షేక్ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..
ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!
చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్ ప్రియురాలు
ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి
తండ్రికి ప్రేమగా మిల్క్ షేక్ అందించిన కుమార్తె..ఆ తర్వాత..
ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!
బంపర్ ఆఫర్.. నెలరోజులు అక్కడ బిర్యానీ ఫ్రీ..!
రోడ్డుపై మెరుస్తూ కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా
పాడేరులో అద్భుతం 'మినీ కాశ్మీర్'గా మారిన అరకు లోయ
సాగర తీరంలో అద్భుతం.. మూడు కాళ్లపై నిలబడే వింత చేప

