Sanjay Dutt: సంజూబాబా ఖాతాలో రేర్ రికార్డు
అనారోగ్యం తర్వాత సంజయ్ దత్ అద్భుతమైన పునరాగమనం చేశారు. కేజీయఫ్2, జవాన్, ధురంధర్ వంటి నాలుగు వెయ్యి కోట్ల సినిమాలతో బాలీవుడ్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఈ ఘనత సాధించిన ఏకైక నటుడిగా ఆయన పేరు నిలిచింది. వంద, ఐదు వందల కోట్ల మార్కులను దాటి, వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాలతో సంజూబాబా తన సత్తా చాటారు.
ఇప్పుడు ఇండస్ట్రీలో వెయ్యి కోట్ల సినిమా అనేది ఓ ప్రైడ్ పాయింట్. ఏ హీరో వంద కోట్ల మార్క్ టచ్ చేశాడనేదంతా గత చరిత్ర. సిల్వర్ జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీల కాలం అయిపోయినట్టు, వంద , ఐదు వందల కోట్ల మార్కుల్ని కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పుడంతా ఒకటే మాట.. ఏ హీరో ఖాతాలో ఎన్ని వెయ్యి కోట్ల సినిమాలున్నాయన్నదే. ఈ టైమ్‌లో మరి నన్ను చూడండి.. నా ఖాతాలో ఎన్ని వెయ్యి కోట్ల సినిమాలు ఉన్నాయో అని అంటున్నారు మిస్టర్ బాబా… ఇంతకీ ఎవరా బాబా? సంజూబాబా ఇప్పుడు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. అనారోగ్యం పాలయ్యారు.. కెరీర్‌కి ఫుల్ స్టాప్ పెట్టేయాల్సి వస్తుందేమోనని అందరూ కంగారు పడ్డ టైమ్‌లో బేఫికర్ అంటూ కమ్‌బ్యాక్ ఇచ్చారు సంజయ్ దత్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు సంజయ్ దత్. బాలీవుడ్, సౌత్ అనే తేడాలు లేకుండా సినిమాలు చేస్తున్న సంజు బాబా ఇప్పుడు రేర్ రికార్డు సెట్ చేశారు. ఆయన కెరీర్‌లో ఏకంగా నాలుగు వెయ్యి కోట్ల సినిమాలున్నాయి. ఈ అరుదైన రికార్డున్న ఏకైక బాలీవుడ్ స్టార్‌గా ఆయన పేరు మీద రికార్డు క్రియేట్ అయింది. సౌత్‌లో కేజీయఫ్2లో సంజయ్ దత్‌ని చూసి వావ్.. అనని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. అంతగా మెప్పించింది ఆయన రోల్. మరో వెయ్యి కోట్ల సినిమా జవాన్‌లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఇటు ధురంధర్‌లో అయితే హవా హవా అంటూ దుమ్ము రేపారు. ఇప్పుడు ధురంధర్2లోనూ ఆయన రోల్‌కి ఫిదా అవుతున్నారు జనాలు. సో.. ఇలా ఏకంగా నాలుగు వెయ్యి కోట్ల సినిమాలున్న స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. వెయ్యి కోట్ల సినిమాలున్న హీరోల సంగతి సరే, ఇలా కేరక్టర్లు చేస్తూ ఈ రికార్డు చేయడం డిఫరెంట్ అంటూ మెచ్చుకుంటున్నారు క్రిటిక్స్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి
తండ్రికి ప్రేమగా మిల్క్ షేక్ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..
ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!
చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్ ప్రియురాలు
ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి
తండ్రికి ప్రేమగా మిల్క్ షేక్ అందించిన కుమార్తె..ఆ తర్వాత..
ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!
బంపర్ ఆఫర్.. నెలరోజులు అక్కడ బిర్యానీ ఫ్రీ..!
రోడ్డుపై మెరుస్తూ కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా
పాడేరులో అద్భుతం 'మినీ కాశ్మీర్'గా మారిన అరకు లోయ
సాగర తీరంలో అద్భుతం.. మూడు కాళ్లపై నిలబడే వింత చేప

