AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైరల్‌ అవుతున్న హీరోయిన్ల పెళ్లి వార్తలు

వైరల్‌ అవుతున్న హీరోయిన్ల పెళ్లి వార్తలు

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Mar 30, 2026 | 9:49 PM

Share

సెలబ్రిటీల పెళ్లి పుకార్లు త్వరగా వైరల్ అవుతాయి. అనుష్క, సాయి పల్లవి విషయంలోనూ ఇది నిజమైంది. ఇద్దరు తారలు తమ పెళ్లి వార్తలను ఖండించారు. ప్రస్తుతం సినిమాలపైనే తమ పూర్తి దృష్టి ఉందని స్పష్టం చేశారు. సాయి పల్లవికి అనేక భారీ ప్రాజెక్టులు (బాలీవుడ్, రామాయణం, ధనుష్, మణిరత్నం చిత్రాలు) ఉన్నాయి. జాతీయ స్థాయిలో అగ్ర తారగా ఎదగాలనే లక్ష్యంతో కెరీర్ పైనే తమ ఫోకస్ ఉందంటున్నారు.

సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు ఎక్కడ లీక్‌ అయినా ఇన్‌స్టంట్‌గా స్ప్రెడ్‌ అవుతుంటాయి. అందులోనూ వారి పెళ్లికి సంబంధించిన టాపిక్స్ అయితే మరీ వేగంగా వైరల్‌ అవుతాయి. విషయంలో నిజం ఉందా? లేదా? అనే విషయాలను పక్కనపెట్టి, క్రేజీగా చెప్పుకుంటూ ఉంటారు ఆడియన్స్. మొన్నటికి మొన్న అనుష్క విషయంలో జరిగిన ఈ సీన్‌.. ఇప్పుడు సాయిపల్లవి విషయంలో రిపీట్‌ అవుతోంది. అనుష్క ఇప్పట్లో సినిమాలు చేయడం లేదు. త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయారోచ్‌ అని సోషల్‌ మీడియా కోడై కూసింది. మామూలుగా ఇలాంటి విషయాలకు స్పందించని అనుష్క అండ్‌ టీమ్‌ ఈ సారి ఓపెన్‌ కాక తప్పలేదు. అలాంటిదేమీ లేదు. స్వీటీ నయా మూవీ త్వరలోనే అనౌన్స్ అవుతుంది. ప్రస్తుతం మలయాళంలో సినిమా ఉంది. ఆమె ఫోకస్‌ కెరీర్‌ మీదే ఉందంటూ క్లారిటీ ఇచ్చారు. స్వీటీ సంగతి కాసింత పక్కకు వెళ్లగానే, సీన్‌లోకి వచ్చేశారు సాయిపల్లవి. నార్త్ టు సౌత్‌ క్రేజీ ప్రాజెక్టులన్నీ పల్లవి చేతిలోనే ఉన్నాయి ప్రస్తుతం. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సినిమా ఫైనల్‌ పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. ఈ సినిమాలో మరింత యంగ్‌గా కనిపిస్తున్నారు పల్లవి. ఆమీర్‌ తనయుడితో పల్లవి ఇస్తున్న ఎంట్రీ రిజల్ట్ మీద నార్త్ వాళ్లే కాదు, మనవాళ్లు కూడా ఇంట్రస్ట్ పెంచుకుంటున్నారు. మరో వైపు రామాయణ రెండు పార్టులున్నాయి. ధనుష్‌ తో మూవీ చేస్తున్నారు. మణిరత్నం సినిమా ఉంది. సూపర్‌స్టార్‌ సినిమాలో పల్లవి అంటూ ఎప్పటి నుంచో కోలీవుడ్‌ కోడై కూస్తోంది.. ఇన్నిటి మధ్య సాయిపల్లవి పెళ్లి వార్తలు కూడా అంతే జోరుగా వైరల్‌ అవుతున్నాయి. ఆల్రెడీ చెల్లికి పెళ్లి చేసిన పల్లవి అతి త్వరలో పీటల మీద కూర్చుంటారన్నది ఆ వార్తల సారాంశం. ఇప్పట్లో పెళ్లి చేసుకునే తీరిక లేదు బాస్‌ అని స్పష్టం చేస్తున్నారు సాయిపల్లవి. ఫోకస్‌ అంతా కెరీర్‌ మీదే ఉందంటున్నారు లేడీ పవర్‌స్టార్‌. చేస్తున్న ప్రాజెక్టులతో సక్సెస్‌ కావాలి. నేషనల్‌ రేంజ్‌లో టాప్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు సిల్వర్‌ స్క్రీన్‌ మలర్‌ మేడమ్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాలియా, విరోష్‌ని కంపేర్‌ చేస్తున్న నెటిజన్లు

యష్‌ ముందుకొస్తే.. విజయ్‌ వెనక్కి జరుగుతారా ??

ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి

తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..

ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!

Follow Us