AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండాకాలంలో వేడి నీటి స్నానం.. పిచ్చి అనుకోకండి బాస్.. ఈ రహస్యాలు తెలిస్తే మైండ్ బ్లాంకే..

ఎండలు మండిపోతుంటే చల్లటి నీళ్లతో స్నానం చేయడమే హాయిగా ఉంటుంది. కానీ ఈ వేసవిలో కూడా గోరువెచ్చని నీటితో స్నానం చేసే వారు మన చుట్టూ ఉంటారు. చూసేవారికి ఇది వింతగా అనిపించినా, దీని వెనుక అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఉన్నాయని మీకు తెలుసా? ఒత్తిడిని తగ్గించడం నుండి కండరాల నొప్పులను మాయం చేయడం వరకు.. వేసవిలో వేడినీటి స్నానం వల్ల కలిగే టాప్ బెనిఫిట్స్ ఇవే..

ఎండాకాలంలో వేడి నీటి స్నానం.. పిచ్చి అనుకోకండి బాస్.. ఈ రహస్యాలు తెలిస్తే మైండ్ బ్లాంకే..
Summer Warm Bath Benefits
Krishna S
|

Updated on: Mar 30, 2026 | 9:46 PM

Share

బయట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నప్పుడు అందరూ చల్లటి నీటి కోసం వెతుకుతుంటారు. అయితే ఈ వేసవిలో కూడా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? విదేశాల్లో ఇది సాధారణమైనప్పటికీ, మన దేశంలో మాత్రం వేసవిలో వేడి నీటి స్నానాన్ని కాస్త వింతగా చూస్తారు. కానీ సైన్స్, ఆయుర్వేదం ప్రకారం వేసవిలో గోరువెచ్చని నీటి స్నానం వల్ల కలిగే లాభాలు ఇవే..

కండరాల నొప్పులకు చెక్

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో గంటల తరబడి డెస్క్ ముందు కూర్చోవడం, స్మార్ట్‌ఫోన్‌లు వాడటం వల్ల మెడ, భుజాల కండరాలు బిగుసుకుపోతుంటాయి. వేసవి సాయంత్రం గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి, శరీర నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

ఏసీ జలుబు నుండి ఉపశమనం

వేసవిలో ఏసీల వాడకం వల్ల చాలా మందికి ఉదయాన్నే తుమ్ములు, దగ్గు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల ఆవిరి పట్టినట్లుగా ఉండి శ్వాసనాళాలు శుభ్రపడతాయి. జలుబు, దగ్గు నుండి ఇది సహజమైన ఉపశమనాన్ని ఇస్తుంది.

ఒత్తిడి మటుమాయం.. హాయిగా నిద్ర

రోజంతా ఆఫీస్ పనులతో ఒత్తిడికి గురయ్యేవారు పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఇది మెదడును ప్రశాంతంగా ఉంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రలేమితో బాధపడేవారికి ఇది ఒక మంచి థెరపీలా పనిచేసి, హాయిగా నిద్ర పట్టేలా చేస్తుంది.

మెరిసే చర్మం మీ సొంతం

వేసవిలో చెమట, ధూళి వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు, బ్లాక్‌హెడ్స్ వస్తుంటాయి. గోరువెచ్చని నీరు చర్మ రంధ్రాలను సున్నితంగా తెరిచి, లోపల పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. ఫలితంగా చర్మం శుభ్రపడి, మొటిమల సమస్య తగ్గుతుంది.

 పీరియడ్స్ నొప్పులకు విరుగుడు

ఋతుక్రమ సమయంలో వచ్చే కడుపునొప్పి, నడుము నొప్పి భరించలేనివిగా ఉంటాయి. అలాగే మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారికి కూడా వేడి నీటి స్నానం ఒక వరం లాంటిది. వేడి నీరు శరీరంలోని నరాలకు విశ్రాంతినిచ్చి, ఆ తీవ్రమైన నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

వేసవిలో మరీ వేడిగా ఉండే నీటిని కాకుండా కేవలం గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలి. అలాగే స్నానం చేసిన వెంటనే ఏసీ గదిలోకి వెళ్లకుండా కొద్దిసేపు సాధారణ ఉష్ణోగ్రతలో ఉండటం మంచిది.

Follow Us
భూమిపై చివరి నగరం ఇదే.. ఈ సిటీ దాటితే ఏముంటుందో తెలుసా?
భూమిపై చివరి నగరం ఇదే.. ఈ సిటీ దాటితే ఏముంటుందో తెలుసా?
2025లో అట్టర్ ప్లాప్ అయిన సినిమా.. ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్..
2025లో అట్టర్ ప్లాప్ అయిన సినిమా.. ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్..
పెసరపప్పు కోయగూర తింటే మోకాళ్ళు, నడుము నొప్పులు పూర్తిగా మాయం
పెసరపప్పు కోయగూర తింటే మోకాళ్ళు, నడుము నొప్పులు పూర్తిగా మాయం
వేల కోట్ల విలువైన బంగారం అమ్మకాలు! కానీ..
వేల కోట్ల విలువైన బంగారం అమ్మకాలు! కానీ..
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఖాళీ స్థలం ఉంటే చాలు.. లక్షల్లో సంపాదన
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఖాళీ స్థలం ఉంటే చాలు.. లక్షల్లో సంపాదన
ధోనీ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా క్లాస్ ప్లేయర్..
ధోనీ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా క్లాస్ ప్లేయర్..
శక్తివంతమైన మీసాల హనుమాన్ ఆలయం.. ఒక్కసారి దర్శిస్తే మీ కష్టాలు..
శక్తివంతమైన మీసాల హనుమాన్ ఆలయం.. ఒక్కసారి దర్శిస్తే మీ కష్టాలు..
చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే
చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి.. ఎందుకంటే
ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్
ఈ 5 కూరగాయలను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే యమ డేంజర్
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతికి ఛాన్స్..