AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: లైవ్ మ్యాచ్‌లో లవ్ ప్రపోజల్.. చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్.. ఏం జరిగిందంటే?

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్ కేవలం క్రికెట్ ప్రియులనే కాకుండా ప్రేమికులను కూడా ఆకట్టుకుంది. మైదానంలో ఆటగాళ్లు ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తిస్తుంటే, ప్రేక్షకుల గ్యాలరీలో ఒక ముంబై ఇండియన్స్ అభిమాని తన కేకేఆర్ గర్ల్‌ఫ్రెండ్‌కు సినిమా స్టైల్‌లో ప్రపోజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Video: లైవ్ మ్యాచ్‌లో లవ్ ప్రపోజల్.. చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్.. ఏం జరిగిందంటే?
Mumbai Indians Fan Proposes Video
Venkata Chari
|

Updated on: Mar 30, 2026 | 9:40 PM

Share

ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో పరుగుల వరద పారింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 200 పరుగుల మార్కును దాటి 220 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్, చివరి ఓవర్ మొదటి బంతికి 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మైదానంలో ప్రతి బంతికి ఉత్కంఠ రేగుతున్న సమయంలోనే స్టాండ్స్‌లో ఒక అందమైన ప్రేమకథ ఆవిష్కృతమైంది.

ప్రత్యర్థి జట్ల అభిమానుల మధ్య ‘ప్రేమ’ బంధం..

ఈ మ్యాచ్‌లో విశేషం ఏమిటంటే, ప్రపోజ్ చేసిన యువకుడు ముంబై ఇండియన్స్ జర్సీలో ఉండగా, ఆ యువతి కేకేఆర్ మద్దతుదారుగా ఆమె జట్టు జర్సీలో ఉంది. తమ అభిమాన జట్లు మైదానంలో తలపడుతున్న వేళ, ఈ జంట మాత్రం తమ జీవితకాల బంధానికి పునాది వేసుకున్నారు. ముంబై ఫ్యాన్ మోకాళ్లపై కూర్చుని రింగ్‌తో ప్రపోజ్ చేస్తున్న దృశ్యం స్టేడియంలోని కెమెరాల్లో నిక్షిప్తమైంది.

చిన్న ట్విస్ట్.. ఆపై శుభం కార్డు..!

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, ఆ యువకుడు ప్రపోజ్ చేసే క్రమంలో ఒక చిన్న పొరపాటు జరిగింది. ఉద్వేగంలో అతని చేతిలోని ఉంగరం ఒక్కసారిగా కింద పడిపోయింది. దీంతో కొన్ని సెకన్ల పాటు అక్కడ ఉన్నవారు కంగారు పడ్డారు. వెంటనే ఉంగరాన్ని వెతికి పట్టుకున్న ఆ యువకుడు, తన ప్రేయసి వేలికి తొడిగి తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఆమె కూడా చిరునవ్వుతో అతని ప్రేమను అంగీకరించడంతో గ్యాలరీలోని ప్రేక్షకులంతా చప్పట్లు కొడుతూ ఈ జంటను అభినందించారు.

సోషల్ మీడియాలో ‘షీ ప్రోథోమ్ భలోబాషేర్ ఫీలింగ్’ వైరల్..

ఈ మధుర క్షణానికి సంబంధించిన 24 సెకన్ల వీడియోను కోల్‌కతా నైట్ రైడర్స్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దీనికి బెంగాలీలో “షీ ప్రోథోమ్ భలోబాషేర్ ఫీలింగ్” (మొదటి ప్రేమ అనుభూతి) అని క్యాప్షన్ ఇచ్చింది. గతంలో కూడా క్రికెట్ మైదానాల్లో ఇలాంటి ప్రపోజల్స్ జరిగినప్పటికీ, ప్రత్యర్థి జట్ల జర్సీలు ధరించి ఇలా ప్రపోజ్ చేయడం నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతూ వేల సంఖ్యలో వ్యూస్, కామెంట్లను సొంతం చేసుకుంటోంది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆగస్టు 27 రాశిఫలాలు: ఆ రాశి ఉద్యోగులకు గుడ్ న్యూస్..
ఆగస్టు 27 రాశిఫలాలు: ఆ రాశి ఉద్యోగులకు గుడ్ న్యూస్..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ