Ratan Tata Car Collection: ఈ 2 కార్లు రతన్ టాటా ఎంతో ఇష్టం.. గ్యారేజీలో ఖరీదైన కార్లు!
Ratan Tata Car Collection: టాటా సన్స్ మాజీ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) మరణించారు. రతన్ టాటా టాటా మోటార్స్‌తో సహా అనేక ఇతర కంపెనీలను ఎంతో ఎత్తులకు తీసుకెళ్లారు. ఈ రోజు భద్రత విషయానికి వస్తే మొదట గుర్తుకు వచ్చే పేరు టాటా మోటార్స్. భారత మార్కెట్లో చాలా బలమైన పట్టును కలిగి ఉంది..
Ratan Tata Car Collection: టాటా సన్స్ మాజీ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) మరణించారు. రతన్ టాటా టాటా మోటార్స్‌తో సహా అనేక ఇతర కంపెనీలను ఎంతో ఎత్తులకు తీసుకెళ్లారు. ఈ రోజు భద్రత విషయానికి వస్తే మొదట గుర్తుకు వచ్చే పేరు టాటా మోటార్స్. భారత మార్కెట్లో చాలా బలమైన పట్టును కలిగి ఉంది. ఎన్నో కంపెనీలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కార్ల సేకరణలో ఏ వాహనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. రతన్ టాటా ఇంతకుముందు హోండా సివిక్‌లో ప్రయాణించేవారుజ అయితే హోండా సివిక్ తర్వాత, రతన్ టాటా టాటా గ్రూప్‌కు చెందిన టాటా నెక్సాన్ ఈవీలో ప్రయాణించడం ప్రారంభించారు. ప్రస్తుతం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో ఎక్కువ ఆధిపత్యాన్ని కలిగి ఉంది. రతన్ టాటా గ్యారేజీలో ఏ వాహనాలు ఉన్నాయో తెలుసుకుందాం?
రతన్ టాటా కార్ కలెక్షన్:
రతన్ టాటా కార్ల సేకరణలో ఒకటి కాదు, చాలా విలాసవంతమైన కార్లు ఉన్నాయి. వాటిలో అతని హృదయానికి చాలా దగ్గరగా ఉండే అలాంటి కారు ఒకటి ఉంది. టాటా నానోను టాటా మోటార్స్ ఉత్పత్తి శ్రేణి నుండి తొలగించారు. నివేదికల ప్రకారం, రతన్ టాటా తన గ్యారేజీలో టాటా నానో కూడా ఉంది. టాటా నానో అతని డ్రీమ్ ప్రాజెక్ట్. దీని కారణంగా లక్ష రూపాయల ధరతో విడుదల చేసిన ఈ చిన్న కారు అతని హృదయంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
టాటా నానో మాత్రమే కాదు, 2023లో టాటా ఇండికా 25వ వార్షికోత్సవం జరిగినప్పుడు, ఈ ప్రత్యేక సందర్భంలో రతన్ టాటా ఒక పోస్ట్‌ను షేర్ చేసి, టాటా ఇండికా భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ కారు అని పోస్టులో పేర్కొన్నారు. దీనితో పాటు, ఈ కారు తన హృదయానికి చాలా దగ్గరగా ఉందని కూడా చెప్పాడు.
టాటా నానో, టాటా ఇండికాతో పాటు, టాటా మోటార్స్ అత్యంత ప్రజాదరణ పొందిన, సురక్షితమైన వాహనం టాటా నెక్సాన్ కూడా రతన్ టాటా కార్ కలెక్షన్‌లో ఉంది. ఈ వాహనాలతో పాటు, రతన్ టాటా వద్ద మెర్సిడెస్-బెంజ్ SL500, మసెరటి క్వాట్రోపోర్టే, ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్, కాడిలాక్ XLR, హోండా సివిక్ వంటి వాహనాలు కూడా ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి