UPI LITE: యూపీఐ లైట్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. లావాదేవీల పరిమితి భారీగా పెంపు
భారతదేశంలో ఇటీవల కాలంలో యూపీఐ సేవలు అత్యంత ప్రజాదరణ పొందాయి. అయితే ఈ పేమెంట్ చేయడానికి ఇంటర్నెట్ తప్పనిసరి కావడంతో నెట్ పని లేకుండా పని చేసేలా యూపీఐ లైట్ పేమెంట్స్‌ను అందుబాటులో తీసుకొచ్చారు. అయితే యూపీఐ లైట్ పేమెంట్స్ పరిమితి పెంచాలని ఎన్నో రోజుల వినియోగదారులు ఆర్‌బీఐను కోరుతున్నారు. తాజాగా యూపీఐ 123 పే, యూపీఐ లైట్ వాలెట్ వినియోగదారుల లావాదేవీల పరిమితిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది.
భారతదేశంలో ఇటీవల కాలంలో యూపీఐ సేవలు అత్యంత ప్రజాదరణ పొందాయి. అయితే ఈ పేమెంట్ చేయడానికి ఇంటర్నెట్ తప్పనిసరి కావడంతో నెట్ పని లేకుండా పని చేసేలా యూపీఐ లైట్ పేమెంట్స్‌ను అందుబాటులో తీసుకొచ్చారు. అయితే యూపీఐ లైట్ పేమెంట్స్ పరిమితి పెంచాలని ఎన్నో రోజుల వినియోగదారులు ఆర్‌బీఐను కోరుతున్నారు. తాజాగా యూపీఐ 123 పే, యూపీఐ లైట్ వాలెట్ వినియోగదారుల లావాదేవీల పరిమితిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది. ఈ విషయాన్ని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో యూపీఐ 123 పే, యూపీఐ లైట్ వ్యాలెట్ లావాదేవీల విషయంలో ఆర్‌బీఐ తాజా నిర్ణయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
యూపీఐ 123 పే అనేది ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం తక్షణ చెల్లింపు వ్యవస్థ. డిజిటల్ చెల్లింపులను సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యూపీఐ 123 పేను లాంచ్ చేశారు. ముఖ్యంగా యూపీఐ 123 పే, యూపీఐ లైట్ లావాదేవీల పరిమితి పెంపు ద్వారా చెల్లింపులు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. యూపీఐ 123 పే ద్వారా ప్రతి లావాదేవీ పరిమితిని రూ. 5,000 నుండి రూ. 10,000కి పెంచారు. అలాగే యూపీఐ లైట్ వాలెట్ పరిమితిని రూ. 2,000 నుంచి రూ. 5,000కి మరియు ప్రతి లావాదేవీ పరిమితిని రూ. 500 నుండి రూ. 1,000కి పెంచారు. ఈ తాజా నిర్ణయం వల్ల భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌ను మెరుగుపర్చేందుకు ఆర్బీఐ చర్యలు హర్షణీయమని నిపుణులు చెబుతున్నారు. యూపీఐ 123 పే, యూపీఐ లైట్ పరిధిని విస్తరించడం ద్వారా ఆర్‌బీఐ అధిక సంఖ్యలో జనాభాకు ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్‌లు లేదా విశ్వసనీయ ఇంటర్నెట్ కనెక్షన్ లేని వారి రోజువారీ జీవితంలో డిజిటల్ లావాదేవీలను నిర్వహించడానికి వీలు కల్పిస్తుందని పేర్కొంటున్నారు. ఆర్‌బీఐ చేసిన ఈ ప్రకటన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ చెల్లింపులు ప్రధాన పాత్రను కొనసాగించబోతున్నాయని సూచిస్తున్నాయని వివిరిస్తున్నారు.
యూపీఐ 123పే ద్వరా ఫీచర్ ఫోన్ వినియోగదారులు నాలుగు సాంకేతిక ప్రత్యామ్నాయాల ఆధారంగా అనేక లావాదేవీలను చేపట్టవచ్చు. వాటిలో ఐవీఆర్(ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) నంబర్‌కు కాల్ చేయడం, ఫీచర్ ఫోన్‌లలో యాప్ ఫంక్షనాలిటీ, మిస్డ్ కాల్ ఆధారిత విధానం, సామీప్య సౌండ్ ఆధారిత చెల్లింపులు కూడా ఉన్నాయి. యూపీఐ లైట్ అనేది తక్కువ విలువ ఉన్న లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి విశ్వసనీయ ఎన్‌పీసీఐ కామన్ లైబ్రరీ అప్లికేషన్‌ను ప్రభావితం చేసే చెల్లింపు పరిష్కారం. యూపీఐ లైట్ అనుభవం అనేది రిమిటర్ బ్యాంక్‌కు సంబంధించిన కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లను రియల్ టైమ్‌లో ఉపయోగించకుండా తక్కువ-విలువ లావాదేవీలను ప్రారంభించడానికి కస్టమర్-స్నేహపూర్వక విధానంగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి