AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: చరిత్ర సృష్టించిన భారత రైల్వే.. దేశంలో మొట్ట మొదటి హైడ్రోజన్‌తో నడిచే ఇంజన్‌ ఇదే!

Indian Railways: మన భారత రైల్వే మరో చరిత్ర సృష్టించింది. రోజురోజుకు టెక్నాలజీలలో దూసుకుపోతోంది. ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత మెరుగ్గా ఉండేందుకు సరికొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పుడు హైడ్రోజన్‌తో నడిచే ఇంజన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ట్వీట్‌ చేశారు..

Indian Railways: చరిత్ర సృష్టించిన భారత రైల్వే.. దేశంలో మొట్ట మొదటి హైడ్రోజన్‌తో నడిచే ఇంజన్‌ ఇదే!
Subhash Goud
|

Updated on: Jul 26, 2025 | 12:00 PM

Share

భారత రైల్వే చరిత్ర సృష్టించింది. శుక్రవారం రైల్వేలు హైడ్రోజన్‌తో నడిచే రైలును విజయవంతంగా పరీక్షించాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో ఈ ట్రయల్ నిర్వహించారు. ఆగస్టు చివరి నాటికి భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్‌తో నడిచే రైలును నడపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది జింద్-సోనిపట్ మధ్య దాదాపు 90 కి.మీ. దూరం నడుస్తుంది. ఈ హైడ్రోజన్‌ రైలును కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ధృవీకరించారు. టెస్ట్ రన్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనితో పాటు, దాదాపు 35 ఇలాంటి రైళ్లను నడపడానికి ప్రణాళిక ఉంది. దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్‌తో నడిచే రైలు ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం?

ప్రత్యేకత ఏమిటి?

ఇవి కూడా చదవండి

ఇది నాన్-ఏసీ రైలు అవుతుంది. దీనికి 2 హైడ్రోజన్ ఇంధన శక్తి ఇంజిన్లు ఉంటాయి. దీనితో పాటు దీనికి 8 ప్యాసింజర్ కార్లు అంటే కోచ్‌లు ఉంటాయి. ఈ రైలును ఉత్తర రైల్వే జింద్-సోనిపట్ ట్రాక్‌పై నడుపుతుంది. దీని వేగం గంటకు 110 కిలోమీటర్లు ఉంటుంది. 1200 హార్స్‌పవర్ ప్రోటోటైప్ హైడ్రోజన్ ఇంజిన్‌ను ఐసిఎఫ్ అభివృద్ధి చేస్తోంది. ఈ రైలు తక్కువ దూరాలను కవర్ చేయడానికి అభివృద్ధి చేసింది.

ఇది కూడా చదవండి: Zodiac Signs: ఈ నాలుగు రాశుల వారు పేదరికంలో పుట్టినా ధనవంతులవుతారట!

ఐసిఎఫ్ జనరల్ మేనేజర్ సుబ్బారావు డెక్కన్ హెరాల్డ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మొదటి పవర్ కారుగా పిలిచే దీనిని పరీక్షించామని చెప్పారు. రెండవ పవర్ కారును రాబోయే రెండు వారాల్లో పరీక్షిస్తారు. దీని తర్వాత, మొత్తం రైలును పరీక్షిస్తారు. ఇందులో 8 ప్యాసింజర్ రైళ్లు ఉంటాయి. ఆగస్టు 31 నాటికి మొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును నడపాలని ప్లాన్ చేస్తున్నామని అన్నారు. తుది పరీక్షను ఉత్తర రైల్వే నిర్వహిస్తుంది.

2023లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభకు తెలియజేశారు. భారత రైల్వేలు “హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్” చొరవ కింద 35 హైడ్రోజన్-శక్తితో నడిచే రైళ్లను నడపాలని యోచిస్తున్నాయని అన్నారు. ప్రతి రైలుకు రూ.80 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. కొండ మార్గాల్లో మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వడానికి ఒక్కో రూట్‌కు రూ.70 కోట్లు ఖర్చవుతుంది. ఉత్తర రైల్వేలోని జింద్-సోనిపట్ విభాగంలో నడపడానికి సిద్ధంగా ఉన్న హైడ్రోజన్ ఇంధన కణాలతో కూడిన డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU)ను తిరిగి అమర్చడానికి రూ.111.83 కోట్ల విలువైన పైలట్ ప్రాజెక్ట్ కూడా ప్రారంభించినట్లు చెప్పారు. హైడ్రోజన్ రైళ్ల ప్రారంభ రన్నింగ్ ఖర్చు ఎక్కువగా ఉండవచ్చు. కానీ కాలక్రమేణా అది తగ్గుతుందని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Cyberattack: ఒక్క బలహీనమైన పాస్‌వర్డ్ 158 ఏళ్ల కంపెనీని కూల్చివేసింది.. సైబర్ దాడితో నిరుద్యోగులుగా మారిన 700 మంది

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి