- Telugu News Photo Gallery Business photos India’s Cheapest 7 Seater Electric Car: 490Km Range, 360 Degree Camera, HUGE Sunroof, ADAS And More Bookings Open, Priced At Rs..
Electric Car: అత్యంత చౌకైన 7-సీట్ల ఎలక్ట్రిక్ కారు.. 490 కి.మీ రేంజ్, ఫీచర్స్ మాత్రం అదుర్స్!
Kia Electric Car: భారతదేశంలో రకరకాల ఎలక్ట్రిక్ కార్లు విడుదల అవుతున్నాయి. తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జింగ్‌తో అధిక మైలేజీ ఇచ్చే కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు కీయా నుంచి అద్భుతమైన ఈవీ విడుదలైంది. ఇప్పుడు కియా ఇండియా అధికారిక వెబ్‌సైట్, డీలర్‌షిప్‌ల ద్వారా రూ. 25,000 ప్రారంభ మొత్తాన్ని చెల్లించి బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.
Updated on: Jul 26, 2025 | 7:05 AM

Kia Electric Car: కియా ఇండియా తన మొట్టమొదటి మేడ్-ఇన్-ఇండియా 7-సీట్ల ఎలక్ట్రిక్ కారు కారెన్స్ క్లావిస్ EV బుకింగ్‌లను ప్రారంభించింది. రూ. 17.99 లక్షల నుండి రూ. 24.49 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ధర కలిగిన కారెన్స్ క్లావిస్ EV భారతదేశంలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు. ఇప్పుడు కియా ఇండియా అధికారిక వెబ్‌సైట్, డీలర్‌షిప్‌ల ద్వారా రూ. 25,000 ప్రారంభ మొత్తాన్ని చెల్లించి బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.

వేరియంట్ వారీగా ధరలు: కారెన్స్ క్లావిస్ EV నాలుగు వేరియంట్లలో వస్తుంది. HTK+, HTX, HTX (ఎక్స్‌టెండెడ్ రేంజ్), HTX+ (ఎక్స్‌టెండెడ్ రేంజ్). వీటి ధరలు వరుసగా రూ. 17.99 లక్షలు, రూ. 20.49 లక్షలు, రూ. 22.49 లక్షలు, రూ. 24.49 లక్షలు.

బ్యాటరీ,రేంజ్: ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లతో వస్తుంది. 42kWh, 51.4kWh, ARAI-సర్టిఫైడ్ రేంజ్ వరుసగా 404km, 490km. 100kW DC ఛార్జర్‌ని ఉపయోగించి 10% నుండి 80% వరకు ఛార్జ్ చేయడానికి కేవలం 39 నిమిషాలు పడుతుంది.

పనితీరు: పెద్ద 51.4kWh బ్యాటరీ ప్యాక్ మోడల్ 171PS/255Nm అవుట్‌పుట్‌ను అందించే ఫ్రంట్-యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. ఇది 8.4 సెకన్లలో 0 నుండి 100kmph వేగాన్ని అందుకుంటుంది.

కియా కారెన్స్ క్లావిస్ EV ముఖ్య లక్షణాలు: డ్యూయల్ 12.3-అంగుళాల స్క్రీన్లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, మరిన్ని ముఖ్యమైన లక్షణాలు.

కియా కారెన్స్ క్లావిస్ EV ఫీచర్లు: దీనికి పవర్డ్ డ్రైవర్ సీటు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్ 2 ADAS, ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా, నాలుగు డిస్క్ బ్రేక్‌లు మొదలైనవి కూడా ఉన్నాయి.




