AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Holidays: విద్యార్థులకు పండగే.. ఆగస్ట్‌లో వరుస సెలవులు.. వారం రోజులు ఎంజాయ్‌!

AP, Telangana School Holidays: ఇక జూలై నెల ముగియనుంది. మరో ఐదారు రోజులు గడిస్తే ఆగస్టు నెల వచ్చేస్తుంది. అయితే ఆగస్ట్ నెలలో పండగలు, ప్రత్యేక రోజులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హలిడేస్‌ ఎక్కువగా వస్తుంటాయి. ఇలా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లోని స్కూల్, కాలేజీ విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఈ నెలలో వరుస సెలవులు వస్తున్నాయి..

School Holidays: విద్యార్థులకు పండగే.. ఆగస్ట్‌లో వరుస సెలవులు.. వారం రోజులు ఎంజాయ్‌!
Subhash Goud
|

Updated on: Jul 25, 2025 | 5:07 PM

Share

AP, Telangana School Holidays: పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే చాలు విద్యార్థులకు పండగే. చదువులతో తలమునకలవుతున్న విద్యార్థులకు ఒక రోజు సెలవు వచ్చిందంటే చాలు ఎంజాయ్‌ చేయొచ్చు అనుకుంటారు. అదే వరుస సెలవులు వస్తున్నాయంటే చాలు ఒక టూర్‌ ప్రోగ్రామ్‌ వేసేస్తుంటారు. ఆదివారం వస్తుంటే చాలు సంతోషంగా ఉండే పిల్లలకు.. ఎక్కువ సెలవులు వస్తున్నాయంటే ఎగిరిగంతులేస్తారు. ఇలా మరో పదిరోజుల్లో తెలుగు విద్యార్థులకు వరుస సెలవులు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Electric Scooter: కేవలం రూ.54వేలకే 130కిమీ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు!

ఇక జూలై నెల ముగియనుంది. మరో ఐదారు రోజులు గడిస్తే ఆగస్టు నెల వచ్చేస్తుంది. అయితే ఆగస్ట్ నెలలో పండగలు, ప్రత్యేక రోజులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి హలిడేస్‌ ఎక్కువగా వస్తుంటాయి. ఇలా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లోని స్కూల్, కాలేజీ విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఈ నెలలో వరుస సెలవులు వస్తున్నాయి. ఒకటి, రెండు రోజులు కాదండోయ్‌.. ఏకంగా వరుసగా పదిరోజుల్లో ఆరు రోజులు సెలవులే ఉండనున్నాయి. మరి ఏయే రోజుల్లో ఎందుకు సెలవులు వస్తున్నాయో తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

ఆగస్ట్ 8న వరలక్ష్మి వ్రతం:

ఇక ఆగస్ట్‌ నెలలో మొదటి వారం నుండే సెలవులు ప్రారంభం అవుతాయి. ఆగస్ట్ 3న ఆదివారం. ఆ రోజు దేశ వ్యాప్తంగా సాధారణంగా సెలవు ఉంటుంది. తర్వాత ఓ నాలుగురోజులు మాత్రమే పాఠశాలలు, కాలేజీలు, ఆఫీసులు కొనసాగుతాయి. ఆ తర్వాత వరుస సెలవులు రానున్నాయి. ఆగస్ట్ 8 శుక్రవారం వరలక్ష్మి వ్రతం… తెలుగింటి ఆడపడుచులు భక్తిశ్రద్దలతో అమ్మవారిని పూజించే పర్వదినం. అందుకే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు ఈరోజు ఆప్షనల్ హాలిడే ఇచ్చాయి.

ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే వరలక్ష్మి వ్రతం రోజున వేతనంతో కూడిన సెలవు తీసుకోవచ్చు. ఇక హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లో ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొందరికి ఆరోజు సెలవు కూడా ఉంటుంది. ఇలా ఆగస్ట్ 8 వరలక్ష్మి వ్రతంతో ముగుస్తుంది.

ఆగస్ట్ 9న రెండో శనివారం, రాఖీ పండగ:

8న శుక్రవారం వరలక్ష్మి వ్రతం తర్వాతి ఆగస్టు 9న రెండో శనివారం. ఈ రోజు కూడా సెలవే ఉంటుంది. ప్రతి నెలలో రెండో శనివారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. అయితే ఆగస్ట్ 9న మరో పండగకూడా ఉందండోయ్‌. అదే రాఖీ పండగ. ఈ రోజున తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఐచ్చిక సెలవు ఇచ్చాయి.

ఆగస్ట్ 10న ఆదివారం:

ఆగస్ట్ 10 ఆదివారం- దేశ వ్యాప్తంగా సాధారణంగా సెలవు ఉంటుంది. ఇలా ఆగస్ట్‌ 8, 9, 10వ తేదీల్లో మూడు రోజుల పాటు వరుస సెలవులు ఉండనున్నాయి.

ఆగస్ట్ 11-14 పాఠశాలలు ఉన్నా తరగతులు ఉండవ్:

విద్యాసంస్థలకు, ఉద్యోగులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవు తర్వాత విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. ఎందుకంటే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం ఏర్పాట్లు జోరుగా కొనసాగుతుంటాయి. అందుకే ఆగస్ట్ 11 నుండి 14 వరకు విద్యార్థులకు జాతీయ దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు రిహార్సల్స్, ఆటల పోటీలు, ఇతర కార్యక్రమాలలో బిజీగా ఉంటాయి. పెద్దగా క్లాసులు కూడా కొనసాగవు. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం. ఓ రకంగా చెప్పాలంటే పిల్లలకు ఎంజాయ్‌ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి రోజు తరగతులతో ఉక్కిరిబిక్కిరి అయ్యే విద్యార్థులకు సెలవుల తర్వాత ఈ నాలుగు రోజులు కూడా ఆటలు, పాటలు, విద్యాసంస్థల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జాతీయ దినోత్సవ వేడుకల కోసం ఎలాంటి క్లాసులు సరిగ్గా జరగవు. ఇవి కూడా ఒకరకంగా పిల్లలకు క్లాసుల గొడవ ఉండదు. ఎంజాయ్‌గా ఉంటారు.

ఇది కూడా చదవండి: ITR 2025: మీరు ఐటీఆర్‌ దాఖలు చేసే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి.. లేకుంటే నష్టపోతారు!

ఆగస్ట్ 16 సెలవు:

ఇక జాతీయ దినోత్సవం తర్వాత హిందువుల ఆరాధ్యదైవం శ్రీకృష్ణుడి పుట్టినరోజును కృష్ణాష్టమి, గోకులాష్టమిగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వేడుకలను ఘనంగా జరుపుకొంటారు. పిల్లలను కృష్ణుడు, గోపికల వేషధారణలో అలంకరించి ఉట్టికొట్టే వేడుకలు నిర్వహిస్తుంటారు. అందుకే శ్రీకృష్ణాష్టమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు, కాలేజీలు, ఆఫీసులకు సెలవు ఉంటుంది.

ఆగస్ట్  17న ఆదివారం:

ఇక మరుసటి రోజు అంటే ఆగస్ట్‌ 17న ఆదివారం. సాధాణంగా సెలవు ఉండేదే. ఇలా చూసుకుంటే వచ్చే నెలలో విద్యార్థులకు సెలవులే.. సెలవులు ఉంటాయి.

ఇది కూడా చదవండి: Viral Video: అయ్యో వీటికి కూడా పిల్లల పరేషాన్ తప్పదా..? పిల్ల చింపాంజీ చేసిన కొంటె పనికి తలపట్టుకున్న తల్లి

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..