Indian Railway: భారత రైల్వేశాఖ కీలక నిర్ణయం.. రైళ్ల సమయ వేళలు మారబోతున్నాయి..!

Indian Railway: రైల్వే ప్రయాణికుల కోసం భారత రైల్వే ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది. కరోనా మహమ్మారి సమయంలో రైళ్ల సమయ వేళలు మార్పులు చేసింది రైల్వే..

Indian Railway: భారత రైల్వేశాఖ కీలక నిర్ణయం.. రైళ్ల సమయ వేళలు మారబోతున్నాయి..!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 22, 2022 | 9:42 PM

Indian Railway: రైల్వే ప్రయాణికుల కోసం భారత రైల్వే ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది. కరోనా మహమ్మారి సమయంలో రైళ్ల సమయ వేళలు మార్పులు చేసింది రైల్వే శాఖ. మొదట్లో అన్ని రైళ్లను రద్దు చేయగా, కోవిడ్‌ కేసులు తగ్గుతుండగా, రైళ్ల సంఖ్య పెంచింది. ఇక ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు (Covid Cases) పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ (Railway Department) కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల సంఖ్య తగ్గుతుండటంతో పూర్తి స్థాయిలో రైళ్ల రాకపోకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం ఉన్న రైళ్ల సమయ వేళలు (Train మార్చేందుకు చర్యలు చేపడుతోంది. అంతేకాకుండా.. ఆయా రూట్లను సైతం మార్చనుంది రైల్వేశాఖ. కొన్ని రూట్లలో రైళ్ల రాకపోకలను మార్చనుండగా, మరి కొన్ని రూట్లలో రైళ్లను నిలిపివేయనుంది.

కరోనా రైల్వేను తీవ్ర దెబ్బతీసింది. కోవిడ్‌ కారణంగా చాలా రైళ్లు రాకపోకలు తగ్గిపోయాయి. ప్రస్తుతం థర్డ్‌వేవ్‌లో కేసులు పెద్దగా లేకపోవడం, రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో రైల్వే శాఖ ఆ దిశగా చర్యలు చేపడుతోంది. పూర్తి స్థాయిలో రైళ్ల రాకపోకలు కొనసాగేలా చర్యలు చేపడుతోంది. పలు నివేదికల ప్రకారం.. రైల్వే నిర్వహించిన రివ్యూ సమావేశంలో కొన్ని రూట్లలో మరిన్ని రైళ్లను నడపాలని భావించింది. అయితే కరోనా కారణంగా కొన్ని మార్గాల్లో ఎక్కువగా రైళ్లను నడిపింది రైల్వేశాఖ. అలాగే అత్యవసరం కానీ రైళ్లను సైతం నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. ఏ రైట్లలో తక్కువ మంది ప్రయాణికులు ఉంటారో ఆ రూట్లలో రైళ్లను నిలిపివేసేందుకు చర్యలు చేపడుతోంది. మోరదాబాద్ రైల్వే డివిజన్ ద్వారా నడిచే రామ్‌నగర్-హరిద్వార్ ఎక్స్‌ప్రెస్, సీల్దా-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌లను రైల్వే తన టైమ్ టేబుల్ నుంచి తొలగించింది.

ఇవి కూడా చదవండి:

Semiconductor: చిప్​ తయారీకి ముందుకొచ్చిన కంపెనీలు.. రూ.1.53 లక్షల కోట్లతో ప్రతిపాదనలు..

IRCTC Credit Card: రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ క్రెడిట్‌ కార్డు.. పూర్తి వివరాలు..!