Gold Silver Price Today: మగువలకు షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..
Latest Gold Silver Prices: కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కాగా.. తాజాగా బుధవారం కూడా బంగారం ధరలు పెరిగాయి.
Latest Gold Silver Prices: మార్కెట్లో పసిడి, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతూ షాకిస్తున్నాయి. బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. కాగా.. తాజాగా బుధవారం కూడా బంగారం ధరలు పెరిగాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (తులం బంగారం) ధర మార్కెట్లో రూ.46,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,460 గా ఉంది. అయితే.. 22 క్యారెట్ల తులం బంగారంపై (Gold Price) రూ.350 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.410 మేర పెరిగింది. కాగా.. వెండి ధరలు కూడా తాజాగా రూ.400 మేర పెరిగాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి (Silver Rate) ధర రూ. 64,400 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా (Gold, silver prices today) ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,460 లుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,460, చెన్నై నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,620, 24 క్యారెట్ల ధర రూ.52,000 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,460 ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,460 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,460 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,460 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,460 గా ఉంది.
వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.64,400 గా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.64,400 ఉండగా.. చెన్నైలోలో కిలో వెండి ధర రూ.69,100 ఉంది. బెంగళూరులో రూ.70,000, కేరళలో రూ.70,000 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.70,000, విజయవాడలో రూ.70,000, విశాఖపట్నంలో రూ.70,000 ఉంది.
కాగా.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. అయితే.. వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కావున మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: