AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Capex: క్యాపెక్స్ అంటే ఏమిటో తెలుసా.. దాని వల్ల ఎవరికి లాభమంటే..

విశాఖపట్నానికి చెందిన ప్రవీణ్ కుమార్ ఒక దీర్ఘకాలిక పెట్టుబడిదారుడు. బడ్జెట్(Budget) ప్రకటన రాగానే ప్రవీణ్ ముఖంలో చిరునవ్వు మెరిసింది...

Capex: క్యాపెక్స్ అంటే ఏమిటో తెలుసా.. దాని వల్ల ఎవరికి లాభమంటే..
Capex
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 23, 2022 | 6:35 AM

విశాఖపట్నానికి చెందిన ప్రవీణ్ కుమార్ ఒక దీర్ఘకాలిక పెట్టుబడిదారుడు. బడ్జెట్(Budget) ప్రకటన రాగానే ప్రవీణ్ ముఖంలో చిరునవ్వు మెరిసింది. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం 7.5 లక్షల కోట్ల క్యాపెక్స్(capex) అంటే మూలధన వ్యయాన్ని ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన మూలధన లెక్కలు చూసి ప్రతిపక్షాలు కూడా ఆశ్చర్యపోయాయి. కానీ ప్రవీణ్ ఆనందానికి కారణం వేరే ఉంది. అదేమిటంటే.. అతను పెట్టుబడి పెట్టిన కంపెనీలు.. కేంద్రం బడ్జెట్లో ప్రకటించిన మూలధన వ్యయం వల్ల లాభపడుతున్నాయి. దీవివల్ల ఆ కంపెనీల షేర్ విలువ పెరుతుంది. దీంతో ప్రవీణ్ కు పెద్ద ఆదాయం వచ్చే అవకాశం లభించింది. ప్రవీణ్ లాంటి షేర్ మార్కెట్లో(stock Market) పెట్టుబడి పెట్టె వారికి ఈ క్యాపెక్స్ ప్రకటనతో లాభం చేకూరుతుంది. ఒకవేళ ఇటువంటి స్టాక్స్ లో పెట్టుబడి పెట్టని మీలాంటి వారి మనస్సులో మనం కూడా పెట్టుబడి పెట్టి ఉంటె లాభాలు వచ్చేవి కదా అనే ఆందోళన కలగడం సహజం. కానీ, దీని కోసం మీరు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే డబ్బు సంపాదించడానికి ఇవే కాకుండా ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి.

ముందుగా అసలు కాపెక్స్ అంటే ఏమిటి అనేది మీరు అర్ధం చేసుకోవాలి. అలాగే దానితో మీకు ఉన్న సంబంధం ఏమిటి అనేది మీరు గ్రహించాలి. కాపెక్స్ లేదా మూలధన వ్యయం అంటే ప్రభుత్వం వెచ్చించే ఖర్చు ద్వారా దీర్ఘకాలం పాటు ఉపయోగపడే ఆస్తులను సృష్టించడం. ఉదాహరణకు ప్రభుత్వం డబ్బు వెచ్చించి.. దేశవ్యాప్తంగా వంతెనలు, రోడ్లు, మెషినరీ, పరికరాలు, ఫర్నిచర్, వాహనాలు, ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించడం లాంటి వాటిపై ఖర్చు చేయటం అన్నమాట. బడ్టెట్‌లో మూలధన వ్యయం పెరగటం వల్ల ఏయే రంగాలు లాభపడుతున్నాయో ఇప్పుడు అర్థం చేసుకుందాం. పిటల్ గూడ్స్, సిమెంట్, మెటల్స్/స్టీల్, పవర్& ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలు ప్రధానంగా లాభపడనున్నాయి. అయితే ఇప్పుడు అన్నింటిలో ఏ స్టాక్‌లు ఎక్కువ ప్రయోజనం పొందబోతున్నాయి? అనే అనుమానం మీకు కలగక మానదు.

బడ్జెట్ తరువాత వచ్చిన బ్రోకరేజ్ సంస్థల అంచనా ప్రకారం ఎల్&టి కంపెనీ దీని వల్ల ఎక్కువగా లాభపడనుంది. దీనికి తోడు థర్మాక్స్, సిమన్స్, ఏబిబి, బియిఎమ్ఎల్ వంటి కంపెనీలు సైతం కొత్తగా ఆర్డర్లు వస్తే లాభపడే అవకాశం ఉంటుంది. వివిధ ప్రాజెక్టుల కింద కొత్తగా రోడ్లు, హైవేలు, ఇళ్లు వంటి నిర్మాణాలకు డిమాండ్ పెరగడం వల్ల సిమెంట్ కంపెనీల వ్యాపారం ఊపందుకుంటుంది. అప్పుడు దాల్మియా భారత్, స్టార్ సిమెంట్, ఏసీసీ, అట్ల్రాటెక్ వంటి కంపెనీలకు లాభం చేకూరనుంది. ఎంతగా సిమెంట్ డిమాండ్ పెరుగుతుందో స్టీల్ డిమాండ్ సైతం అదే స్థాయిలో పెరగనుంది.

టాటా స్టీల్, NMDC, JSPL, హిందాల్కో, సెయిల్ కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి లాభాల పంట పండుతుంది. ఇదే సమయంలో 25 వేల కిలోమీటర్ల నేషనల్ హైవేలు, ఇతర నిర్మాణాలు చేపట్టడం వల్ల దిలిప్ బుల్డ్ కాన్, ఐఆర్ బి ఇన్ ఫ్రా, జే కుమార్ ఇన్ ఫ్రా, IRCON ఇంటర్నేషనల్, KNR కన్స్షక్షన్స్ లాంటి కంపెనీలు వృద్ధి చెందుతాయి. కొత్తగా ఫ్యాక్టరీలు, ఆఫీసులు, స్కూళ్లు, ఇళ్ల నిర్మాణం జరగడం వల్ల కరెంటుకు డిమాండ్ పెరుగుతుంది. దీంతో హరిత ఇంధన తయారీ చేస్తున్న అదానీ పవర్, టాటా పవర్, NTPC, పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్టీస్ కంపెనీలు లాభపడతాయి.

Read Also.. Crude Oil: సామాన్యులపై పెట్రో పిడుగు పడనుందా.. భారీగా పెరిగిన క్రూడాయిల్ ధర.. యుద్ధమే కారణమా..