Loans: తక్కువ వడ్డీకే రుణాలు కావాలా.. అయితే ఈ పని చేయండి..

హైదరాబాద్ బొల్లారం పారిశ్రామిక వాడలో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సుధీర్ లాక్‌డౌన్ సమయంలో క్రెడిట్ కార్డు(Credit Card) ద్వారా రూ.60,000 అప్పు తీసుకున్నాడు...

Loans: తక్కువ వడ్డీకే రుణాలు కావాలా.. అయితే ఈ పని చేయండి..
Business Loan
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 23, 2022 | 6:55 AM

హైదరాబాద్ బొల్లారం పారిశ్రామిక వాడలో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సుధీర్ లాక్‌డౌన్ సమయంలో క్రెడిట్ కార్డు(Credit Card) ద్వారా రూ.60,000 అప్పు తీసుకున్నాడు. కరోనా కారణంగా అతని బడ్జెట్(Budget) తలకిందులు అయింది. ఈ రుణం చెల్లించలేకపోయాడు. దీంతో సదరు క్రెడిట్ కార్డ్ కంపెనీ వడ్డీపై వడ్డీ, జరిమానా విధించడంతో ఇప్పుడు అది లక్షల్లోకి చేరుకుంది. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాడు సుధీర్. ఇది కేవలం సుధీర్ కథ మాత్రమే కాదు. ఈరోజుల్లో అకస్మాత్తుగా డబ్బు అవసరం వచ్చినప్పుడు పెద్ద సంఖ్యలో యాప్స్(loan apps), క్రెడిట్ కార్డుల ద్వారా చాలా మంది ఏమాత్రం ఆలోచించకుండా ఎక్కువ వడ్డీ అయినా సరే రుణాలు తీసుకుంటున్నారు. తీరా చెల్లింపు సమయం వచ్చేసరికి వారు అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

దేశంలో వ్యక్తిగత రుణాల పరిమాణం వేగంగా పెరుగుతోంది. RBI డేటా ప్రకారం సెప్టెంబర్ 2021లో దేశంలోని బ్యాంకుల వ్యక్తిగత రుణాల పరిమాణం రూ. 26 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ కాలంలో బ్యాంకుల మొత్తం రుణాలలో వ్యక్తిగత రుణాల వాటా 27.4 శాతం. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 25 శాతం కాగా, ఐదేళ్ల క్రితం 19.3 శాతంగా ఉంది. ముఖ్యమైన పనుల కోసం రుణం తీసుకోవడం వల్ల నష్టమేమీ లేకపోయినప్పటికీ… అప్రధానమైన విషయాల కోసం అప్పులు తీసుకోవడం నిస్సందేహంగా ఇబ్బందులను కొనితెచ్చుకోవడమే అనే విషయాన్ని అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు తప్పనిసరి పరిస్థితి వచ్చి రుణం తీసుకుంటున్నప్పటికీ, ముందుగా చౌక రుణం గురించి అంటే తక్కువ వడ్డీ ఉండే లోన్ గురించి తెల్సుకోవడం ఆవసరం. చౌకగా రుణాలు లభించే అనేక ఎంపికలు ఉన్నాయి. వీటి ద్వారా సులభంగా రుణం పొందవచ్చు. పర్సనల్ లోన్ వంటి ఇతర ఆప్షన్‌లతో పోలిస్తే ఈ లోన్ చాలా పొదుపుగా ఉంటుంది. అవేమిటో తెలుసుకుందాం.

సాధారణంగా ప్రజలు జీవిత బీమా పాలసీని కొనుగోలు చేస్తారు. అనేక పాలసీలపై లోన్ ఆప్షన్ అందుబాటులో ఉంది. దీని కోసం మీరు మీ బీమా ఏజెంట్ సేవలను కూడా తీసుకోవచ్చు. అతను కొన్ని రోజుల్లో మీ పాలసీ రుణాన్ని ఇప్పించగలుగుతాడు. మీరు ఈ పనిని ఆన్‌లైన్‌లో కూడా పూర్తి చేయవచ్చు. బీమా పథకం నుంచి మీరు ఎంత రుణం పొందుతారు అనే అంశాన్ని పరిశీలిస్తే.. బీమా పాలసీపై రుణం మొత్తం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో, పాలసీ కాలవ్యవధి అలాగే దాని ఫండ్ విలువ ముఖ్యమైనది. సాధారణంగా, కంపెనీలు సరెండర్ విలువ ప్రకారం రుణాన్ని లెక్కిస్తాయి. సరెండర్ విలువలో 85 శాతం వరకు రుణం సులభంగా లభిస్తుంది. చైల్డ్ ప్లాన్‌లు, మనీ బ్యాక్, యాన్యుటీ ప్లాన్‌ల వంటి ప్రత్యేక ఉత్పత్తులపై లోన్ సౌకర్యం అందుబాటులో లేదు.

మరి ఈ లోన్స్ పై వడ్డీ ఎంత ఉంటుందో తెలుసుకుందాం. ప్రస్తుతం, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డ్ రుణాలపై వడ్డీ రేటు సంవత్సరానికి 11 నుండి 36 శాతం మధ్య ఉంది. బీమా పాలసీపై రుణాలపై వడ్డీ తొమ్మిది శాతానికి దగ్గరగా ఉంటుంది. బీమా కంపెనీలు వాటి ధరకు అనుగుణంగా రుణంపై వడ్డీ రేటును నిర్ణయిస్తాయి. మార్కెట్ ట్రెండ్‌ను బట్టి ఈ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. పాలసీదారు ఈ లోన్‌ని నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక వాయిదాలలో తిరిగి చెల్లించడానికి ఎంచుకోవచ్చు. ఒకవేళ మీకు ఒకేసారి డబ్బు సమకూరితే మీ లోన్ మొత్తాన్ని ఒకేసారి చెల్లించవచ్చు. దీనిపై ముందస్తు చెల్లింపు ఖర్చులు ఉండవు.

FDలో రుణాలు సులభంగా లభిస్తాయి. చిన్నపాటి ఫార్మాలిటీలను పూర్తి చేసిన తర్వాత ఈ లోన్ సులభంగా లభిస్తుంది. ఈ రుణం FDపై వడ్డీతో పోలిస్తే ఒక శాతం ఎక్కువ. ఇది కాకుండా, EPF, PPF, NSC, కిసాన్ వికాస్ పత్ర మొదలైన వాటిపై రుణ సదుపాయం ఉంది. బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఆర్థిక సలహాదారు జితేంద్ర సోలంకి అత్యవసర పరిస్థితుల్లో పాత పెట్టుబడిపై రుణం తీసుకోవడం మంచి ఎంపిక అని అంటున్నారు. ఈ రుణం సురక్షితం కాబట్టి ఇది చౌకగా ఉంటుంది. దీని వల్ల రుణం ఇచ్చే సంస్థకు ఎలాంటి నష్టం కలగకపోయినా కొంత ఆదాయం వస్తుంది. కాబట్టి రుణ ప్రక్రియ కూడా చాలా సులభంగా ఉంటుందని ఆయన చెబుతున్నారు. అయితే, ఈ రుణం చాలా అత్యవసరమైనప్పుడు మాత్రమే తీసుకోవాలని సోలంకి సూచిస్తున్నారు.

Read Also.. Stock Market: నష్టల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 383, నిఫ్టీ 114 పాయింట్లు డౌన్..