Mutual Fund: మీ దగ్గర రూ. 100 ఉన్నాయా.. అయితే మ్యూచువల్‌ ఫండ్‌లో పెట్టుబడి పెట్టొచ్చు..

చాలా మంది స్టాక్ మార్కెట్‌(Stock Market)లో పెట్టుబడి పెట్టాలనుకుంటారు...

Mutual Fund: మీ దగ్గర రూ. 100 ఉన్నాయా.. అయితే మ్యూచువల్‌ ఫండ్‌లో పెట్టుబడి పెట్టొచ్చు..
Stocks Vs Mutual Funds
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 23, 2022 | 7:15 AM

చాలా మంది స్టాక్ మార్కెట్‌(Stock Market)లో పెట్టుబడి పెట్టాలనుకుంటారు. కానీ వారికి మార్కెట్ మీద అవగాహన లేక ఆగిపోతుంటారు. అలాంటి వారికి మ్యూచువల్‌ ఫండ్(Mutual Fund) మంచి ఎంపిక అవుతుంది. అయితే మ్యూచువల్‌ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలంటే లక్షల్లో డబ్బులుండాలా అంటే.. అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు రూ.100తో కూడా మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వె్స్ట్‌మెంట్ చేయొచ్చు. అన్ని ఫండ్లలో ఈ సౌకార్యం ఉండదు కొన్ని ఫండ్ల మాత్రమే తక్కువ మొత్తం పెట్టుబడిని స్వీకరిస్తాయి. అయితే మ్యూచవల్‌ ఫండ్‌లో అనేక రకాలు ఉంటాయి. అందులో డెట్, ఈక్విటీ(Equity) ఫండ్లు ఉంటాయి. డెట్ ఫండ్ అంటే పెట్టిన పెట్టుబడి అలానే ఉంటుంది. ఈక్విటీ ఫండ్లు స్టాక్‌ మార్కెట్‌ను బట్టి ఉంటాయి. పెట్టిన పెట్టుబడి పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్‌ టర్మ్‌లో చేస్తే మంచి లాభాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మ్యూచువల్ ఫండ్ పంపిణీ వేదిక ZFunds రోజువారీ SIP రూ. 100తో మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంతాలు ..చిన్న పట్టణాలలో నివసించే ప్రజల కోసం ఈ పథకం ప్రారంభించబడింది. ఈ SIP ప్లాన్ ICICI ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, HDFC మ్యూచువల్ ఫండ్ ..టాటా మ్యూచువల్ ఫండ్‌ల సహకారంతో పరిచయం చేశారు. టైర్-2, టైర్-3, టైర్-4 నగరాల్లో నివసించే ప్రజల అవసరాలను తీర్చడం ఈ ఫండ్ పథకం లక్ష్యం. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల రోజువారీ సంపాదన రేటు ఎక్కువగా ఉన్నందున ఈ పథకం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఒక వ్యక్తి రోజూ ఈ పథకంలో రూ.100 పెట్టుబడి పెట్టవచ్చు. దీంతో రోజువారీ కార్మికులు, చిరు వ్యాపారులు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే.. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆర్థిక నిపుణులను సంప్రదించాలి.

Read Also.. Loans: తక్కువ వడ్డీకే రుణాలు కావాలా.. అయితే ఈ పని చేయండి..