AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND-PAK: ప్రధాని మోడీని టీవీ చర్చకు ఆహ్వానించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్..

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొత్త ప్రతిపాధన భారత్ ముందుకు తెచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీతో టీవీ ఇంటర్వ్యూలో పాల్గొనాలని ఉందంటూ ప్రతిపాదనలు చేశారు. భారత్-పాకిస్తాన్..

IND-PAK: ప్రధాని మోడీని టీవీ చర్చకు ఆహ్వానించిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్..
Imran Khan And Modi
Sanjay Kasula
|

Updated on: Feb 22, 2022 | 9:04 PM

Share

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్( Imran Khan) కొత్త ప్రతిపాధన భారత్ (India)ముందుకు తెచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీతో(PM MODI) టీవీ ఇంటర్వ్యూలో పాల్గొనాలని ఉందంటూ ప్రతిపాదనలు చేశారు. భారత్-పాకిస్తాన్ మధ్యనున్న వివాదాలకు స్వస్తి చెప్పి ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పాలని ఉందని అన్నారు. అందుకు ప్రధాని మోడీతో టీవీ ఇంటర్వ్యూలో పాల్గొనాలని ఉందని పాక్ పీఎం ఇమ్రాన్ కాన్ సోమవారం ప్రకటించారు. పాక్‌పై భారత్‌కు ఎలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ ఇరు దేశాల మధ్య సానుకూల వాతావరణం కోసం తాము ప్రయత్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. రష్యా టుడేకి సోమవారం ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ ప్రతిపాధనను తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నరేంద్రమోదీతో టీవీ డిబేట్లో పాల్గొనాలని ఉంది. భారత ఉపఖండంలో ఉన్న కోట్లాది మందికి ఈ డిబేట్ ఉపయోగకరంగా ఉంటుంది. భారత్ శత్రు దేశంగా మారింది. అందుకే వారితో వ్యాపారం చేయలేకపోతున్నాం. ఇరు దేశాల మధ్య సాన్నిహిత్యం పెరిగితే వ్యాపార లావాదేవీలు పెరుగుతాయి. ఇది ఇరు దేశాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది’’ అని అంటూ రష్యా టుడే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

అయితే, ఇమ్రాన్ ఖాన్ చేసిన ప్రతిపాధనకు భారత విదేశాంగ శాఖ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. గతంలోనే భారత విదేశాంగ శాఖ ఓ కీలక ప్రకటన చేసింది. ఉగ్రవాదం-చర్చలు ఒకేసారి కుదరదని తేల్చి చెప్పింది.. భారత్‌తో చర్చలు చేయాలనుకుంటే ఉగ్రవాదాన్ని వదిలేయాలని సూచించింది. ‘ఉగ్రవాద రహిత వాతావరణం’లో మాత్రమే చర్చలు జరుగుతాయని భారత్ పాకిస్థాన్‌కు పదే పదే చెబుతోంది. చర్చలు జరిగే ముందు ఉగ్రవాదంపై అణిచివేతకు సంబంధించిన ఆధారాలు చూపించాలని ఇస్లామాబాద్‌ను న్యూఢిల్లీ కోరింది. అలాగే కశ్మీర్‌లో టెర్రరిస్టులకు అడ్డుకట్ట వేసేవరకు చర్చలు లేవని తెగేసి చెప్పింది భారత ప్రభుత్వం.

2008లో ముంబైలోని తాజ్ హోటల్ వద్ద జరిగిన ఉగ్రదాడి.. పఠాన్‌కోట్‌లో 2016లో జరిగిన ఉగ్రదాడి అలాగే 2019లో కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడుల కారణంగా భారత్.. పాకిస్తాన్ మధ్య మరింత దూరం పెంచింది. ఈ దాడులకు పాకిస్తానే కారణమనే విషయం తెలిసిన సంగతే.. పుల్వామా దాడికి ప్రతిగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై భారత్ మెరుపు దాడులు చేసింది.

ఇవి కూడా చదవండి: Telangana BJP: బండెనక బండి కట్టి.. నియోజకవర్గాలకు దూరమవుతున్న ఆ కమలం నేతలు..