IRCTC Credit Card: రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ క్రెడిట్ కార్డు.. పూర్తి వివరాలు..!
IRCTC BoB RuPay: రైల్వే ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్ అందింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), బ్యాంకు ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్..
IRCTC Credit Card: రైల్వే ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్ అందింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), బ్యాంకు ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ (BFSL)లతో కలిసి సోమవారం రైల్వే ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేకంగా ఓ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును పరిచయం చేసింది. అయితే రైలు ప్రయాణం ఎక్కువగా చేసేవారికి ఇది ఉపయోగపడనుంది. రైలు ప్రయాణికులకు గరిష్టంగా ఆదాచేసేలా ఐఆర్‌సీటీసీ బీవోబీ రూపే (IRCTC BoB RuPay) కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డును తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఇంధనం, పప్పు దినుసులనూ ఈ కార్డుపై కొనుగోలు చేయవచ్చని, జేసీబీ నెట్‌వర్క్ ద్వారా ఏటీఎంలు, అంతర్జాతీయ వ్యాపారుల వద్ద కూడా దీనిని ఉపయోగించుకోవచ్చని అధికారులు వెల్లడించారు. దీని ద్వారా రివార్డు పాయింట్లను పొందవచ్చు. అయితే కార్డుదారులు తమ లాయల్టీ నంబర్‌ను ఐఆర్‌సీటీసీ లాగిన్ ఐడితో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌పై రివార్డు పాయింట్లను రిడీమ్ కూడా చేసుకోవచ్చు. కార్డు జారీ ఏచసిన 45 రోజులలోపు రూ.1000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన కొనుగోలు చేసిన కస్టమర్లు 1000 బోనస్ రివార్డు పాయింట్లు పొందవచ్చు.
ఐఆర్‌సీటీసీ ద్వారా రోజూ 6.6 కోట్ల టికెట్ల బుకింగ్
కాగా, ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. రైలు టికెట్లను సులభంగా పొందేందుకు ఐఆర్‌సీటీసీ సర్వర్‌ను మరింతగా మెరుగు పరుస్తోంది. రోజూ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌పై రైల్వే టిక్కెట్లను బుక్ చేస్తున్నవారు 6.6 కోట్ల మంది ఉన్నారని ఎన్‌వీసీఐ సీవోవో ప్రవీణ రాయ్ పేర్కొన్నారు. ప్రతి నిత్యం7-7.5 లక్షలకుపైగా టిక్కెట్ బుకింగ్స్ జరుగుతున్నాయని అన్నానరు. ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు.
ఇవి కూడా చదవండి: